E-Paper
Advertisement

Vivo V70 Series: వివో నుంచి కేక పుట్టించేలా ‘ప్యాషన్ రెడ్’ వేరియంట్.. ఈ ఫోన్ స్టైల్ చూస్తే చూపు తిప్పుకోలేరు!

Vivo V70 Series: వివో నుంచి కేక పుట్టించేలా ‘ప్యాషన్ రెడ్’ వేరియంట్.. ఈ ఫోన్ స్టైల్ చూస్తే చూపు తిప్పుకోలేరు!
Advertisement

Vivo V70 Series: సాధారణంగా చాలామంది యువత స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం బడ్జెట్, ఫీచర్లు, ధర వంటి వివరాలనే కాకుండా.. ఆ ఫోన్ లుక్‌ కూడా బాగుండాలని కోరుకుంటారు. ముఖ్యంగా నేటి జనరేషన్ యూత్ అయితే స్మార్ట్‌ఫోన్ సన్నగా, క్లాసీ లుక్‌లో ఉండాలని ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తుంటారు. అలాంటి వారి కోసమే ప్రముఖ టెక్ దిగ్గజం వివో ఓ క్రేజీ మొబైల్‌ లుక్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది.

లాంచ్ ఎప్పుడంటే?

వివో ఈ నెల 19న Vivo V70 Seriesను ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా దీనిలో రానున్న ‘Passion Red’ వేరియంట్ అయితే అసలు మాటల్లో చెప్పలేనంత క్లాసీగా ఉంది. ఫోన్ మీద లైట్ పడినప్పుడు ఆ రంగు మారే తీరు చూస్తుంటే.. ఇది ఫోన్ లా కాకుండా ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌లా కనిపిస్తోంది. గ్లోసీ ఫినిష్, స్లిమ్ డిజైన్, ఆ కర్డ్వ్ ఎడ్జ్ చూస్తుంటే ఎవరైనా సరే ఇట్టే ఫిదా అయిపోతారు.

Advertisement

Also Read: టెక్నో సంచలనం.. 7,750mAh భారీ బ్యాటరీతో త్వరలో భారత్‌లోకి పోవా కర్వ్ 2!

పెర్ఫార్మెన్స్‌లో తోపు..

ఈ ఫోన్ చూడటానికి చాలా సాఫ్ట్‌గా కనిపిస్తున్నా.. దీని పవర్ మాత్రం మామూలుగా ఉండదు. ఇందులో పవర్‌ఫుల్ Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌ను వాడుతున్నట్లు సమాచారం. అంటే.. గేమ్స్ ఆడినా, మల్టీ టాస్కింగ్ చేసినా ఫోన్ అస్సలు స్లో అవ్వదు. దీనికి తోడు 6.59 ఇంచుల 1.5K ఫ్లాట్ OLED డిస్‌ప్లే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్ స్క్రోలింగ్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది.

నీటిలో పడినా పాడవ్వదు..

Advertisement

సాధారణంగా స్లిమ్ ఫోన్లలో బ్యాటరీ తక్కువ ఉంటుందని మనందరం అనుకుంటుంటాం. కానీ వివో ఇక్కడే తమ మ్యాజిక్‌ను చూపించింది. ఈ కొత్త ఫోన్‌లో
ఏకంగా 6500mAh భారీ బ్యాటరీని అమర్చబోతోందట. దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. మరో విశేషం ఏమిటంటే.. ఈ హ్యాండ్ సెట్ నీళ్లలో పడినా, దుమ్ములో ఉన్నా ఏం కాదు. ఎందుకంటే.. దీనికి IP69 రేటింగ్ రక్షణ ఉంది కాబట్టి.

యూత్‌‌ను ఆకట్టుకునే కలర్..

స్టైల్‌తో పాటు పవర్‌ఫుల్ ఫీచర్లు కావాలనుకునే యువతకు Vivo V70 Series బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ‘వాట్ ఎ కలర్.. వాట్ ఎ అటిట్యూడ్’ అనిపించేలా ఉన్న ఈ ఫోన్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం మాత్రం ఖాయం. మీరు కూడా కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉంటే మాత్రం.. దీన్ని ఖచ్చితంగా మీ లిస్ట్‌లో చేర్చుకోండి.

Also Read: భారత్‌లో ఐఫోన్ 16 సంచలనం.. బడ్జెట్ ఫోన్లను వెనక్కి నెట్టి నెంబర్-1 స్థానానికి!

 

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×