E-Paper
Advertisement

Upcoming Earbuds 2026 March: JBL నుంచి Apple వరకు.. ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌తో మార్కెట్‌లోకి కొత్త బడ్స్!

Upcoming Earbuds 2026 March: JBL నుంచి Apple వరకు.. ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌తో మార్కెట్‌లోకి కొత్త బడ్స్!
Advertisement

Upcoming Earbuds 2026 March: కొత్త ఇయర్‌బడ్స్ కొందామని ప్లాన్ చేస్తున్నారా? బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి మార్చి నెల ఓ సువర్ణావకాశంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. ప్రముఖ కంపెనీలన్నీ తమ లేటెస్ట్ మోడల్స్‌ను మార్కెట్లోకి దించేందుకు రెడీ అయిపోయాయి. ఈసారి కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు.. మీ ఆరోగ్యాన్ని కూడా ట్రాక్ చేసే ఏఐ ఫీచర్లు, చెవికి భారం అనిపించని ఓపెన్ ఇయర్ డిజైన్లు ఆకట్టుకోనున్నాయి. మరి యాపిల్, జేబీఎల్ వంటి దిగ్గజ కంపెనీలు మన ముందుకు తెస్తున్న ఆ ఇయర్‌బడ్స్ ప్రత్యేకతలేవో ఇప్పుడు చూద్దామా.

JBL Sense Pro

మార్చి నెలలో విడుదల కాబోతున్న ఇయర్‌బడ్స్‌లో ఈ జేబీఎల్ సెన్స్ ప్రో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సుమారు రూ.18వేల ధరతో రానున్న ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఓపెన్ ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీనిలో అమర్చిన 16.2mm డ్రైవర్లు బెస్ట్ సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసే ఈ బడ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకోనుంది.

Advertisement

Also Read: బ్రాండెడ్ అని కొనేస్తున్నారా? ఈ తేడాలు తెలియకపోతే మీ డబ్బులన్నీ వృధానే!

Apple AirPods Pro 3

యాపిల్ తన ఎయిర్‌పాడ్స్ ప్రో సిరీస్‌లో మూడో వెర్షన్‌ను తీసుకురావడానికి రెడీగా ఉంది. ఈసారి కేవలం ఆడియో మాత్రమే కాకుండా ఆరోగ్యంపై కూడా సంస్థ శ్రద్ధ పెట్టింది. దీనిలో హార్ట్ రేట్ ట్రాకింగ్, ఏఐ సాయంతో పనిచేసే లైవ్ ట్రాన్స్‌లేషన్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే నాయిస్‌ను నియంత్రించే ANC ఫీచర్ కూడా ఈ బడ్స్‌లో ఉండటం విశేషం.

Samsung Galaxy Buds 4

Advertisement

శాంసంగ్ తన కొత్త తరం బడ్స్‌ను ఆధునిక డిజైన్‌తో మార్కెట్లోకి తెస్తోంది. Galaxy AIతో అనుసంధానించబడిన ఈ ఇయర్‌బడ్స్, వాయిస్ కమాండ్స్, ఆటోమేటిక్ సౌండ్ అడ్జస్ట్‌మెంట్ వంటి సౌకర్యాలను కలిగి ఉన్నాయి. ఈ బడ్స్ వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రీ డిజైన్ చేశారు.

Shokz OpenFit Pro

స్పోర్ట్స్ పర్సన్స్, జిమ్ చేసేవారి కోసం షోక్జ్ సంస్థ ఓపెన్ ఫిట్ ప్రోను లాంచ్ చేస్తోంది. ఇవి చెవిలోపలికి వెళ్లకుండా పైన మాత్రమే ఉంటాయి. దీంతో ఎక్కువ సేపు పెట్టుకున్నా నొప్పిగా అనిపించదు. బ్లూటూత్ 6.1 వంటి లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో ఇవి మార్కెట్లోకి వస్తున్నాయి.

Ai+ NovaPods

బడ్జెట్ ధరలో ఏఐ ఫీచర్లు కోరుకునే వారి కోసం నోవాపాడ్స్ మార్చి 2న విడుదల కానున్నాయి. దాదాపు రూ.8వేల ధరలో లభించే ఈ వేర్ బడ్స్.. హైఎండ్ ఫీచర్లను అందించనున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే టెక్నాలజీ దీనిలో ఉండటం విశేషం.

Also Read: బడ్జెట్ ధరలో ప్రీమియం హెడ్‌ఫోన్స్.. 120 గంటల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Related News

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

Big Stories

Advertisement
×