E-Paper
Advertisement

Trending Soundbars Jan 2026: మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ ట్రెండింగ్ సౌండ్‌బార్స్.. బడ్జెట్‌లోనే థియేటర్ ఫీల్ 3D ఆడియో

Trending Soundbars Jan 2026: మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ ట్రెండింగ్ సౌండ్‌బార్స్.. బడ్జెట్‌లోనే థియేటర్ ఫీల్ 3D ఆడియో
Advertisement

Trending Soundbars Jan 2026: గత కొంతకాలంగా భారత మార్కెట్‌లోకి అత్యాధునిక గ్యాడ్జెట్లు వరుసగా వస్తుండటంతో వినియోగదారుల్లో కొత్త టెక్నాలజీపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా 2026లో సౌండ్‌బార్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఇంట్లోనే టీవీ ముందు కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ ఫీల్ రావాలంటే.. ఆడియో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని, బడ్జెట్‌కు సరిపోయే సౌండ్‌బార్స్ ఇప్పుడు చాలా మంచి అనుభూతిని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026 జనవరిలో భారత మార్కెట్‌లో బాగా ట్రెండ్ అవుతున్న బెస్ట్ సౌండ్‌బార్స్ ఏవో తెలుసుకుందాం.

నేటి తరం వినియోగదారులు కేవలం సౌండ్ మాత్రమే కాకుండా, కొత్త టెక్నాలజీతో కూడిన ఫీచర్లను కూడా కోరుకుంటున్నారు. అందుకే డాల్బీ అట్మాస్, 3D ఆడియో, స్మార్ట్ టీవీ ఇంటిగ్రేషన్, తక్కువ ధరలో మెరుగైన పనితీరు ఇచ్చే మోడళ్లకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. ఈ ట్రెండ్‌లో Samsung, Sonos, JBL, boAt వంటి ప్రముఖ బ్రాండ్లు భారత మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి.

Advertisement

Also Read: ఇండియా మార్కెట్లోకి మరో రియల్‌మీ బ్యాటరీ బీస్ట్ వచ్చేస్తోంది.. ధర, స్పెసిఫికేషన్లు, కీలక వివరాలు ఇవిగో!

హైఎండ్ సౌండ్ అనుభవం కోరుకునే వినియోగదారుల కోసం Samsung HW-Q990F, HW-Q930D వంటి మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో పాటు పవర్‌ఫుల్ సబ్‌వూఫర్, రియర్ స్పీకర్లతో 3D ఆడియో అనుభూతిని అందిస్తాయి. అలాగే JBL BAR 1300, BAR 800 మోడల్స్‌లో డిటాచబుల్ సరౌండ్ స్పీకర్లు ఉండటం వల్ల గది మొత్తం ఒకేలా సౌండ్ వినిపిస్తుంది. సినిమాలు చూసేటప్పుడు, గేమింగ్ చేస్తూ లేదా లైవ్ కంటెంట్ చూస్తున్నప్పుడు ఇంట్లో ఏ మూలలో ఉన్నా స్పష్టమైన ఆడియో వినిపించడం వీటి ప్రత్యేకత.

Advertisement

ఇక 2026 Samsung సౌండ్‌బార్ లైనప్‌లో Q-Symphony ఫీచర్ కీలకంగా మారింది. HW-Q990F, HW-Q800F, HW-S60D వంటి మోడల్స్‌ను Samsung టీవీలకు కనెక్ట్ చేస్తే టీవీ స్పీకర్లు, సౌండ్‌బార్ రెండూ కలిసి ఒకేసారి పనిచేస్తాయి. దీంతో ఆడియో మరింత క్లియర్‌గా, సహజంగా వినిపిస్తుంది. అంతేకాదు, ఈ కొత్త సిరీస్‌లో AI ఆధారిత సౌండ్ ట్యూనింగ్ ఫీచర్ కూడా ఉంది. కంటెంట్‌ను బట్టి శబ్దాన్ని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేయడం వల్ల ప్రతి సీన్‌కు సరిపోయే ఆడియో అనుభూతి లభిస్తుంది.

మినిమల్ సెటప్ కావాలనుకునే వారు.. ముఖ్యంగా బెడ్‌రూం లేదా సింగిల్ రూమ్స్ కోసం చూస్తున్నవారికి Sonos Beam Gen 2 మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. వీటి పరిమాణం చిన్నవే అయినప్పటికీ.. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో ఇంప్రెసివ్ పనితీరును ఇస్తుంది. అలాగే Amazon Fire TV Soundbar Plus స్మార్ట్ ఫీచర్లు, వాయిస్ కంట్రోల్‌తో రోజువారీ వినియోగానికి సరిపోతుంది.

ఇకపోతే.. తక్కువ బడ్జెట్‌లో మంచి సౌండ్‌బార్ కావాలనుకునే వారికి boAt Aavante సిరీస్, Mivi Fort సిరీస్ లాంటి మోడల్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి డాల్బీ ఆడియో, వైర్‌లెస్ సబ్‌వూఫర్, మల్టిపుల్ ఈక్వలైజర్ మోడ్‌లతో తక్కువ ధరలోనే మంచి సౌండ్ అనుభూతిని అందిస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న సౌండ్‌బార్స్ ఏవో తెలుసుకున్నారుగా.. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన సౌండ్‌బార్ కొనేయండి మరి.

Also Read: పండగ ఆఫర్ అంటే ఇదేనేమో బాసూ.. ఐఫోన్ 17 కొనాలనుకుంటున్న వారికి గోల్డెన్ ఛాన్స్!

 

 

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×