E-Paper
Advertisement

Upcoming Waterproof Mobiles: నీటిలో మునిగిపోయినా ఏం ఫర్లేదు.. మార్కెట్‌ను షేక్ చేయనున్న వాటర్‌ప్రూఫ్ మొబైల్స్ ఇవే!

Upcoming Waterproof Mobiles: నీటిలో మునిగిపోయినా ఏం ఫర్లేదు.. మార్కెట్‌ను షేక్ చేయనున్న వాటర్‌ప్రూఫ్ మొబైల్స్ ఇవే!
Advertisement

Upcoming Waterproof Mobiles: మధ్యతరగతి ప్రజలు ఒక స్మార్ట్‌ఫోన్ కొనాలంటే దాని కోసం ఎంతగానో ఆలోచిస్తారు. వేలల్లో డబ్బులు పెట్టి కొనుగోలు చేసే మొబైల్ ఎంతకాలం పాటు నడుస్తుంది? ఎలాంటి కంపెనీ అయితే బాగుంటుంది? ఎంత ధరలో కొనాలి.. ఇలా చాలా ప్రశ్నలు వారిలో తలెత్తుతాయి. ఎందుకంటే.. స్మార్ట్‌ఫోన్స్‌ను ప్రతిరోజూ గంటల తరబడి వాడుతుంటాం కాబట్టి.. కొన్నిసార్లు అవి ఉన్నట్టుండి పాడైపోతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జేబులో పెట్టినా, బ్యాగులో పెట్టినా, ఎంత భద్రంగా దాచినా.. కొన్నిసార్లు తడిచిపోతుంటాయి. ఇక అలాంటి సమస్య లేకుండా.. నీటిలో మునిగితేలినా పాడవ్వకుండా మెరుగ్గా పనిచేసే స్మార్ట్‌ఫోన్స్ త్వరలోనే విడుదల కానున్నాయి. ఆ ఫోన్లేవో ఇప్పుడు చూసేద్దామా..

2026 ప్రారంభంలోనే భారత మార్కెట్‌లో చాలా ఫోన్లు వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గతకొన్ని ఏళ్లలో వాటర్‌ప్రూఫ్ మొబైల్స్‌కు యూజర్లకు ఆసక్తి పెరిగింది. దీంతో ఇలాంటి ఫోన్లపై అంచనాలు కూడా బాగానే పెరిగాయి. IP రేటింగ్స్ ఉన్న ఫోన్లను వినియోగదారులు వర్షాకాలంలోనూ ఎలాంటి భయం లేకుండా ఉపయోగించాలనుకుంటున్నారు.

Redmi Note 15

Advertisement

త్వరలో భారత మార్కెట్‌లోకి విడుదల కానున్న వాటర్‌ప్రూఫ్ ఫోన్లలో రెడ్‌మీ నోట్ 15 ముందు వరుసలో ఉంది. ఇది అత్యాధునిక ఫీచర్లు, 6.83-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఫొటోగ్రఫీ కోసం శక్తిమంతమైన 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని టెక్ నిపుణుల అంచనా. ఈ ఫోన్‌లోని వాటర్‌ప్రూఫ్ ఫీచర్ IP రేటింగ్‌.. రెడ్‌మీ నోట్ 15 డివైస్‌ను నీటి ఎక్స్‌పోజర్ నుండి కాపాడుతుంది. ప్రత్యేకంగా వర్షాకాలంలో లేదా ఫోన్‌లో నీటిలో పడిపోయినప్పుడు.

Also Read: యాపిల్ iOS 26.3ను ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? ఏయే ఐఫోన్లకు సపోర్ట్ ఇస్తుంది? పూర్తి వివరాలు ఇవిగో!

Realme 15 Pro 5G

Advertisement

వాటర్‌ప్రూఫ్ ఫీచర్లను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్స్‌లో రియల్‌మీ 15 ప్రో 5G కూడా హై అంచనాలతో రానుంది. దీనిలో ప్లోడింగ్ కెమెరా ఎక్స్‌పీరియన్స్, స్నాప్‌డ్రాగన్ సిరీస్ ప్రాసెసర్, 7000mAh బ్యాటరీ వంటి బలమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా వాటర్‌ప్రూఫ్ సపోర్ట్ దీనిని రోజువారీ ఉపయోగంలో మరింత బలంగా నిలబెడుతుంది. వర్షంలోనూ ఆడుతూ, బీచ్ పర్యటనల్లోనూ వినియోగించుకోవచ్చు.

POCO M8

పోకో M8 మోడల్ కూడా త్వరలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగు పెట్టనుంది. POCO బ్రాండ్ బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫోన్లకు పేరుగాంచినది. దీనిలో హై క్వాలిటీ ఫొటోలు అందించే కెమెరా, భారీ సామర్థ్యం కలిగిన బ్యాటరీ, వాటర్‌ప్రూఫ్ ఫీచర్లు ఉంటాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ సెగ్మెంట్‌లో వాటర్‌ప్రూఫ్ ఫోన్లు కావాలనుకుంటున్న వినియోగదారుల ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్.

Xiaomi 17 Pro Max

ప్రముఖ షియోమీ సంస్థ నుంచి త్వరలో షియోమీ 17 ప్రో మ్యాక్స్ విడుదల కానుంది. ఇది హై ఎండింగ్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుందని సమాచారం. స్నాప్‌డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్, LTPO AMOLED డిస్‌ప్లే, 7500mAh బ్యాటరీ వంటి ఫీచర్లు దీన్ని పవర్‌ఫుల్ ఫోన్ల లిస్టులో నిలబెడతాయి. ఈ ఫోన్ వాటర్‌ప్రూఫ్ రేటింగ్ లిస్టులో ఉండటం వల్ల యూజర్లను ఆకర్షించే అవకాశం ఉంది.

Oppo A5 Pro 5G

యువతలో మంచి క్రేజ్ ఉన్న ఒప్పో నుంచి కూడా వాటర్‌ప్రూఫ్ మొబైల్ ఒప్రో A5 ప్రో హ్యాండ్‌సెట్ త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కూడా వాటర్‌ప్రూఫ్ రేట్‌తో అనుకున్న ఫీచర్ సెటప్స్‌ను కలిగి ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. మంచి బ్యాటరీ బ్యాకప్, మెరుగైన పనితీరును అందిస్తుందనే అంచనాలు వినియోగదారుల్లో పెరిగింది.

ఇక్కడ చెప్పిన ఫోన్లు ఇంకా అధికారికంగా మార్కెట్లో అందుబాటులోకి రావాల్సి ఉన్నాయి. కానీ వాటర్‌ప్రూఫ్ డిజైన్‌తో ఇవి వినియోగదారుల ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకుంటాయనే టాక్ నడుస్తోంది. 2026లో ఈ ఫోన్లు విడుదలైన తర్వాత వాటి పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలు, పనితనం గురించి మరిన్ని వివరాలు వెల్లడవుతాయి.

Also Read: అయ్యో.. ఏంటి మస్క్ మావా ఇలా జరిగింది.. గ్రోక్ ఏఐ చాట్‌బాట్‌ను బ్యాన్ చేసిన ఇండోనేషియా!

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×