E-Paper
Advertisement

Laptop Tips: ల్యాప్‌టాప్‌లో ఈ షార్ట్‌కట్స్ తెలిస్తే.. ఇకపై మౌస్ వాడాల్సిన అవసరమే ఉండదు!

Laptop Tips: ల్యాప్‌టాప్‌లో ఈ షార్ట్‌కట్స్ తెలిస్తే.. ఇకపై మౌస్ వాడాల్సిన అవసరమే ఉండదు!
Advertisement

Laptop Tips: నేటి ఆధునిక యుగంలో కంప్యూటర్ వాడకం చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి. చాలామంది ల్యాప్‌టాప్‌ల ద్వారానే ఆఫీస్ వర్క్, పర్సనల్ యూజ్, ఆన్‌లైన్ క్లాసెస్ ఇలా.. అన్ని పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ల్యాప్‌టాప్ కీబోర్డ్ మీద ఉండే ఆ ఒక్క సీక్రెట్ బటన్ గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా మనకు కీబోర్డ్ పైన కనిపించే F1 నుండి F12 వరకు ఉండే కీలను చూస్తుంటాం కానీ, వాటిని ఎలా వాడాలో చాలామందికి తెలియదు. వీటితో పాటు కీబోర్డ్ కింద ఎడమ వైపున Fn అని రాసి ఉన్న ఒక బటన్ ఉంటుంది. దీనినే ఫంక్షన్ కీ అంటాం. ఇది చూడటానికి సాధారణ బటనే అయినా.. దీనిని సరిగ్గా వాడితే మౌస్ లేకుండానే చాలా పనులు చిటికెలో చేసేయొచ్చు. అదెలాగో చూసేద్దాం రండి..

మల్టీ టాస్కింగ్ మాస్టర్..

చాలామంది ఈ బటన్‌ను ఒక్కటే నొక్కి చూస్తుంటారు. అలా చేసినప్పుడు ల్యాప్‌టాప్‌లో ఎలాంటి మార్పు కనిపించదు. అందుకే ఇది పని చేయని బటన్ అని పొరపడుతుంటారు. నిజానికి Fn కీని ఎప్పుడూ వేరే బటన్లతో కలిపి వాడాలి. అప్పుడే దాని అసలు పనితనం ఏంటో తెలుస్తుంది. మీరు స్క్రీన్ బ్రైట్‌నెస్ పెంచుకోవాలన్నా లేదా తగ్గించాలన్నా Fn బటన్‌తో పాటు F5 లేదా F6 నొక్కితే సరిపోతుంది. అలాగే సినిమా చూస్తున్నప్పుడు వాల్యూమ్ పెంచడానికి, తగ్గించడానికి లేదా మ్యూట్ చేయడానికి Fnతో పాటు F1, F2, F3 కీలను ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు ప్రొజెక్టర్ వాడుతున్నట్లయితే, స్క్రీన్‌ను మార్చుకోవడానికి Fn + F4 బాగా ఉపయోగపడుతుంది.

Advertisement

Also Read: రూపాయి కట్టకుండానే కొత్త ఫోన్ ఇంటికి.. రెనో, ఫైండ్‌పై కళ్లుచెదిరే ఆఫర్లు!

మరిన్ని షార్ట్‌కట్స్:

రాత్రిపూట పని చేసేటప్పుడు కీబోర్డ్ లైటింగ్ మార్చుకోవడానికి Fn + స్పేస్‌బార్ నొక్కితే చాలు. అలాగే వై-ఫై, బ్లూటూత్ ఆన్ చేయాలన్నా, టచ్‌ప్యాడ్‌ను కంట్రోల్ చేయాలన్నా ఈ బటన్ కీలక పాత్ర పోషిస్తుంది. ల్యాప్‌టాప్‌ను స్లీప్ మోడ్‌లో పెట్టడానికి, పవర్ సేవింగ్ ఆన్ చేయడానికి కూడా ఈ షార్ట్‌కట్ కీలు వాడొచ్చు. కొన్ని ల్యాప్‌టాప్ బ్రాండ్లు గేమింగ్ మోడ్, ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ వంటి ప్రత్యేక ఫీచర్ల కోసం కూడా Fn కీని కేటాయిస్తాయి.

ఫంక్షన్ లాక్ గురించి తెలుసా?

Advertisement

పదే పదే Fn బటన్ నొక్కడం ఇబ్బందిగా అనిపిస్తే.. దాన్ని ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. సాధారణంగా Fn + ESC బటన్ నొక్కితే ఈ ఫంక్షన్ లాక్ అవుతుంది. ఇది ఆన్ చేస్తే మీరు నేరుగా పైన ఉన్న కీలను వాడుకోవచ్చు. ల్యాప్‌టాప్‌ను స్మార్ట్‌గా వాడాలనుకునే వారికి ఈ Fn కీ చాలా ఉపయోగకరం. మీ ల్యాప్‌టాప్‌లో ఈ కీలు ఏ విధంగా సెట్ అయి ఉన్నాయో ఒకసారి చెక్ చేసి, మీకు ఈ చిట్కా నచ్చితే మీ స్నేహితులతో కూడా పంచుకోండి.

Also Read: భారత మార్కెట్లోకి నాయిస్ మాస్టర్ బడ్స్ 2.. ఇందులో వాడిన అత్యాధునిక ఫీచర్లు నెక్ట్స్ లెవెల్!

Related News

అమ్మబాబోయ్.. మళ్లీ పెరగబోతున్న రీఛార్జ్ ధరలు.. ఏకంగా 15% టారిఫ్ హైక్!

గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!

నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!

రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

డిజైన్ పిచ్చెక్కిస్తోంది బాబోయ్.. ఐకూ లవర్స్‌కి ఇది కదా కావాల్సింది!

యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

Big Stories

Advertisement
×