E-Paper
Advertisement

Grok AI: అయ్యో.. ఏంటి మస్క్ మావా ఇలా జరిగింది.. గ్రోక్ ఏఐ చాట్‌బాట్‌ను బ్యాన్ చేసిన ఇండోనేషియా!

Grok AI: అయ్యో.. ఏంటి మస్క్ మావా ఇలా జరిగింది.. గ్రోక్ ఏఐ చాట్‌బాట్‌ను బ్యాన్ చేసిన ఇండోనేషియా!
Advertisement

Grok AI: కొన్నిరోజులుగా మహిళల డీప్‌ఫేక్ వివాదంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గ్రోక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌కు దిమ్మతిరిగేలా మరో షాక్ తగిలింది. మస్క్‌కు చెందిన Grok AI Chatbotలో స్త్రీలకు సంబంధించిన అశ్లీల, అసభ్యకర ఫొటోలు రూపొందుతున్నాయంటూ కొంతకాలంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా గ్రోక్ చాట్‌బాట్‌ను ఇండోనేషియా దేశం తాత్కాలికంగా నిలిపివేసింది.

ఎక్స్(Twitter) అనుసంధానంగా ఉన్న గ్రోక్ ద్వారా కొందరు ఆకతాయిలు అసభ్యకర ఫొటోలను రూపొందించారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు మహిళలను కించపరిచేలా డీప్‌ఫేక్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ విషయంలో ఎలాన్ మస్క్‌కు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే గ్రోక్ చాట్‌బాట్ వినియోగాన్ని ఇండోనేషియా దేశం తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. దీంతో గోర్క్ వ్యవస్థాపకుడు మస్క్‌కు బిగ్ షాక్ తగిలినట్లైంది.

Advertisement

Also Read: ఛీ.. ఇంత దారుణమా, అమ్మాయిలకు బికీనీలు వేస్తున్న Grok.. కేంద్రం నోటీసులు

ఏకంగా బ్యాన్ చేసి పడేసింది:

కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. గ్రోక్ ఇమేజ్ క్రియేషన్ విషయంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో.. సీరియస్ అయిన ఇండోనేషియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మరికొన్ని దేశాలు గ్రోక్‌ను బ్యాన్ చేయాలని పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో గ్రోక్ చాట్‌బాట్‌ యాక్సెస్‌ను బ్లాక్ చేసిన తొలి దేశంగా ఇండోనేషియా నిలిచింది.

హెచ్చరికలను పట్టించుకోకుండా..

Advertisement

అయితే.. గతంలోనే గ్రోక్ నిషేధం విషయంలో యూకే మంత్రి స్పందిస్తూ.. తమ దేశంలో డీప్‌ఫేక్‌ల పరంపర కొనసాగితే.. ఎక్స్‌ను నిలిపివేసే పరిస్థితి రావచ్చంటూ హెచ్చరికలు కూడా చేశారు. అంతలోనే.. ఇండోనేషియా ఏకంగా గ్రోక్ ఏఐ చాట్‌బాట్‌ను రద్దు చేసి పడేసింది.

భారత్ సైతం సీరియస్:

ఇకపోతే.. అశ్లీల కంటెంట్ విషయంలో ఎక్స్‌కు భారత ప్రభుత్వం కూడా ఇదివరకే తీవ్ర హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికల ద్వారా అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్‌ను తొలగించాలని గడువు కూడా విధించింది. ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌కు సంబంధించి కంప్లైంట్స్ వస్తున్నాయని, వీటికి ఆయా సామాజిక మాధ్యమ వేదికలే బాధ్యత వహించాలని కూడా భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈలోపు మస్క్‌కు దిమ్మతిరిగేలా గ్రోక్‌ను బ్యాన్ చేస్తూ ఇండోనేషియా నిర్ణయం తీసుకుంది.

Also Read: చాటింగ్ ఇక నెక్ట్స్ లెవెల్.. 2026లో వాట్సప్ స్టిక్కర్లు, వీడియో కాల్స్‌లో స్పెషల్ ఎఫెక్ట్స్ వచ్చేశాయ్!

 

 

 

 

 

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×