E-Paper
Advertisement

గడియారాన్ని ఒక గంట వెనక్కి తిప్పుకుంటున్న యూకే ప్రజలు.. ఇదో వింత చరిత్ర

గడియారాన్ని ఒక గంట వెనక్కి తిప్పుకుంటున్న యూకే ప్రజలు.. ఇదో వింత చరిత్ర
Advertisement

గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. కానీ, గడియారాన్ని మాత్రం ఒక గంట వెనక్కి తిప్పుకుని.. కాలాన్ని మార్పు చేసుకోవచ్చు. ఏంటీ.. అర్థం కాలేదా? యూకే ప్రజలకు మాత్రం దీని గురించి బాగా తెలుసు. ఎందుకంటే.. ఏటా వీళ్లు చేసే పనే అలాంటిది. అలా ఎందుకు అని అడిగితే.. ఓ వింత చరిత్ర గురించి గొప్పగా చెబుతారు. అదేంటో మీకూ తెలుసుకోవాలని ఉందా?

శీతాకాలంలో ఒక గంట వెనక్కి..

బ్రిటన్ ప్రజలు ఏటా ప్రతి శీతాకాలంలో తమ గడియారాలను ఒక గంట వెనక్కి తిప్పుకుంటారు. దీనివల్ల పొద్దున్నే సూర్యోదయానికి నిద్రలేవచ్చనేది వారి ప్లాన్. దీనివల్ల పగటి వేళ ఎక్కువ సేపు వెలుతురులో పనులు చేసుకోవచ్చు. కానీ, చాలామంది బారెడు పొద్దెక్కినా.. నిద్రలోనే జోగుతున్నారు. ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. పగటి వేళలను వేస్ట్ చేస్తున్నారు. శీతాకాలంలో మధ్యాహ్నం త్వరగా చీకటిపడిపోతుంది. చీకట్లో రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ అలవాటు ఇప్పుడు సీజనల్ డిప్రెషన్‌తో బాధపడేవారిని కూడా ఆందోళనకు గురిచేస్తోంది. దీని గురించి పూర్తిగా తెలియని చాలామంది ఇదేం పాడు అలవాటు అంటూ బ్రిటన్ ప్రజలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే, ఇది అలవాటు కాదు, మా పూర్వికుల నుంచి వస్తున్న సాంప్రదాయం అంటూ ఓ చిత్రమైన చరిత్ర గురించి చెబుతున్నారు.

అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది?

Advertisement

1907లో పగటి వెలుతురును వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ మార్పు మొదలైంది. బ్రిటన్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ విలియం విల్లెట్ వేసవి కాలంలో ఒక రోజు ఉదయాన్నే గుర్రపు స్వారీకి వెళ్లాడు. తెల్లవారుజాము 5 గంటలకే సూర్యుడు ఉదయించినా.. చాలామంది ప్రజలు ఇంకా నిద్రపోతూ పగటి వెలుతురును వృథా చేయడం గమనించాడు. దాని వల్ల రాత్రి వేళల్లో చీకటి పడ్డాక ఇంట్లో దీపాలు, కొవ్వొత్తులు వెలిగించుకోడానికి ఎక్కువ ఖర్చు అవుతున్నట్లు గుర్తించాడు. ఇంధనం ఆదా చేయాలంటే ప్రజలు ఉదయం వెలుతురును సద్వినియోగం చేసుకోవడం ఉత్తమ మార్గమని భావించాడు. ఈ సందర్భంగా ప్రజలు ఏప్రిల్ నెలలోని ప్రతి ఆదివారం గడియారాన్ని 20 నిమిషాల చొప్పున (మొత్తం 80 నిమిషాలు) ముందుకు జరిపి, సెప్టెంబర్‌లో మళ్ళీ వెనక్కి జరపాలని ప్రతిపాదించాడు. అయితే, జనాలు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు.

ఆ లేఖతో కళ్లు తెరుచుకున్న జనం..

అమెరికా వ్యవస్థాపకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్.. 1784లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అమెరికా రాయబారిగా పనిచేశాడు. అప్పట్లో పారిస్ ప్రజల పగటి నిద్ర గురించి తెలిసి ఆశ్చర్యపోయాడు. ఈ సందర్భంగా ‘జర్నల్ ఆఫ్ పారిస్’ అనే ఫ్రెంచ్ పత్రికకు ఒక వ్యంగ్య లేఖ రాశారు. పగటి వెలుతురును సరిగ్గా ఉపయోగించుకోకుండా.. రాత్రివేళల్లో లైట్ల కోసం ఇంధనాన్ని వేస్ట్ చేసేవారికి పన్నులు వేయాలని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆయన చెప్పింది వ్యంగ్యంగానే అయినా, ఆయన మాటల్లో నిజం ఉందని గ్రహించి కొందరు వేసవి కాలంలో గడియారాన్ని ఒక గంట ముందుకు జరిపి ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకున్నారు. అయితే, ఈ అలవాటు చాలా గందరగోళాన్ని సృష్టించింది.

సూర్యోదయానికి తగినట్లుగా.. గడియారంలో మార్పులు, కానీ..

Advertisement

సూర్యోదయానికి తగినట్లుగా గడియారంలో మార్పులు చేసుకుంటూ ప్రజలు హాయిగా జీవనం సాగించేవారు. ఏ ఊరి సమయం.. ఆ ఊరి సూర్యోదయాన్ని బట్టి ఉండేది. ఉదాహరణకు లండన్‌ సమయం.. ప్లామౌత్ కంటే 16.4 నిమిషాలు ముందుండేది. 1840లో రైళ్ల సేవలు మొదలయ్యాక అసలు సమస్య మొదలైంది. వేర్వేరు సమయాల వల్ల రైలు ప్రమాదాలు పెరిగాయి. దీంతో ప్రత్యేకంగా రైల్వే టైమ్‌ను ప్రవేశపెట్టాల్సి వచ్చింది. దీన్నే గ్రీన్ విచ్ టైమ్ అని కూడా అంటారు.

