E-Paper
Advertisement

Summer Best AC: సమ్మర్‌ను చల్లగా మార్చే.. వర్ల్‌పూల్ 3D Cool Pro+ ఏసీ.. నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు బ్రో!

Summer Best AC: సమ్మర్‌ను చల్లగా మార్చే.. వర్ల్‌పూల్ 3D Cool Pro+ ఏసీ.. నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు బ్రో!
Advertisement

Summer Best AC: ప్రముఖ టెక్ కంపెనీ వర్ల్‌పూల్ (Whirlpool) గృహోపకరణ వస్తువులకు మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుత సమ్మర్ లో ఏసీలకు పెరిగిన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని వర్ల్ పూల్ అధునాతన అగ్రశ్రేణి ఏసీని మార్కెట్ లో విడుదల చేసింది. ‘Whirlpool 3D Cool Pro+ AC’  సిరీస్ పేరుతో అధునాతన ఏసీలను భారత మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నయా ఏసీలకు సంబంధించిన ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కఠినమైన వేడిలోనూ చల్లగా..

3D Cool Pro+ AC సిరీస్ లాంచ్ సందర్భంగా వర్ల్ పూల్ ఇండియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ నకుల్ తివారీ మాట్లాడారు. వినియోగదారుల అభిరుచులు, అంచనాలకు అనుగుణంగా అధునాతన సాంకేతికతతో 3D కూల్ ప్రో+ ఏసీలను తీసుకొచ్చినట్లు చెప్పారు. తీవ్రమైన పరిస్థితుల్లోనూ ఈ ఏసీలు మెరుగైన పనితీరు కనబరుస్తుందన్నారు. ప్రస్తుతం మార్కెట్ లోని ఏసీలతో పోలిస్తే గదిని అత్యుత్తమంగా చల్లబరుస్తుందని దీమా వ్యక్తం చేశారు.

3D కూల్ ప్రో+ టెక్నాలజీ

Advertisement

వర్ల్ పూల్ కొత్త ఏసీ సిరీస్ ఫీచర్ల విషయానికి వస్తే ఇది 3D కూల్ టెక్నాలజీతో పనిచేయనుంది. పవర్ ఫుల్ కూలింగ్ ను అందించడంలో ఈ సాంకేతిక ఉపయోగపడుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ 3డీ కూల్ టెక్నాలజీ.. గదిలోని వేడి గాలిని అత్యంత వేగంగా తొలగించి శీతలగాలితో రూమ్ ను నింపివేస్తుందని పేర్కొన్నాయి. 60 అడుగుల దూరం వరకూ శక్తివంతమైన చల్లగాలిని ప్రసారం చేస్తుందని తెలియజేశారు. పెద్ద గదులు ఉన్న ఇళ్లకు ఈ నయా ఏసీ సరిగ్గా సరిపోతుంది.

స్వచ్ఛమైన చల్లటి గాలితో..

గది ఉష్ణోగ్రతలు 56°C గరిష్టానికి చేరుకున్న సమయంలోనూ ఈ ఏసీ మెరుగైన పనితీరు కనబరుస్తుంది. ఇక ఇందులోని సిల్వర్ అయాన్ ఫిల్టర్లు యాంటీ మైక్రోబయల్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి గాలిలోని బ్యాక్టీరియా, అలెర్జీ కారకాలను తొలగించడంలో సాయపడతాయి. తద్వారా శుభ్రపరమైన చల్లటి గాలిని ప్రసారం చేసి పిల్లలు, వృద్ధులు, ఇతర కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడకుండా రక్షిస్తాయి.

6th సెన్స్ టెక్నాలజీ

Advertisement

వర్ల్ పూల్ 3D కూల్ ప్రో+ ఏసీ 6th సెన్స్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. ఒకే బటన్ నొక్కడం ద్వారా గది ఉష్ణోగ్రత, తేమ, గాలి ప్రసరణనను ఇది నియంత్రణలోకి తెచ్చేసుకుంటుంది. ఇందులోని ఫోకస్డ్ ఎయిర్ మోడ్ ను ఆన్ చేయడం ద్వారా గదిని చాలా వేగంగా చల్లబరుచుకోవచ్చు. ఇక ఇందులోని గోల్డెన్ ఫిన్ టెక్నాలజీ.. తుప్పు పట్టడాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఇందులో 100 శాతం రాగి కండెన్సర్ లు వినియోగించారు. ఇవి విద్యుత్ లోని హెచ్చతగ్గులను నియంత్రిస్తూ ప్రభావవంతమైన శీతలీకరణకు దోహదం చేస్తాయి.

Also Read: World’s Richest Village: ప్రపంచంలో అత్యంత ధనిక గ్రామం.. ప్రతి ఇంట్లో ఓ బిలియనీర్, ఎక్కడో తెలుసా?

ప్రారంభ ధర ఎంతంటే?

3D కూల్ ప్రో+ శ్రేణిలో 6-ఇన్-1 ఎక్స్‌ప్యాండ్ టెక్నాలజీని అమర్చారు. గది ఉష్ణోగ్రతల ఆధారంగా శీతలీకరణ సామర్థ్యాన్ని సర్దుబాటు చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. 3D కూల్ ప్రో+ శ్రేణిలో మెుత్తం ఐదు వేరియంట్లలో ఏసీలు అందుబాటులో ఉన్నాయి. 1 టన్, 1.5 టన్, 2 టన్, 3 స్టార్ తో పాటు 5 స్టార్ ఎనర్జీ రేటింగ్స్ లో వర్ల్ పూల్ కొత్త ఏసీలను లాంచ్ చేసింది. ఈ ఏసీ ప్రారంభ ధర రూ.29,600గా ఉంది. ప్రముఖ రిటైల్ దుకాణాలు, ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లలో 3D కూల్ ప్రో+ ఏసీలు లభిస్తున్నాయి.

Also Read: Nizamabad Politics: నిజామాబాద్‌లో హీట్ పాలిటిక్స్.. మున్సిపోరులో తమ్ముడికి చెక్ పెట్టిన ధర్మపురి సంజయ్..!

Related News

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×