Best Portable ACs 2026: ప్రస్తుత సమ్మర్ లో ఏసీల వినియోగం భారీగా పెరిగిపోయింది. అయితే అద్దె ఇళ్లల్లో ఉండేవారు, గోడకు ఏసీ తగిలించే సౌకర్యం లేనివారు నేలపై ఉంచే పోర్టబుల్ ఏసీలపై ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా వీటిని ఒక గది నుంచి మరో గదికి ఈజీగా తీసుకెళ్లగల్గడంతో చాలా మంది అత్యుత్తమ పోర్టబుల్ ఏసీల కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో 2026లో ఇప్పటివరకూ వచ్చిన వాటిలో బెస్ట్ పోర్టబుల్ ఏసీలను ఇక్కడ అందించడం జరుగుతోంది. వాటి ఫీచర్లు గమనించి.. మీ అభిరుచికి దగ్గరగా ఉన్న దానిని ట్రై చేయండి.
ఈ పోర్టబుల్ ఏసీ.. ఇన్వర్టర్ టెక్నాలజీతో పనిచేయనుంది. దీనిని స్మార్ట్‌ఫోన్ యాప్ లేదా వాయిస్ అసిస్టెంట్ కంట్రోల్ చేయవచ్చు. సాధారణ ఏసీలతో పోలిస్తే ఇది 40% వరకు తక్కువ విద్యుత్తును వినియోగిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. చాలా తక్కువ శబ్దంతో పనిచేయడం వల్ల రాత్రిళ్లు హాయిగా నిద్రపోవచ్చని తెలియజేస్తున్నాయి.
ఎల్జీకి చెందిన ఈ పోర్టబుల్ ఏసీ.. డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీని కలిగి ఉంది. దీనిలోని పవర్ ఫుల్ కంప్రెసర్ గాలిని చాలా వేగంగా కూల్ చేసేస్తుంది. ఎల్జీ థింక్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా ఈ ఏసీని ఆపరేట్ చేయవచ్చు. దీనికి LCD డిస్ ప్లే, రిమోట్ కంట్రోల్ వ్యవస్థ సైతం ఉంది.
చిన్నగదులు, తక్కువ స్థలంలో ఫిట్ అయ్యే పోర్టబుల్ ఏసీని కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. గాలి పైకి వచ్చేలా ఈ పోర్టబుల్ ఏసీని డిజైన్ చేయడం వల్ల గది అంతా త్వరగా చల్లబడుతుంది. దుమ్ము, ధూళిని తొలగించడానికి ఇందులో సమర్థవంతమైన ఫిల్టర్లను అమర్చారు. ఈ ఏసీ అడుగు భాగంలో చక్రాలు ఉండటం వల్ల ఒక గది నుండి మరో గదికి సులభంగా తీసుకెళ్లవచ్చు.
ఈ పోర్టబుల్ ఏసీ.. డ్యూయల్ హోస్ సిస్టమ్ ను కలిగి ఉంది. ఒక పైపు బయట గాలిని తీసుకుంటే.. మరొకటి వేడి గాలిని బయటకు పంపిస్తుంది. దీనివల్ల గది చాలా వేగంగా చల్లబడుతుంది. పర్యావరణానికి హాని చేయని రిఫ్రిజెరెంట్లను ఇందులో ఉపయోగించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పెద్ద గదులను కూడా ఇది సమర్థవంతంగా కూల్ చేయగలదని పేర్కొన్నాయి.
పవర్ ఫుల్ పోర్టబుల్ ఏసీని కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది 1.5 టన్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో 100% కాపర్ కండెన్సర్ ఉండటం వల్ల మెరుగైన కూలింగ్ లభిస్తుంది. స్లీప్ మోడ్, డ్రై మోడ్, ఆటో మోడ్ వంటి విభిన్న ఆప్షన్లు దీనిలో ఉన్నాయి.
Also Read: BSNL Plan: కేవలం రూ.8కే.. 2.5GB హై స్పీడ్ డేటా.. 30 రోజులు నాన్‌స్టాప్ ఫన్!