Pragyan Ojha On Ravindra Jadeja: టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ గా మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకున్నారు. అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో అవకాశం ఓజాకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ప్రగ్యాన్ ఓజా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టీమిండియాలో ఒకప్పుడు తాను కీలక బౌలర్ గా ఉండే వాడినని… రవీంద్ర జడేజా వచ్చిన తర్వాత తన కెరీర్ నాశనమైందని ఎమోషనల్ అయ్యారు.
ఆ రోజున రవీంద్ర జడేజా రాకపోయి ఉంటే… తాను ఉన్నత స్థాయికి ఎదిగే వాడినని ప్రగ్యాన్ ఓజా చెప్పుకొచ్చారు. అర్ధాంతరంగా తన కెరీర్ ముగియడానికి ముఖ్య కారణం రవీంద్ర జడేజా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు రవీంద్ర జడేజా జుట్టు తన చేతిలో ఉందని బాంబు పేల్చారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో అతను టీమిండియాలో ఉండాలా ? లేదా ? అనేది డిసైడ్ చేయాల్సింది తానేనని ప్రగ్యాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అతనిపైన తనకు ఎలాంటి కోపం ఉండదని… మంచి ప్రదర్శన కనబరిస్తే ఖచ్చితంగా వరల్డ్ కప్ ఆడుతాడని వివరించారు. దీంతో రవీంద్ర జడేజా పై ప్రగ్యాన్ ఓజా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
రవీంద్ర జడేజాపై టీమిండియా చీఫ్ సెలెక్టర్ ప్రగ్యాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా తరఫున ఆడేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలని… అప్పుడే అవకాశాలు కచ్చితంగా వస్తాయని తెలిపారు. రవీంద్ర జడేజా వచ్చినప్పుడు తన ప్రదర్శన సరిగ్గా లేకపోవడంతో అతడికి జట్టులో అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. రవీంద్ర జడేజా బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయగల సమర్ధుడని వ్యాఖ్యానించారు.
అతడు బెస్ట్ ఆల్ రౌండర్ కావడంతో తనకు అవకాశాలు తగ్గిపోయాయని చెప్పుకొచ్చారు. అంతేకానీ రవీంద్ర జడేజా తనపై ఎలాంటి కుట్రలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు జడేజా ఫామ్ సరిగ్గా లేదని, అతని కంటే బెస్ట్ ఆల్ రౌండర్ దొరికితే టీమిండియాలోకి వచ్చేస్తాడన్నారు. ఈ తరుణంలోనే రవీంద్ర జడేజా జాగ్రత్తగా ఆడాలని తెలిపారు. కాగా న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా వన్డే సిరీస్ నేపథ్యంలో రవీంద్ర జడేజాను ( Ravindra Jadeja) పక్కను పెట్టిన బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ప్రగ్యాన్ ఓజా, నమన్ ధీర్ ను ( Naman Dhir) తెర పైకి తీసుకొచ్చాడు.