Vi Recharge Plan: యూజర్లను ఆకట్టుకునేందుకు వోడాఫోన్ ఐడియా (Vi) ఇప్పటికే చాలా రకాల రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో రూ.349 ప్లాన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు ఉచిత కాల్స్, అపరిమిత 5G డేటాతో పాటు మరికొన్ని అదనపు బెనిఫిట్స్ ను సైతం వీఐ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.
వీఐ ఈ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ వ్యవధిలో ప్రతిరోజూ 1.5GB 4G డేటా యూజర్లకు లభించనుంది. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గనుంది. ఒకవేళ మీది 5G మెుబైల్ అయ్యుండి.. Vi 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నట్లైతే యూజర్లు అపరిమిత 5G డేటాను పొందొచ్చు.
ఈ ప్లాన్ లో కేవలం రోజువారీ డేటానే కాకుండా ఇందులో వీకెండ్ డేటా రోల్‌ఓవర్ సదుపాయాన్ని వీఐ అందిస్తోంది. దీనిద్వారా సోమవారం నుండి శుక్రవారం వరకు మిగిలిపోయిన డేటాను శని, ఆదివారాల్లో ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా వ్యాలిడిటీ కాలంలో ఒకసారి క్లెయిమ్ చేసుకోగలిగే 2GB ఉచిత బ్యాకప్ డేటా కూడా ఈ ప్లాన్ లో పొందొచ్చు. మరోవైపు రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉచితంగా అపరిమిత డేటాను (4G లేదా 5G) వినియోగించుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది.
ఈ ప్లాన్ ద్వారా దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. వీటితో పాటు ప్రతిరోజూ 100 ఉచిత SMSలు యూజర్లకు లభిస్తాయి. పరిమితి దాటిన తర్వాత పంపే మెసేజ్‌లకు సాధారణ ఛార్జీలు వర్తిస్తాయని వీఐ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి ఓటీటీ (OTT) ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలు లేకపోవడం కాస్త మైనస్ గా చెప్పవచ్చు. ఓవరాల్ గా రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజుకు సగటున రూ. 12.5 మాత్రమే యూజర్లకు ఖర్చు కానుంది.
Also Read: అప్పుడు అవమానం.. ఇప్పుడు అభిమానం.. తెలంగాణ యాసను తవ్వి తలకెత్తుకుంటున్న టాలీవుడ్!
తమ ఏరియాలో వీఐ నెట్‌వర్క్ 5G సేవలు అందుబాటులో ఉన్న వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగరంగా ఉండనుంది. అలాగే ఎక్కువ డేటా అవసరం ఉన్నవారికి, రాత్రి వేళల్లో అధికంగా ఇంటర్నెట్ వాడేవారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. నిత్యం ఓటీటీలు, సోషల్ మీడియా, యూట్యూబ్ చూసేవారికి ఈ ప్లాన్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని వీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!