E-Paper
Advertisement

బడ్జెట్ ఫోన్ ప్రియులారా గెట్ రెడీ.. ఈ వారం మార్కెట్లోకి వస్తున్న టాప్ బ్రాండ్ల ఫోన్లు ఇవే!

బడ్జెట్ ఫోన్ ప్రియులారా గెట్ రెడీ.. ఈ వారం మార్కెట్లోకి వస్తున్న టాప్ బ్రాండ్ల ఫోన్లు ఇవే!
Advertisement

Upcoming Smartphones 2026: తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లు, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కొనాలనుకుంటున్న స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఈ వారం పండగే అని చెప్పాలి. భారతీయ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రముఖ మొబైల్ బ్రాండ్లు సిద్ధమయ్యాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్ల నుంచి అదిరిపోయే కెమెరాలు, భారీ బ్యాటరీలతో వచ్చే ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడళ్ల వరకు అన్ని రకాల ఫోన్లు ఈ వారం మార్కెట్లోకి రాబోతున్నాయి. మోటోరోలా, ఒప్పో, రియల్‌మీ, హెచ్ఎండీ లాంటి సంస్థలు సరికొత్త అప్‌గ్రేడ్స్‌తో మన ముందుకు వస్తున్నాయి. ఈ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం..

ఒప్పో నుంచి అల్ట్రా ప్రీమియం ఫోన్లు:

ఫొటోగ్రఫీని అమితంగా ఇష్టపడే వారి కోసం ఒప్పో సంస్థ Oppo Find X9 Ultra మోడల్‌ను తీసుకొస్తోంది. దీనిలో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు ఏకంగా 200MP కెమెరా ఉండబోతున్నట్లు సమాచారం. దీని ధర రూ.లక్ష దాటవచ్చని అంచనా. అలాగే అంత ధర పెట్టలేని వారి కోసం కొంచెం తక్కువ బడ్జెట్‌లో Find X9s మోడల్‌ను కూడా ఒప్పో పరిచయం చేయనుంది. ఇందులోనూ మంచి అమోలెడ్ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటాయి.

మోటోరోలా భారీ బ్యాటరీ ఫోన్లు:

Advertisement

బ్యాటరీ బ్యాకప్ ముఖ్యం అనుకునే వారి కోసం మోటోరోలా Moto G37 సిరీస్‌ను తెస్తోంది. ముఖ్యంగా Moto G37 Power మోడల్‌లో ఏకంగా 7000mAh భారీ బ్యాటరీని అందిస్తున్నారు. మిలిటరీ గ్రేడ్ మన్నిక, ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మీడియాటెక్ చిప్‌సెట్ వంటి ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర రూ.20,000 లోపే ఉండవచ్చని తెలుస్తోంది.

Also Read: టీనేజర్లకు పేటిఎం బంపర్ ఆఫర్.. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు!

బడ్జెట్ ధరలో రియల్‌మీ, హెచ్ఎండీ 5జీ:

Advertisement

రియల్‌మీ ఈసారి సరికొత్త రికార్డు సృష్టిస్తూ 8000mAh బ్యాటరీతో Realme 16T ఫోన్‌ను పరిచయం చేయబోతోంది. గేమర్లకు, ఎక్కువగా వీడియోలు చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. మరోవైపు, తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్ కావాలనుకునే వారి కోసం హెచ్ఎండీ సంస్థ HMD Vibe 2 5Gని రూ.10,000 లోపే తీసుకువస్తోంది. ఇందులో 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా ఉండనున్నాయి.

యూజర్లకు బోలెడు ఆప్షన్లు:

కంపెనీల మధ్య పోటీ పెరగడం వల్ల కస్టమర్లకే ఎక్కువ లాభం జరుగుతోంది. కేవలం కెమెరా, డిజైన్ మాత్రమే కాకుండా.. పెద్ద బ్యాటరీలు, ఫాస్ట్ చార్జింగ్, ఏఐ ఫీచర్లపై బ్రాండ్లు ఫోకస్ చేస్తున్నాయి. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు ఇస్తుండటంతో.. ఈ వారం కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి మార్కెట్లో బోలెడన్ని మంచి ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.

Also Read: మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న శాంసంగ్ కొత్త 5G మొబైల్స్!

Related News

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే! బడ్జెట్‌లో.. బెస్ట్ 4K డాల్బీ ఆడియో టీవీలు!

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

Big Stories

Advertisement
×