Trending Mobiles India Feb 2026: ఫిబ్రవరి వచ్చిందంటే చాలు.. టెక్ ప్రియులంతా ఫుల్ ఖుషీ అయిపోతుంటారు. ఎందుకంటే.. దాదాపు అన్ని పెద్ద కంపెనీలు తమ కొత్త గ్యాడ్జెట్లను రిలీజ్ చేసేది ఈ నెలలోనే. ఈసారి మొబైల్ మార్కెట్ చూస్తుంటే అసలు పోటీ మామూలుగా లేదు. ప్రతి కంపెనీ ఒకదానిని మించి ఒకటి అన్నట్టుగా ప్రీమియం ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. వినియోగదారుల టేస్ట్‌కు తగ్గట్టుగా.. ప్రీమియం లుక్ కావాలనుకునే వారి నుంచి తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు వెతికేవాళ్ల కోసం ఈ నెలలో బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయి.
ముఖ్యంగా ఈసారి స్మార్ట్‌ఫోన్లన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మంత్రం జపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా స్మార్ట్ ఫీచర్లు, ప్రొఫెషనల్ కెమెరాలు, ఇక రోజంతా తెగ వాడినా అస్సలు తగ్గని బ్యాటరీ లైఫ్‌తో ఈ కొత్త ఫోన్లు మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెలలో ట్రెండ్ సెట్ చేయబోతున్న టాప్-5 మొబైల్స్ ఏవో ఓసారి చూసేద్దామా..
ఐఫోన్ తర్వాత యువత ఎక్కువగా మెచ్చని బ్రాండ్ శాంసంగ్. ఈ నెలలో తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌తో మార్కెట్‌ను షేక్ చేయడానికి రెడీ అయిపోయింది. ఫిబ్రవరి 25న రాబోతున్న ఈ సిరీస్‌లో Ultra మోడల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిలో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ వాడుతున్నారు. ఇక 200MP కెమెరా అంటే ఫోటోలు నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయి. దీనికి తోడు కొత్త గెలాక్సీ AI ఫీచర్లు ఉండటం వలన మన పనులు మరింత సులభం అవుతాయి.
Also Read: రూ.999కే బోట్ ప్రీమియం నెక్‌బ్యాండ్.. అమెజాన్ లిమిటెడ్ పీరియడ్ డీల్‌ను అస్సలు మిస్ అవ్వకండి!
గూగుల్ పిక్సెల్ అంటేనే సాఫ్ట్‌వేర్ కింగ్. ఈసారి కాస్త ముందుగానే ఫిబ్రవరి 18న Pixel 10aని మార్కెట్‌లోకి దించుతోంది సంస్థ. దీనిలో వాడిన టెన్సర్ G5 చిప్ వల్ల ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. తక్కువ ధరలో గూగుల్ కెమెరా క్వాలిటీని, జెమిని AI మ్యాజిక్‌ను ఎక్స్ పీరియన్స్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
స్టైలిష్ ఫోన్ కావాలనుకునే వారికి వివో V Series గుర్తొస్తుంది. ఫిబ్రవరి 19న లాంచ్ అవుతున్న V70, V70 ఎలైట్ మోడల్స్ మెయిన్ హైలైట్ ఏంటంటే.. Zeiss లెన్స్‌తో వచ్చే 50MP కెమెరా. ఇక బ్యాటరీ విషయంలో అస్సలు టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే.. దీనిలో 6,500mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి.. కొన్ని నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది.
గేమింగ్ లవర్స్ కోసం ఐకూ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 24న విడుదల కానున్న iQOO 15R చూస్తే షాక్ అవ్వాల్సిందే. 7,600mAh అంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా ఫోన్ మాత్రం చాలా సన్నగా, క్లాసీగా ఉంటుంది. దీనిలో వాడిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో గేమింగ్ ఆడుతుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాపిల్ లవర్స్ కోసం కంపెనీ తీపి కబురు చెప్పింది. iPhone 17e ఈ ఫిబ్రవరి నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ తక్కువ ధరలోనే యాపిల్ లోగోతో పాటు A19 ప్రాసెసర్, ఫేస్ ఐడి లాంటి ఫీచర్లను కలిగి ఉండనుంది. బడ్జెట్‌లో ఐఫోన్ అంటే.. ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పండి.
Also Read: వివో నుంచి కేక పుట్టించేలా ‘ప్యాషన్ రెడ్’ వేరియంట్.. ఈ ఫోన్ స్టైల్ చూస్తే చూపు తిప్పుకోలేరు!