మొదటి ప్రపంచ యుద్ధంలోనూ ఇదే పద్ధతి..

విలియమ్ విల్లెట్ సమయాన్ని మార్చాలనే ప్రతిపాదనపై సుదీర్ఘ పోరాటం చేశారు. కానీ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఇంధనాన్ని, విద్యుత్‌ను పొదుపు చేయడానికి జర్మనీ ఈ పద్ధతిని అమలు చేసింది. అప్పుడు గానీ.. బ్రిటన్ కళ్లు తెరుచుకోలేదు. 1916లో సమ్మర్ టైమ్ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చి మరీ సమయాన్ని మార్చే పద్ధతిని అధికారంగా అమల్లోకి తెచ్చింది. రెండో ప్రపంచం యుద్ధం సమయంలో కూడా విన్స్టన్ చర్చిల్ హయాంలో ఇంధన పొదుపు, ప్రజలు సురక్షితంగా ఇళ్లకు చేరుకోడానికి వీలుగా గడియారాలను రెండు గంటలు ముందు జరిపేవారు. దీన్ని ‘డబుల్ సమ్మర్ టైమ్’ అని పిలిచేవారు.

ఆరోగ్యానికి ప్రమాదం?

సమయాన్ని ఇలా మార్చడం.. ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల శరీర అంతర్గత గడియారం దెబ్బతింటుందని, ఈ ఆకస్మిక మార్పుల వల్ల దీర్ఘకాలికంగా శరీర అంతర్గత వ్యవస్థ దెబ్బతిని ఓబెసిటీ, మెటబోలిక్, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. ఇంకా గుండెపోటు, పక్షవాతం ముప్పు కూడా ఉందని తెలుపుతున్నారు. గడియారాల్లో టైమ్ మార్చడం వల్ల ఏర్పడుతున్న సమస్యలను గుర్తించిన కొన్ని దేశాలు ఇప్పటికే ఆ సాంప్రదాయాలకు స్వస్తి పలికాయి. వాటిలో రష్యా, బ్రెజిల్, టర్కీ, జోర్డాన్, నామిబియా, ఉరుగ్వే వంటి దేశాలు ముందున్నాయి. అమెరికాలో కూడా ‘సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్’ ద్వారా ఈ పద్ధతిని రద్దు చేయాలనే డిమాండ్ బలంగా ఉంది. బ్రిటన్‌లో కూడా డబుల్ సమ్మర్‌టైమ్ తీసుకురావాలా లేదా ఈ పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలా అనే దానిపై ఇప్పటికీ తీవ్రమైన చర్చ కొనసాగుతోంది.

ఇదిగో ఈ టైమ్ మార్పు ఇలా జరుగుతుంది

ఎండాకాలంలో (మార్చి నెలలో) గడియారాన్ని 1 గంట ముందుకు జరుపుతారు. దీనివల్ల సాయంత్రం ఎక్కువసేపు సూర్యుడి వెలుతురు ఉంటుంది. చలికాలంలో (అక్టోబర్ నెలలో) గడియారాన్ని మళ్ళీ 1 గంట వెనక్కి జరిపి మామూలు టైమ్‌కి తెస్తారు. దీనివల్ల చలికాలంలో ఉదయాన్నే నిద్రలేవడానికి కొంచెం వెలుతురు దొరుకుతుంది. అయితే, జనాలు కూడా ఈ పద్ధతికి విసిగిపోయారు. ఈ గడియారాలు మార్చే గోల మాకొద్దు, ఏదో ఒక సమయాన్నే రోజంతా ఉంచండని కోరుకుంటున్నారు. జనాలు పద్దతిగా ఒక టైమ్‌కు లేవడం అలవాటు చేసుకుంటే సరిపోతుంది కదా? మన భారతీయులనే చూడండి.. ఏ కాలంలోనైనా వారికి అలవాటైన టైమ్‌లోనే నిద్రలేస్తారు. ఇలా టైమ్ మార్చుకోవడాల్లాంటివి ఏవీ చేయరు. కొందరు మాత్రం ఆఫీసులు, స్కూళ్లకు త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో పది నుంచి పదిహేను నిమిషాలు గడియరం ముల్లును ముందుకు జరుపుకుంటారు.

Also Read: హైదరాబాద్‌లో 44వ అంతస్తులో వేలాడుతూ.. ఇతడి జీతం ఎంతో తెలుసా?

Tags

Related News

రూ.908కే అద్భుతమైన సౌండ్..బడ్జెట్ ధరలో సూపర్ బేస్

వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే కుకీస్ యాక్సెప్ట్ చేస్తున్నారా?జాగ్రత్త!

ఇదేం విడ్డూరం యాపిల్ మామా.. వాడిన కొన్ని గంటల్లోనే iPhone Duo స్క్రీన్ ఢమాల్!

రూ.25వేలకే రోబోట్ వాక్యూమ్ క్లీనర్..ఆపర్ ముగిసేలోపే కొనేయండి

Airtel బంపరాఫర్.. రూ. 200 కే 30GB డేటా, ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం.. 20పైగా ఓటీటీలు!

క్యాబ్ బుక్ చేసేటప్పుడు లొకేషన్ తప్పుగా చూపిస్తోందా? ఈ ఒక్క సెట్టింగ్ మార్చితే సరి!

56% డిస్కౌంట్‌తో ఏసర్ ఆస్పైర్ ల్యాప్‌టాప్..ఫీచర్లు చూస్తే ఫిదా అయిపోతారు!

Big Stories

Advertisement
×