E-Paper
Advertisement

Noise Airwave Max 6: బడ్జెట్ ధరలో ప్రీమియం హెడ్‌ఫోన్స్.. 120 గంటల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Noise Airwave Max 6: బడ్జెట్ ధరలో ప్రీమియం హెడ్‌ఫోన్స్.. 120 గంటల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!
Advertisement

Noise Airwave Max 6: స్వదేశీ సంస్థ నోయిస్ తమ కొత్త హెడ్‌ఫోన్స్ ‘నోయిస్ ఎయిర్‌వేవ్ మాక్స్ 6’ను మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో వచ్చిన మాక్స్ 5 మోడల్‌కు అప్‌డేట్‌గా వీటిని తీసుకొచ్చారు. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ హెడ్‌ఫోన్స్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ లైఫ్, నాయిస్ క్యాన్సిలేషన్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీ కావాలనుకునే వారికి ఈ నోయిస్ ఎయిర్‌వేవ్ మాక్స్ 6 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ధర వివరాలు: 

ఈ నోయిస్ ఎయిర్‌వేవ్ మాక్స్ 6 హెడ్‌ఫోన్స్ ప్రారంభ ధరను కంపెనీరూ. 6,999గా నిర్ణయించింది. వీటిని నోయిస్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇవి డ్యూన్ వైట్, కోబాల్ట్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, కార్బన్ బ్లాక్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read: అస్తమానం కాల్స్ కట్ అవుతున్నాయా? ఈ ఒక్క సెట్టింగ్‌‌తో సిగ్నల్ లేకపోయినా కాల్స్ మాట్లాడొచ్చు!

120 గంటల ప్లేబ్యాక్:

నోయిస్ ఎయిర్‌వేవ్ మాక్స్ 6లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ దీని బ్యాటరీ లైఫ్. ఇది ఏకంగా 120 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఒకవేళ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుంటే.. 80 గంటల వరకు పని చేస్తుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే.. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 15 గంటల పాటు పాటలు వినే వీలుంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అద్భుతమైన ఆడియో క్వాలిటీ:

Advertisement

ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా క్వాలిటీ సౌండ్ కోసం దీనిలో రెండు డ్రైవర్లను ఉపయోగించారు. 40 ఎంఎం ప్రైమరీ డ్రైవర్ బేస్, మిడ్ ఫ్రీక్వెన్సీలను చూసుకుంటే.. 12 ఎంఎం సెకండరీ డ్రైవర్ ట్రెబుల్ క్లియరెన్స్ ఇస్తుంది. హైరెస్ ఆడియో, ఎల్‌డిఏసి సపోర్ట్ వల్ల యూజర్లు హై క్వాలిటీ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు. అలాగే దీనిలో బ్లూటూత్ 6.0 వెర్షన్ ఉండటం వల్ల కనెక్టివిటీ స్ట్రాంగ్‌గా ఉంటుంది.

నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్:

మన చుట్టుపక్కల శబ్దాలు వినిపించకుండా ఈ హెడ్‌ఫోన్స్‌లో 45 డెసిబుల్స్ వరకు స్మార్ట్ హైబ్రిడ్ ఏఎన్‌సీ టెక్నాలజీని వాడారు. అలాగే కాల్స్ మాట్లాడుతున్నప్పుడు గాలి వల్ల వచ్చే శబ్దం వినిపించకుండా ప్రత్యేకమైన చిప్‌ను కూడా అమర్చారు. రూ.7వేల బడ్జెట్‌లో సోనీ, జేబీఎల్ వంటి బ్రాండ్లకు ఇవి గట్టి పోటీనిచ్చేలా ఉన్నాయి.

Also Read: వాట్సప్ కొత్త రూల్.. ప్రతి 6 గంటలకూ లాగ్ అవుట్ అవ్వాల్సిందే, అందుకే ఇలా చేయండి!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×