Fantasy Adventure: సముద్రం… సాహసం… అద్భుతమైన విజువల్స్… ప్రమాదకరమైన ప్రయాణం. ఇవన్నీ కలిస్తే ‘మోనా’ (Moana)లాంటి అడ్వెంచర్ కథ గుర్తుకొస్తుంది. యానిమేషన్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘మోనా’ కథ ఇప్పుడు నిజమైన నటీనటులతో తెరకెక్కిన లైవ్‌యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన ద్వీపాన్ని కాపాడటం కోసం సముద్రాన్ని దాటి వెళ్లే ఓ యువతి సాహసం, ఆమెకు ఎదురయ్యే ప్రమాదాలు, దారిలో పరిచయమయ్యే మిత్రుడు.. ఇలా ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది. మరి ఈసారి మోనా ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం.
మోటునుయ్ అనే ద్వీపంలో నివసించే మోనాకి చిన్నప్పటి నుంచే సముద్రం అంటే చాలా ఇష్టం. ఒకరకంగా చెప్పాలంటే దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఆమె తండ్రి చీఫ్ టుయ్ మాత్రం సముద్రం దాటి వెళ్లడం ప్రమాదకరమని భావిస్తాడు. అందుకే తన ప్రజలు ద్వీపం దాటి వెళ్లకూడదని కోరుకుంటాడు. కానీ ద్వీపంలో ప్రకృతి వనరులు తగ్గిపోవడం, ప్రజల జీవనానికి ముప్పు ఏర్పడటంతో పరిస్థితులు మారిపోతాయి. తన ప్రజలను కాపాడాలంటే ఏదో ఒకటి చేయాలని మోనా నిర్ణయించుకుంటుంది.
సముద్రం నుంచి వచ్చే పిలుపును అర్థం చేసుకున్న మోనా… తన ద్వీపాన్ని కాపాడే మార్గం కోసం ప్రమాదకరమైన ప్రయాణానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మౌయి అనే శక్తిమంతమైన దేవతా స్వరూపం కలిగిన వ్యక్తిని కలుస్తుంది. అతడికి రూపాలు మార్చగలిగే శక్తి ఉంటుంది. అయితే మౌయి సాయంతోనే తన లక్ష్యాన్ని చేరుకోవాల్సి రావడంతో మోనా అతడితో కలిసి ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
వీళ్లిద్దరి ప్రయాణం అంత సులభంగా సాగదు. సముద్రంలో వింత జీవులు, ప్రమాదకరమైన అడ్డంకులు ఎదురవుతాయి. మరోవైపు మోనా తన ప్రజలను కాపాడాలంటే టె ఫిటి అనే దేవతకు సంబంధించిన శక్తిని తిరిగి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మోనా తన ధైర్యాన్ని, తెలివిని ఉపయోగిస్తుంది. మౌయితో కలిసి ముందుకు సాగుతూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది.
ఈ ప్రయాణంలో మోనా తనలోని నాయకత్వ లక్షణాలను గుర్తిస్తుంది. తనపై తను నమ్మకం పెంచుకుంటుంది. మరి చివరికి ఆమె అనుకున్నది ఎలా సాధించింది ? తన మేనమామ ఆమెకు చేసిన సాయం ఏంటి ? సముద్రంలో దాగి ఉన్న శక్తి ఏంటి ? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
కేథరిన్ లగాయా మోనాగా, డ్వేన్ జాన్సన్ మౌయిగా నటించిన ‘మోనా’ లైవ్‌యాక్షన్ సినిమా 2026 జూలై 10న థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి డిస్నీ ప్లస్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. అయితే భారతదేశంలో జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో అందుబాటులో ఉంది. అందులోనూ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. అడ్వెంచర్ సినిమాలు, ఫాంటసీ కథలు ఇష్టపడేవారు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దు. ఒరిజినల్ యానిమేషన్ వెర్షన్ లో ఉండే మ్యాజిక్ ఎక్కడా మిస్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. మూవీని చూశాక ఒరిజినల్ మోనాతో కూడా ఆడియన్స్ ప్రేమలో పడిపోతారు.
Read Also: ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్