E-Paper
Advertisement

BSNL Plan: కేవలం రూ.8కే.. 2.5GB హై స్పీడ్ డేటా.. 30 రోజులు నాన్‌స్టాప్ ఫన్!

BSNL Plan: కేవలం రూ.8కే.. 2.5GB హై స్పీడ్ డేటా.. 30 రోజులు నాన్‌స్టాప్ ఫన్!
Advertisement

BSNL Plan: ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL).. తన కస్టమర్లకు తక్కువ బడ్జెట్ లోనే మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంటుంది. అతి తక్కువ ధరలో లభించే రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా ఎన్నో అద్భుతమైన లాభాలను బీఎస్ఎన్ఎల్ యూజర్లు పొందుతుంటారు. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ.225 ప్రీపెయిడ్ ప్లాన్.. ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాని వల్ల యూజర్లకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

రూ.225 రీఛార్జ్ ప్లాన్..

ఈ ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ 30 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. అంటే రోజుకు దాదాపు రూ.8 మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే ప్రతీ రోజూ 2.5GB హై స్పీడ్ డేటా యూజర్ కు లభిస్తుంది. అలాగే దేశంలో ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమిత లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 SMSలను యూజర్ పంపుకోవచ్చు.

ఈ ప్లాన్ తో ఎవరికి ప్రయోజనం?

Advertisement

ఈ ప్లాన్ కింద రోజుకు 2.5 GB డేటా లభిస్తుంది కాబట్టి.. యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా అధికంగా చూసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. 28 రోజులు కాకుండా పూర్తి 30 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ వచ్చినందువల్ల బడ్జెట్ ప్లాన్ కోరుకునేవారికి ఉపయోగకరం. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోలిస్తే.. ఈ ధరకు ఇంత ఎక్కువ డేటా ఈ ప్లాన్ లోనే లభిస్తుండటం విశేషం.

Also Read: ఏసీలో పసిపిల్లల్ని పడుకోబెడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే చాలా ప్రమాదం!

రీఛార్జ్ ఎలా చేసుకోవాలి?

Advertisement

బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ (BSNL Selfcare App)లో రీఛార్జ్ (Recharge) సెక్షన్ వెళ్లి నేరుగా ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ portal.bsnl.in లో మీ మొబైల్ నంబర్ ఇచ్చి ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కుదరని పక్షంలో థర్డ్ పార్టీ యాప్స్ అయిన గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎంలలో ప్రీపెయిడ్ ప్లాన్స్ వద్దకు వెళ్లి రూ.225 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: Jio Plan: రోజుకు రూ.10 మాత్రమే.. 98 రోజుల పాటు.. అపరిమిత 5G డేటా, ఉచిత ఓటీటీలు!

Related News

గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!

నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!

రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

డిజైన్ పిచ్చెక్కిస్తోంది బాబోయ్.. ఐకూ లవర్స్‌కి ఇది కదా కావాల్సింది!

యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

8,000mAh బ్యాటరీనా.. అమోలెడ్ స్క్రీనా? ఈ 3 కొత్త 5G ఫోన్లలో ఏది కొనుగోలు చేయడం ఉత్తమం?

Big Stories

Advertisement
×