Couple Suicide: దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తమ కొడుకు లేని ఈ లోకంలో ఉండలేమంటూ సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నారు. సంచలనం రేపిన ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో వెలుగుచూసింది. ఈ హృదయ విదారక ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అసలేం జరిగింది?
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. దంపతుల ఆత్మహత్య
జంజ్‌గిర్-చంపా జిల్లాలోని దర్దేయి ప్రాంతానికి చెందినవారు కృష్ణ పటేల్-రమాబాయి పటేల్ దంపతులు. వృత్తిరీత్యా తాపీ మేస్త్రి కృష్ణ కాగా, రమాబాయి గృహిణిగా ఉండేది. వారి ప్రపంచం కొడుకు ఆదిత్య. ఈ జంటకు 21 ఏళ్ల ఆదిత్య పటేల్ ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు.
రెండేళ్ల కిందట అంటే 2024లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆదిత్య ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఆనాటి నుంచి దంపతులు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. కొడుకు మరణం తర్వాత ఇల్లు నిశ్శబ్దంగా మారింది. ఇంట్లో నుంచి అడుగు తీసి బయటకు వేస్తే నిత్యం కొడుకు గుర్తుకు వచ్చేవాడు. దాన్ని నుంచి ఈ దంపతులు బయటపడలేకపోయారు.
సూసైడ్ లేఖలో కీలక విషయాలు.. కొడుకు వల్లే
చివరకు ఆదివారం రాత్రి ఇంట్లోని ఓ చెట్టుకు చీరతో ఉరి వేసుకున్నారు. సోమవారం ఉదయం గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కృష్ణ పటేల్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ క్రమంలో వారి రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌తోపాటు ఓ వీడియో సందేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మా జీవితంలో కొడుకు ఒక్కడేనని, వాడు లేని జీవితం శూన్యమంటూ రాసుంది. ఈ నేపథ్యంలో తాము కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నామని, దీనికి ఎవరూ బాధ్యులు కారని అందులో ప్రస్తావించారు. దేవుడు దయగల వాడని, ఇప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. చివరకు నా విధి దేవునిలో విలీనం కావడమేనని రాసుకొచ్చారు.
ALSO READ: మదనపల్లిలో విషాదం.. ఏడేళ్ల బాలికను చంపేసి డ్రమ్ములో కుక్కి
మా కోసం ఏ ఒక్కరూ దుఃఖానికి లోనుకావద్దని, తాము ఈ లోకాన్ని ఆనందంగా వదిలి వెళ్తున్నామని తెలియజేశారు. తమ కుమారుడికి రావాల్సిన పరిహారం డబ్బులు తన సోదరులకు ఇవ్వాలని వీడియోలో కోరారు కృష్ణపటేల్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే సూసైడ్ నోట్, వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి దర్యాప్తు చేస్తున్నారు.