E-Paper
Advertisement

KTR: రెండేళ్లలోమళ్లీ కేసీఆరే సీఎం.. గులాబీ జెండా ఎగరడం ఖాయం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: రెండేళ్లలోమళ్లీ కేసీఆరే సీఎం.. గులాబీ జెండా ఎగరడం ఖాయం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Advertisement

ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. జైలులో కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులతో బాల్క సుమన్ భయపడతారని అనుకోవడం కాంగ్రెస్ నేతల అవివేకమని కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సుమన్ ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. తమకు ఇలాంటి నిర్బంధాలు కొత్తేమీ కాదని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి.. నువ్వు మళ్లీ చిప్పకూడు తినే సమయం ఖచ్చితంగా వస్తుంది’ అంటూ హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. చేసిన తప్పులకు ప్రతిఫలం అనుభవించక తప్పదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న వారిని అణచివేయాలని చూస్తే సహించేది లేదని వివరించారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

డీజీపీ శివధర్ రెడ్డి తీరును సైతం కేటీఆర్ తప్పుబట్టారు. బాధ్యతలు స్వీకరించిన సమయంలో డీజీపీ సినిమా డైలాగులు కొట్టారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్.. పింక్ బుక్ ఉండవని.. కేవలం ఖాకీ బుక్ మాత్రమే ఉంటుందని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించినా.. వారి బట్టలు ఊడదీసి కొడతామని బెదిరించినా కేసులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. అధికార పక్షానికి ఒక నీతి.. ప్రతిపక్షానికి మరో నీతా అని అడిగారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని హితవు పలికారు.

కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయనే అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని.. న్యాయాన్ని తుంగలో తొక్కి పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరును గమనిస్తున్నామని.. చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ తమ చర్యలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యవస్థలను దుర్వినియోగం చేయడం తగదని సూచించారు.

Advertisement

రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అరాచకాలకు పాల్పడుతున్న వారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని శిక్షిస్తామని ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని కేటీఆర్ ప్రకటించారు.

ALSO READ: Devji alias Tippiri Tirupati: వ్యక్తిగత జీవితం కోసం నేను బయటకు రాలేదు.. లొంగుబాటు అనంతరం దేవ్‌జీ కీలక వ్యాఖ్యలు

Related News

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కూతురు మాట్లాడితే నాపై చర్యలా? ముందు సీఎంపై చర్య తీసుకోవాలి-కొండా సురేఖ

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

Big Stories

Advertisement
×