E-Paper
Advertisement

Ampere Magnus Grand Max: ఆంపియర్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్, ధర ఎంతో తెలుసా?

Ampere Magnus Grand Max: ఆంపియర్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్, ధర ఎంతో తెలుసా?
Advertisement

Ampere Magnus Grand Max Launched: గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆంపియర్ బ్రాండ్‌ గా మార్కెట్ లో సత్తా చాటుతోంది.  ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కంపెనీ, తాజాగా మరో క్రేజీ స్కూటర్ ను మార్కెట్ కు పరిచయం చేసింది. మాగ్నస్ గ్రాండ్ మాక్స్ పేరుతో ఈ స్కూటర్ ను లాంచ్ చేసింది. కేవలం రూ. 94,999 ధరతో  సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.

ఆంపియర్ మాగ్నస్ స్కూటర్లు సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంత అవసరాలకు అనుగుణంగా రూపొందించారు.  2.3kWh బ్యాటరీ కలిగిన  మాగ్నస్ గ్రాండ్ కంటే  మాగ్నస్ గ్రాండ్ మాక్స్ పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఎక్కువ టాప్ స్పీడ్, పెద్ద బూట్ స్పేస్,  రెండు కొత్త డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌ లతో  ప్రీమియం లుక్ ను అందిస్తుంది. మాగ్నస్ గ్రాండ్ మాక్స్‌ లో 3kWh   లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది పూర్తి ఛార్జ్‌ తో 100 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ను అందిస్తుంది.  సర్టిఫైడ్ IDC 142 కి.మీ రేంజ్ ను అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇది 0-80 శాతం, 0-100 శాతం ఛార్జ్ చేయడానికి కాస్త సమయం ఎక్కువ పడుతుంది.  20-80 శాతం ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుందని కంపెనీ వెల్లడించింది.

మూడు సంవత్సరాల బ్యాటరీ వారెంటీ

Advertisement

ఆంపియర్ అనేది EV మార్కెట్‌ లో LFP బ్యాటరీలను ఉపయోగించే అతికొద్ది కంపెనీలో ఒకటి.  కొత్తగా లాంచ్ అయిన సుజుకి ఇ యాక్సెస్ లాగా ఉంటుంది. మాగ్నస్ గ్రాండ్‌ లోని బ్యాటరీ 3 సంవత్సరాలు లేదంటే 75,000 కి.మీ వారంటీతో వస్తుంది. మాగ్నస్ గ్రాండ్ మాక్స్ అనేది హబ్ మౌంటెడ్ మోటారును కలిగి ఉంటుంది.  ఇది 65kph గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అండర్ పిన్నింగ్స్ కూడా బేసిక్ గా ఉంటాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్స్ సస్పెన్షన్ డ్యూటీలను హ్యాండ్లింగ్ చేస్తాయి. రెండు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఎకో, సిటీ,  రివర్స్ ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. మాగ్నస్ గ్రాండ్ మాక్స్‌ లో 33 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఏరియా ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న ఏ గ్రీవ్స్, ఆంపియర్ స్కూటర్ లో లేకపోవడం విశేషం. 3.5-అంగుళాల LCD స్క్రీన్, రెండు డ్యూయల్ టోన్ రంగులలో వస్తుంది. మాన్‌ సూన్ బ్లూ, మాచా గ్రీన్, సిన్నమోన్ కాపర్ కలర్స్ లో ఉంటుంది.

ఈ స్కూటర్ ధర ఎంత అంటే?

మాగ్నస్ గ్రాండ్ మాక్స్ రూ. 94,999కు అందుబాటులో ఉంటుంది. ఇదే ఫీచర్లను కలిగి ఉన్న ఇతర మోడళ్లను పరిశీలిస్తే,  TVS ఆర్బిటర్ రూ. 99,900, బజాజ్ చేతక్ C2501 రూ. 91,399,  విడా VX2 గో 3.4kWh  రూ. 1.02 లక్షలు ధర పలుకుతున్నాయి.  ఈ మోడల్ లాంచ్ గ్రీవ్స్ కోసం మరిన్ని వాల్యూమ్‌లను తీసుకురావడానికి సహాయపడుతుంది.  ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌లు కొనసాగితే, త్వరలో ఓలా ఎలక్ట్రిక్‌ను అధిగమించి ఇండియన్ టూవీలర్ మార్కెట్లో ఐదవ స్థానానికి చేరుకుంటుంది.

Advertisement

Read Also: చేతక్ లవర్స్ కు గుడ్ న్యూస్, ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×