E-Paper
Advertisement

Minister Seethakka: ములుగు జిల్లా రద్దు అవుతోందా..? మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

Minister Seethakka: ములుగు జిల్లా రద్దు అవుతోందా..? మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
Advertisement

ములుగు జిల్లా రద్దవుతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ములుగు జిల్లా అస్తిత్వానికి ఎలాంటి ముప్పు లేదని.. ఈ ప్రచారమంతా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆమె స్పష్టం చేశారు. జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమించిన వాళ్లమే తప్ప.. రద్దు చేసే ఆలోచనే తమకు లేదని ఆమె తేల్చి చెప్పారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను అత్యంత అశాస్త్రీయంగా చేపట్టిందని మంత్రి విమర్శించారు. పరిపాలనా సౌలభ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టానుసారంగా జిల్లాల సరిహద్దులను నిర్ణయించారని ఆరోపించారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ములుగు జిల్లాలోని కొన్ని మండలాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని.. ఒకే మండలంలోని ఐదు గ్రామాలు పక్కనే ఉన్న భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వెళ్లడం ఇందుకు నిదర్శనమని ఆమె ఉదాహరించారు.

Advertisement

ప్రజలకు పాలనా ఫలాలు అందాలంటే రెవెన్యూ, పోలీస్ సరిహద్దులు ఒకే విధంగా ఉండాలని సీతక్క అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న గందరగోళం వల్ల ప్రజలు తమ పనుల కోసం రెండు జిల్లాల కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ప్రజా ప్రతినిధులు కూడా సమీక్షా సమావేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల సరిహద్దుల విషయంలో శాస్త్రీయ పద్ధతిలో కేవలం స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయని చెప్పారే తప్ప, ఎక్కడా జిల్లాను రద్దు చేస్తామని అనలేదని ఆమె గుర్తు చేశారు.

ములుగు జిల్లా అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే వందల కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి వివరించారు. జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలబెట్టడమే తమ లక్ష్యమని, జిల్లా రద్దు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆమె భరోసా ఇచ్చారు. ములుగు జిల్లా ఏర్పాటు నచ్చని వారే ప్రజల్లో లేనిపోని ఆందోళనలు సృష్టించేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ములుగు జిల్లా ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ‘ములుగు జిల్లా ఎక్కడికీ పోదు.. ఇక్కడే ఉంటుంది.. మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది’ అని ఆమె భరోసా ఇచ్చారు. కుట్రపూరిత ప్రచారాలను తిప్పికొట్టాలని ఆమె కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

ALSO READ: Hyderabad News: మంత్రి, అధికారులపై తప్పుడు కథనాలు.. జర్నలిస్టుల అరెస్టుని ఖండించిన జగ్గారెడ్డి

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×