E-Paper
Advertisement

Front Load vs Top Load Price: రెండింటిలో ఏ వాషింగ్ మిషన్ ధర ఎక్కువ? అందుకు గల కారణాలేంటి?

Front Load vs Top Load Price: రెండింటిలో ఏ వాషింగ్ మిషన్ ధర ఎక్కువ? అందుకు గల కారణాలేంటి?
Advertisement

Front Load vs Top Load Price: ప్రస్తుతం మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన వాషింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. అధునాతన టెక్నాలజీ, స్మార్ట్ ఫీచర్లు, వాషింగ్ విధానం కారణంగా వివిధ ధరల్లో లభిస్తున్నాయి. అయితే మార్కెట్ లో ఎన్ని వాషింగ్ మిషన్లు ఉన్నప్పటికీ అవి ప్రధానంగా రెండు వేరియంట్లలోనే లభిస్తున్నాయి. ఒకటి ఫ్రంట్ లోడ్ కాగా.. మరొకటి టాప్ లోడ్ వాషింగ్ మిషన్. అయితే టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ చాలా ఖరీదైన వాషర్ గా ఉంటూ వస్తోంది. ఇందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

ధర పరంగా చూస్తే..

మార్కెట్ లోని ధరల పరంగా చూస్తే టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఖరీదైనదిగా ఉంటూ వస్తోంది. తయారీలోని సవాళ్లు, మెరుగైన పనితీరు, సమర్థవంతమైన వాషింగ్ విధానం వల్ల ధర పరంగా ఫ్రంట్ లోడ్ కాస్త పైచేయి సాధిస్తోంది. ఇందుకు గల కారణాలను మరింత వివరంగా చూద్దాం.

సంక్షిష్టమైన డిజైన్..

Advertisement

డిజైన్ పరంగా చూస్తే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో డ్రమ్ హారిజాంటల్ (సమాంతర) దిశలో ఉంటుంది. టాప్ లోడ్ లోని వర్టికల్ డ్రమ్ డిజైన్ తో పోలిస్తే దీని నిర్మాణం చాలా సవాళ్లతో కూడికొని ఉంటుంది. ఫ్రంట్ లోడ్ లో వైబ్రేషన్స్ ను నియంత్రించడానికి బలమైన సస్పెన్షన్, నీరు బయటకు రాకుండా స్ట్రాంగ్ డోర్ సీల్ అవసరం. ఇది ధరను పెంచేందుకు దోహదం చేస్తున్నాయి.

అధునాతన సాంకేతికత..

టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ మిషన్లు అధిక స్పిన్ స్పీడ్ (RPM) ను కలిగి ఉంటాయి. ఇది బట్టలను మరింత వేగంగా, సమర్థవంతంగా ఉతికేందుకు దోహదం చేస్తుంది. అలాగే మరిన్ని వాష్ సైకిల్స్, స్మార్ట్ ఫీచర్లు ఆటోమేటిక్ లోడ్ సెన్సింగ్ టెక్నాలజీ వీటిలో ఉండటం వల్ల ఫ్రంట్ లోడ్ ధర అమాంతం పెరిగిపోతుంటుంది.

విద్యుత్ ఆదా..

Advertisement

టాప్ లోడ్ తో పోలిస్తే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లు.. 40-50 శాతం మేర తక్కువ నీటిని వినియోగిస్తాయి. అలాగే విద్యుత్ ను సైతం ఆదా చేస్తాయి. ఫ్రంట్ లోని అధునాతన ఎనర్జీ ఎఫిషియెంట్ మోటర్లు, సెన్సార్లు, డిజైన్ కారణంగా ఇది సాధ్యమవుతోంది. ఇందుకోసం వినియోగించే కాంపోనెంట్లు ఖరీదైనవి కావడం వల్ల సహజంగానే ఫ్రంట్ లోడ్ ధర.. టాప్ లోడ్ కంటే ప్రియంగా ఉంటోంది.

Also Read: Summer Best AC: సమ్మర్‌ను చల్లగా మార్చే.. వర్ల్‌పూల్ 3D Cool Pro+ ఏసీ.. నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు బ్రో!

దుస్తుల నాణ్యత

టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ లో వాషింగ్ కాస్త బెటర్ పనితీరును అందిస్తాయి. దుస్తుల విషయంలో సున్నితమైన వాషింగ్ టెక్నాలజీని వినియోగిస్తాయి. ఫ్రంట్ లోడ్.. బట్టల మురికిని సమర్థవంతంగా తొలగించడంతో పాటు వాటి నాణ్యత దెబ్బతినకుండా సంరక్షిస్తాయి. హై-క్వాలిటీ మెటీరియల్స్ ను ఇందులో వేసినా.. ఎలాంటి డ్యామేజ్ ఉండదు. కాబట్టి బట్టల వాషింగ్ విషయంలో ఫ్రంట్ లోడ్ తన ఆధిక్యతను చాటుతూనే ఉంటుంది.  ఈ కారణం చేతనే టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ ఖరీదైనవిగా ఉంటున్నాయి.

Also Read: Tata Harrier EV: ఫస్ట్ డే 10 వేల బుకింగ్స్, టాటా హారియర్ EV దుమ్మురేపుతోందిగా!

Related News

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే! బడ్జెట్‌లో.. బెస్ట్ 4K డాల్బీ ఆడియో టీవీలు!

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

Big Stories

Advertisement
×