Big Stories

Best Phones Under 20000 : రూ.20 వేల బడ్జెట్‌లో టాప్ రేటింగ్ ఫోన్లు ఇవే!

Best Phones Under 20000 : దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది.  రూ. 20 వేలు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో టెక్ కంపెనీల మధ్య అత్యంత పోటీ నెలకొంది. ఈ ధరలో మొబైల్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు చాలా ప్రముఖ బ్రాండ్‌లు పోటీ పడుతున్నాయి. ఇందులో షియోమీ, రియల్ మీ, వన్‌ప్లస్ వంటి బ్రాండ్లు సై అంటే సై అంటున్నాయి. ఈ కంపెనీలు దేశీయ ఫోన్ లవర్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు మంచి కెమెరా, బ్యాటరీ, స్పెసిఫికేషన్‌లను అందిస్తున్నాయి. రూ.20 వేల బడ్జెట్‌లో నిరంతరం ఫోన్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అయితే మీకోసం రూ.20 వేల బడ్జెట్‌లో ఫీచర్లు, పనితీరు ఆధారంగా కొన్ని ఫోన్లను మీకు అందిస్తున్నాం. వీటన్నింటికి ఆన్‌లైన్‌లో 4 పాయింట్ పైనే రేటింగ్ ఉంది.

- Advertisement -
  • Vivo T2 5G
  • OnePlus Nord CE 2 Lite
  • OnePlus Nord CE 3 Lite 5G
  • Oppo A78 5G
  • iQOO Z7s 5G
  • realme narzo 60X 5G
  • realme narzo 60 5G

 

- Advertisement -

Vivo T2 5G
ఈ జాబితాలో అత్యధిక రేటింగ్ కలిగిన మొబైల్ ఇది. ఫోన్ ప్రీమియంగా అనిపిస్తుంది. ఫోన్‌లో సూపర్ చిప్ సెటప్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ సూపర్ స్మూత్‌నెస్ ఇస్తుంది. ఫోన్ మంచి పెర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది. ఇది టర్బో AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్‌తో క్రిస్టల్-క్లియర్ ఇమేజ్‌లను క్లిక్ అనిపించవచ్చు. వివో స్మార్ట్‌ఫోన్ 6GB, 8GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 16MP ఫ్రంట్ ,64 MP ప్రైమరీ కెమెరాలు ఉన్నాయి. Funtouch OS 13పై రన్ అవుతుంది. 4500mAh బ్యాటరీ, 5G కనెక్టివిటీ ఉంది. ఈ ఫోన్ ధర రూ. 20 వేలుగా ఉంది.

Also Read : మోటో నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్‌పై ఓ లుక్కేయండి!

OnePlus Nord CE 2 Lite 5G
5జీలో ఇది అత్యంత విజయవంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఫోన్ మూడు కలర్స్‌లో లభిస్తోంది. బహామాస్ బ్లూ, బ్లూ టైడ్, బ్లూ వాయిడ్ వంటి కలర్స్ లభిస్తాయి. 8GBRAM+ 128GB,6GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్‌లు ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ OxygenOSలో పనిచేస్తుంది. ఫోన్‌‌లో
6.59 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్, 64MP + 2MP + 2MP‌తో బ్యాక్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ ఉంది.

OnePlus Nord CE 3 Lite 5G
వన్‌ప్లప్ Nord CE 3 లైట్ 5G ఫ్లాట్ ఎడ్జ్‌లను కలిగి ఉంది. ఇది మృదువైన ఇన్‌హ్యాండ్ అనుభూతిని ఇస్తుంది. 5000mAh బ్యాటరీ ఉంటుంది. దీని ఫ్లాగ్‌షిప్ SUPER VOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులోని బ్యాటరీ హెల్త్ ఇంజిన్ టెక్నాలజీ బ్యాటరీ లైఫ్ పెంచుతుంది. అలానే ఫోన్ హీట్ అవకుండా కూలింగ్ సెన్సార్లు, స్మార్ట్ ఛార్జింగ్ చిప్‌‌లు ఉన్నాయి. 6.72 ఇంచెస్ 2400 x 1080 పిక్సెల్‌లు 391 ppi డిస్‌ప్లే ఉంటుంది. Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్ ఉంది. 8GBRAM+128GB+256GB స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 108MP + 2MP + 2MP బ్యాక్ కెమెరా సెటప్ ఉంది. 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Oppo A78 5G
Oppo A78 స్మార్ట్‌ఫోన్ రూ.20 వేల బడ్జెట్‌లో ఉన్న ఫోన్లలో ఒకటి. ఇందులో5000mAh పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంది. అందువల్ల పవర్ పోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇందులో 33W SUPERVOOC ఉంది. ఇది బ్యాటరీకి లాంగ్ లైఫ్ ఇస్తుంది. కెమెరా పరంగా ఇది AI పోర్ట్రెయిట్ రీటౌచింగ్, పోర్ట్రెయిట్ మోడ్, మోనోక్రోమ్ వీడియో వంటి అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఇందులో6.67 అంగుళాల FHD+ సూపర్ AMOLED స్క్రీన్ ఉంది. మీడియాటెక్ 6833 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. RAM 8GB +128GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. ఇక కెమెరా విషయానికి వస్తే50MP + 2MP బ్యాక్, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

iQOO Z7s 5G
స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌తో వస్తుంది. iQOO Z7s 5Gని సింగిల్ ఛార్జ్‌తో రోజంగా వస్తోంది. 4500mAh బ్యాటరీ ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్‌తో పాటు స్పష్టమైన 6.38-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆప్టిక్స్ పరంగా ఫోన్ 64 MP OIS అల్ట్రా స్టేబుల్ కెమెరాతో పాటు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. మీ గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇది అల్ట్రా గేమ్ మోడ్, మోషన్ కంట్రోల్, 1200Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. RAM6GB,8GB+128GB స్టోరేజ్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. 64MP + 2MP బ్యాక్,16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Funtouch OS 13 Android 13 ఆధారంగా రన్ అవుతుంది.

Realme narzo 60X 5G
ఇందులో Realme Narzo 60 5G, Realme Narzo 60 Pro 5G మొబైల్‌లు ఉన్నాయి. Realme Narzo 60X 5G మంచి పనితీరును అందిస్తుంది. మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6.72 అంగుళాల డైనమిక్ అల్ట్రా స్మూత్ డిస్‌ప్లే ఉంది. realme UI 4.0, Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో MediaTek డైమెన్సిటీ 6100+ 5G చిప్‌సెట్ ఉంది. RAM 4GB,6GB,8GB +128GB స్టోరేజ్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. 50MP బ్యాక్, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000mAh బ్యాటరీ ఉంది.

Also Read : కిలో చికెన్ ధరకే Realme Norzo N53 స్మార్ట్‌ఫోన్.. కానీ అది ఉండాల్సిందే..!

రియల్ మీ నార్జో 60 5G
ఈ ఫోన్ అద్భుతమైన మార్స్ ఆరెంజ్ కలర్, ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్‌తో వస్తుంది. 90Hz సూపర్ AMOLED డిస్‌ప్లేతో క్లియ్ విజువల్స్ అందిస్తుంది.5000mAh బ్యాటరీ, 33W SUPERVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌కు మంచి బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇందులో6.43 అంగుళాల 90Hz సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. realme UI 4.0, Android 13 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. MediaTek డైమెన్సిటీ 6020 5G చిప్‌సెట్ ఉంది. 8GBRAM+128GB,256GB స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 64MP+2MP బ్యాక్ ,16MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News