E-Paper
Advertisement

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
Advertisement

Road Accident: అతి వేగం ప్రమాదకరం. పదే పదే పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా యువత ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల బారినపడి ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి త్రిస్సూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేరళంలోని త్రిస్సూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదానికి కారు పూర్తిగా నుజ్జు నుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న 8 మంది విద్యార్థులు తీవ్రగాయాలు పాలయ్యారు. స్పాట్‌లో వారంతా ప్రాణాలు కోల్పోయారు. బాధితుల కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈలోగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకుని కారులో చిక్కుకున్న విద్యార్థులను అతికష్టం మీద బయటకు తీశారు. అప్పటికి వారంతా ఈ లోకాన్ని విడిచిపెట్టారు.

ఆగివున్న లారీని ఢీ కొట్టిన కారు, 8 మంది స్టూడెంట్స్ మృతి

Advertisement

పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి సుమారు 11.40 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మృతులు తమిళనాడులోని దిండిగల్‌లో ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. గురువాయూర్ నుండి కొడుంగల్లూరు వైపు జాతీయ రహదారిపై-66 రహదారిపై ప్రయాణిస్తున్నారు. మృతులు ఎనిమిది మందిలో ఆరుగుర్ని గుర్తించారు పోలీసులు. సూర్య, యువ సంజిత్, విశ్వ, జోహువా అనే నలుగురు దిండిగల్‌కు చెందినవారు. సంతోష్, ప్రసన్న మదురైకి చెందినవారని న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మరో ఇద్దరు విద్యార్థులను గుర్తించాల్సి వుందని తెలిపారు. ప్రమాదానికి గురైన కారు, తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగివుంది.

మృతులు ఇంజనీరింగ్ విద్యార్థులు, తమిళనాడుకు చెందినవారు

హైవేపై నిలిపిన లారీ మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ పేరు మీద ఉంది. నిర్మాణ పనుల్లో భాగంగా ట్రాఫిక్‌ను మళ్లించి బారికేడ్ల ప్రాంతానికి సమీపంలో పెట్టారు. హైవేకు కుడి వైపు లారీ పార్క్ చేశారు. అయితే కారు, లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. ప్రమాదం జరగ్గానే పారిపోయిన లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాల నుండి స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి గుర్తింపు కార్డులతో మృతుల కుటుంబాలను సంప్రదించారు. తమ పిల్లలు కేరళకు ప్రయాణించిన విషయం తెలియదని ఆయా కుటుంబాలు చెబుతున్నాయి.

Advertisement

ALSO READ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

 

Related News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

Big Stories

Advertisement
×