Best Monitors: ఇంట్లో నుండి పనిచేసే ఉద్యోగులు, ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు మానిటర్ అత్యంత కీలకమైన సాధనంగా మారిపోయింది. ల్యాప్‌టాప్ లో ఉండే చిన్న స్క్రీన్, వంగి చూడటం వల్ల మెడనొప్పి, కంటి సమస్యలకు మానిటర్ తో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతుంటారు. పైగా ఒకేసారి ఎక్కువ పనులు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లు ఉన్న మానిటర్లు అందుబాటులోకి వచ్చాయి. రూ.20,000 లోపు ధరలో దొరికే టాప్-5 మానిటర్లు, వాటి ప్రత్యేకతల గురించి ఈ కథనంలో చూద్దాం.
డెల్ కంపెనీకి చెందిన ఈ మానీటర్ 27 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో రూపొందింది. 200Hz రిఫ్రెష్ రేట్, 1ms రెస్పాన్స్ టైమ్‌ను అందిస్తుంది. దీని సాయంతో హ్యాపీగా గేమ్స్ ఆడొచ్చని.. స్క్రీన్ చాలా ఫాస్ట్ గా స్క్రోల్ చేయవచ్చని డెల్ పేర్కొంది. 99% sRGB కలర్ సపోర్ట్ వల్ల స్ప్రెడ్‌షీట్‌లు, ఫోటోలు, వీడియో కాల్స్ స్పష్టంగా కనిపిస్తాయని తెలియజేసింది. ల్యాప్‌టాప్, గేమింగ్ కన్సోల్ రెండింటినీ ఒకేసారి కనెక్ట్ చేయడానికి వీలుగా రెండు హెచ్‌డిఎమ్‌ఐ 2.1 పోర్ట్‌లు దీనికి అందించారు. అమెజాన్‌లో ఎమ్మార్పీపై 54% డిస్కౌంట్ తో రూ.9,999 కే ఈ మానిటర్ లభిస్తోంది.
డాక్యుమెంట్లు, కోడింగ్ లేదా డిజైనింగ్ పనులు ఎక్కువ చేసేవారికి బెన్‌క్యూ GW2790Q సరైన ఎంపిక. 27 ఇంచుల సైజులో ఇది 2K క్యూహెచ్‌డీ (2560×1440) రెజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. సాధారణ ఫుల్ హెచ్‌డీ కంటే దీనిపై అక్షరాలు మరింత షార్ప్‌గా, రెండు విండోలు పక్కపక్కన పెట్టి పని చేయడానికి అనువుగా ఉంటాయి. సిస్టమ్ పై ఎక్కువ సమయం పనిచేసే వారి కంటి రక్షణ కోసం బెన్‌క్యూ ఐ-కేర్, ఐసేఫ్ సర్టిఫికేషన్లను ఇది కలిగి ఉంది. 99% sRGB కలర్, 100Hz రిఫ్రెష్ రేట్, డ్యూయల్ హెచ్‌డిఎమ్‌ఐ, డిస్‌ప్లే పోర్ట్ వంటి బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. దీనిని గోడకు కూడా అమర్చుకోవచ్చు.
పనితో పాటు గేమింగ్ ఇష్టపడే వారికి ఎల్‌జీ 27GS60QC బెస్ట్ ఆప్షన్. క్యూహెచ్‌డీ రెజల్యూషన్‌తో పాటు 180Hz రిఫ్రెష్ రేట్, 1ms రెస్పాన్స్ టైమ్ రావడం ఈ ధరలో ప్రత్యేకత. 1000R కర్వేచర్ స్క్రీన్ కళ్లకు కలిగే ఇబ్బందిని తగ్గిస్తుంది. పైగా ఈ మానిటర్ గేమింగ్ అనుభవాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లడమే కాకుండా పెద్ద స్ప్రెడ్‌షీట్‌లను చూడటాన్ని సులభం చేస్తుంది. ఇందులో ఎఎండీ ఫ్రీసింక్, యాంటీ-గ్లేర్ ఫినిష్, డిస్‌ప్లే పోర్ట్, రెండు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, హెడ్‌ఫోన్ అవుట్‌పుట్ ఉన్నాయి. 30% డిస్కౌంట్‌తో ఇది రూ.14,999 కి అందుబాటులో ఉంది.
చిన్న టేబుల్స్ లేదా తక్కువ స్థలం ఉన్న రూమ్‌లకు ఈ 24 అంగుళాల డెల్ మానిటర్ బాగా సెట్ అవుతుంది. ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ప్యానెల్‌తో 144Hz రిఫ్రెష్ రేట్, 99% sRGB కలర్, 1500:1 కాంట్రాస్ట్ రేషియోను ఇది అందిస్తుంది. ఇన్‌బిల్ట్‌గా 3W డ్యూయల్ స్పీకర్లు ఉన్నందున ప్రత్యేక హెడ్‌ఫోన్స్ లేకుండానే వీడియో కాల్స్ మాట్లాడవచ్చు. సాధారణ నలుపు రంగు మానిటర్ల కంటే భిన్నంగా దీని ‘యాష్ వైట్’ ఫినిషింగ్ ఆఫీస్ డెస్క్‌కు కొత్త లుక్ ఇస్తుంది. దీనిపై డెల్ 3 ఏళ్ల వారంటీని అందిస్తోంది.
Also Read: ఏసీ ఉన్నోళ్లకి గుడ్ న్యూస్.. చలికాలంలో ఇలా వాడితే.. ఇల్లంతా ఫుల్ వెచ్చదనం!
తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్ కోరుకునే వారికి ఏసర్ KA270 P6 మంచి ఛాయిస్. రూ. 7,998 లభించే ఈ మానిటర్ కీలకమైన ఫీచర్లను కలిగి ఉంది. ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, ఏఎండీ ఫ్రీసింక్, 99% sRGB కలర్ సపోర్ట్ దీని సొంతం. ఇందులో స్టీరియో స్పీకర్లు, జీరో ఫ్రేమ్ డిజైన్, ఏసర్ ఐ-కేర్ టెక్నాలజీ ఉన్నాయి. దీని డెలివరీ బాక్స్‌లోనే హెచ్‌డీఎంఐ కేబుల్ కూడా రానుండటం గమనార్హం. కనెక్టివిటీ కోసం ఒక హెచ్‌డిఎంఐ, ఒక విజిఎ (VGA) పోర్ట్ అందుబాటులో ఉన్నాయి.
Also Read: OTP అవసరం లేదు… కాల్ చేయక్కర్లేదు.. ‘No’ అని టైప్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!