E-Paper
Advertisement

Vi క్రేజీ ప్లాన్.. రూ.200 రీఛార్జ్ చేస్తే చాలు.. 20 ఓటీటీలు, 200 ఛానెళ్లు ఉచితం!

Vi క్రేజీ ప్లాన్.. రూ.200 రీఛార్జ్ చేస్తే చాలు.. 20 ఓటీటీలు, 200 ఛానెళ్లు ఉచితం!
Advertisement

Vi OTT Plan: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమందికి థియేటర్‌కి వెళ్లి సినిమా చూసేంత సమయం ఉండదు. అలాంటి సమయంలో ఇంట్లోనే ఓటీటీ ద్వారా మూవీస్ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, దీని కోసం విడిగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం వినియోగదారులకు పెద్ద భారం అవుతోంది. ఈ సమస్యను తగ్గిస్తూ వొడాఫోన్ ఐడియా (Vi) ఒక సరికొత్త ప్రిపేడ్ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.200తో లభించే ఈ ప్లాన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్, డేటా ప్రయోజనాలను ఒకే రీఛార్జ్‌లో పొందవచ్చు.

వ్యాలిడిటీ, డేటా బెనిఫిట్స్:

ఈ ‘వి మూవీస్ అండ్ టీవీ’ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. దీనిలో యూజర్లకు 30GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంతేకాకుండా.. అర్హత కలిగిన వినియోగదారులకు ఉచితంగా అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా వి ఆఫర్ చేస్తోంది.

Advertisement

Also Read: అబ్బో.. Wi-Fi పాస్‌వర్డ్ లేకుండా కనెక్ట్ అవ్వడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయా?

ఉచితంగా OTT యాప్స్:

ఈ రూ.200 రీఛార్జ్‌తో జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, ఫ్యాన్‌కోడ్, షెమరూమీ వంటి ఏకంగా 20 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు. మొత్తం 16 భాషల్లోని సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రీజినల్ కంటెంట్ ఈ ప్యాక్‌లో అందుబాటులో ఉంటాయి.

లైవ్ టీవీ, మల్టీ స్క్రీన్ సపోర్ట్:

Advertisement

ఓటీటీల0తో పాటు దాదాపు 200కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను కూడా ఇందులో వీక్షించవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌లలో లాగిన్ చేసి, ఒకే సమయంలో రెండు స్క్రీన్‌లపై స్ట్రీమ్ చేసుకోవచ్చు. అయితే సోనీలివ్ యాప్‌కు మాత్రం కొన్ని పరిమితులు ఉంటాయి.

రీఛార్జ్ ఎలా చేసుకోవాలి?

సాధారణ కేబుల్ లేదా డీటీహెచ్ నెలవారీ ఖర్చుల కంటే ఇది చాలా తక్కువకే లభిస్తోందని కంపెనీ చెబుతోంది. వినోదంతో పాటు డేటా కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఆసక్తి ఉన్న వినియోగదారులు వి యాప్ లేదా ఇతర రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ ప్లాన్‌ను సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: Redmi 17 4G లీక్స్.. 7500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో త్వరలోనే మార్కెట్లోకి!

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×