E-Paper
Advertisement

Upcoming ACs march 2026: మార్చిలో రాబోతున్న.. మోస్ట్ వాంటెడ్ ఏసీలు.. మిడిల్ క్లాస్‌కు పండుగే!

Upcoming ACs march 2026: మార్చిలో రాబోతున్న.. మోస్ట్ వాంటెడ్ ఏసీలు.. మిడిల్ క్లాస్‌కు పండుగే!

Upcoming ACs march 2026: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అటు దేశవ్యాప్తంగా వేసవి కాలం ప్రారంభం కావడంతో ఏసీలకు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు కొత్త ఏడాదిని పురస్కరించుకొని 2026 అడ్వాన్స్డ్ మోడల్ ఏసీలను ప్రముఖ కంపెనీలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026 మార్చి నాటికి అందుబాటులో అందుబాటులోకి వచ్చే టాప్-5 ఏసీల వివరాలు, వాటి ఫీచర్లు ఇక్కడ అందించడం జరుగుతోంది.

Samsung Bespoke AI WindFree (2026)

శాంసంగ్ తన బిస్పోక్ సిరీస్ నుంచి అడ్వాన్స్డ్ ఏఐ ఏసీని పరిచయం చేసింది. ‘విండ్ ఫ్రీ కూలింగ్’ (WindFree Cooling) కూలింగ్ టెక్నాలజీతో ఇది పనిచేయనుంది. 23,000 మైక్రో హోల్స్ ద్వారా గాలిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీని చల్లటి గాలి నేరుగా శరీరాన్ని తాకదు. ఇందులో ఏఐ ఎనర్జీ మోడ్ మీ అలవాట్లను విశ్లేషించి.. 30 వరకూ విద్యుత్ ను ఆదా చేస్తుంది. మెుబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా ఈ ఏసీని కంట్రోల్ చేయవచ్చు.

LG 2026 BEE Compliant Series

ఎల్‌జీ తన కొత్త మోడల్ ఏసీల్లో కరెంటు ఆదాకు పెద్ద పీట వేసింది. AI Convertible 6-in-1 ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా అవసరాన్ని బట్టి 40% నుండి 110% వరకు కూలింగ్ సామర్థ్యాన్ని మార్చుకోవచ్చు. థింక్ యాప్ ద్వారా మీరు ఇంటికి రాకముందే ఏసీ ఆన్ చేసి.. గదిని చల్లగా మార్చుకోవచ్చు. Energy Manager+ ద్వారా ఏసీ వాడకాన్ని నియంత్రించుకోవచ్చు.

Daikin FTKZ Series (5-Star)

డైకిన్ కంపెనీకి చెందిన ఏసీలకు మార్కెట్ లో గుడ్ విల్ ఉంది. FTKZ Seriesకు చెందిన అధునాతన ఏసీల్లో Coanda Airflow టెక్నాలజీని పొందు పరిచారు. ఇది గాలిని కిందవైపునకు కాకుండా పైకప్పు వైపు ప్రసారం చేసి.. అన్నివైపులా విస్తరించేలా చేస్తుంది. అలాగే గాలిలోని వైరస్‌లు, బ్యాక్టీరియాను తొలగించి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. ఇది డ్యూయల్ డిస్ ప్లేతో పనిచేస్తుంది. గదిలోని ప్రస్తుత ఉష్ణోగ్రత, సెట్ చేసిన ఉష్ణోగ్రత రెండింటినీ చూపిస్తుంది.

Blue Star A-Series (2026)

దేశీయ బ్రాండ్ అయిన బ్లూ స్టార్.. భారత్ లో ఎండలను సమర్థవంతంగా తట్టుకునే అధునాతన ఏసీని రూపొందించింది. Blue Star A-Seriesలోని ఏసీలు.. 4-Way Air Swing సాంకేతికతతో పనిచేస్తాయి. గదిలోని అన్ని మూలలకు సమానంగా గాలిని ప్రసారం చేస్తాయి. ఇందులోని టర్బో కూల్ ఫీచర్ ద్వారా.. నిమిషాల వ్యవధిలో గదిని చల్లబరుచుకోవచ్చు.

Also Read: Mini Fridges Feb 2026: రూ.10,000లోపు బడ్జెట్‌లో.. టాప్ ట్రెండింగ్ మినీ ఫ్రిడ్జ్‌లు.. క్రేజీ ఫీచర్లు భయ్యా!

Panasonic Smart Wi-Fi Inverter (2026)

పానాసోనిక్ తన ‘MirAIe’ ప్లాట్‌ఫామ్‌ నుంచి స్మార్ట్ ఏసీని తయారు చేసింది. ఇది 8-in-1 మోడ్స్‌తో ఫ్లెక్సిబుల్ కూలింగ్ ను అంస్తుంది. ఇందులోని PM 0.1 Filter అత్యంత సూక్ష్మమైన ధూళి కణాలను కూడా క్లీన్ చేస్తుంది. రాత్రంతా ఒకే టెంపరేచర్ కాకుండా సమయాన్ని బట్టి ఆటోమేటిక్ గా మారేలా ఈ ఏసీని సెట్ చేసుకోవచ్చు.

Also Read: Mini Fridges Feb 2026: రూ.10,000లోపు బడ్జెట్‌లో.. టాప్ ట్రెండింగ్ మినీ ఫ్రిడ్జ్‌లు.. క్రేజీ ఫీచర్లు భయ్యా!

Related News

Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

Big Stories

×