E-Paper
Advertisement

పెళ్లి పేరుతో రూ.9కోట్లు చీటింగ్.. సీసీఎస్ విచారణ.. హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి!

పెళ్లి పేరుతో రూ.9కోట్లు చీటింగ్.. సీసీఎస్ విచారణ.. హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి!
Advertisement

Ashu Reddy:రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన అంశం అషురెడ్డి చీటింగ్ కేసు లండన్ నుంచి సెలవుల కోసం వచ్చిన వ్యక్తిని తన ప్రేమలో పడేసి, సుమారుగా రూ.9.35 కోట్ల మేర అతడి నుండి సొంతం చేసుకొని, బంగ్లాలు,ఖరీదైన కార్లు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసి , వాటిని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందని, పెళ్లి చేసుకోమని అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోంది అంటూ సదరు బాధితుడు తండ్రి యెనుముల సత్యనారాయణ హైదరాబాద్లోని సీసీఎస్ లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే .ముఖ్యంగా ఆమెపై, ఆమె కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే దీనిపై వెంటనే స్పందించిన అషు రెడ్డి సరైన ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించింది.

చీటింగ్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి..

అంతేకాదు నేడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది ఈ ముద్దుగుమ్మ.. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలి అంటూ పిటిషన్ దాఖలు చేసింది.. ఆ పిటిషన్ లో తనపై ధర్మేంద్ర తండ్రి చేసిన ఆరోపణలకు సంబంధించి పోలీసులు కనీస వివరణ అడక్కుండానే.. ఏకపక్షంగా కేసు నమోదు చేశారని.. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి.. వెంటనే ఈ కేసు కొట్టి వేయాలంటూ క్యాష్ పిటిషన్ లో పేర్కొంది. అంతేకాదు నిజాలు దాచి పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ..మొత్తానికైతే సీసీఎస్ లో కేసు నమోదైన వేళ విచారణ జరగబోయే సమయంలో ముందస్తుగానే హైకోర్టులో పిటిషన్ వేసింది అషు రెడ్డి. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ధర్మేంద్ర తండ్రి యెనుముల సత్యనారాయణ చేసిన ఆరోపణలు ఇవే..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే ధర్మేంద్ర తండ్రి అషు రెడ్డి పై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. “లండన్ లో ఐటీ ఉద్యోగం చేస్తున్న నా కొడుకు ధర్మేంద్ర 2018లో మమ్మల్ని కలవడానికి సెలవుల కోసం ఇండియాకి వచ్చాడు? ఆ సమయంలో అషు రెడ్డి తనను తాను పరిచయం చేసుకుంది. యూఎస్ఏ లో చదువు పూర్తి చేసి కొంతకాలం ఉద్యోగం చేసి సినిమాలలో నటించడానికి ఇండియాకి వచ్చానని చెప్పింది . ఇక ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి సుమారుగా 9.35 కోట్ల మేర డబ్బును తీసుకున్నారు. అలాగే ఐదు కేజీల బంగారం, విలువైన కార్లు, విలాసవంతమైన బంగ్లాలు కొనుగోలు చేసి తనపైనే రిజిస్టర్ చేయించుకుంది.. అలాగే ఈమె చెల్లి కూడా 50 లక్షలు తమ నుంచి వసూలు చేసింది. ఇక పెళ్లి విషయంపై నిలదీస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడమే కాకుండా తనపై తప్పుడు కేసులు పెడతానని భయపెట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నారు .

ALSO READ:తప్పని తెలుసుకున్న సమంత.. కోట్ల రూపాయల నష్టం!

హైకోర్టు నిర్ణయం ఎటువైపు?

Advertisement

ఈ కేసు విచారణ దశలో ఉండగానే ఇప్పుడు ఆమె హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంచరించుకుంది . ఇక ఈ పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×