E-Paper
Advertisement

Robinhood Release Date: దొంగతనానికి డేట్ ఫిక్స్ చేసుకున్న నితిన్.. పోస్టర్ అదిరింది బాసు

Robinhood Release Date: దొంగతనానికి డేట్ ఫిక్స్ చేసుకున్న నితిన్.. పోస్టర్ అదిరింది బాసు
Advertisement

Nithin – Robinhood: టాలీవుడ్ హీరో నితిన్‌కి హిట్ పడి చాలా కాలమే అయింది. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాడు. అయినా ఎక్కడా కూడా నిరాశ పడకుండా.. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

గతేడాది ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఎన్నో అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ రిలీజ్‌కు ముందు మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నా.. రిలీజ్ తర్వాత మాత్రం ఆకట్టుకోవడంలో విఫలం అయింది. దీంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు.

Advertisement

అయితే ఈ సారి ఎలా అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. ఇందులో భాగంగా ఇప్పుడు దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ‘రాబిన్‌హుడ్’ మూవీ చేస్తున్నాడు. ఇదివరకే నితిన్ – వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన ‘భీష్మ’ సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పటి మరో సారి వీరి కాంబో సెట్ కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read : ‘రాబిన్‌హుడ్’ కోసం రామ్-లక్ష్మణ్‌లు.. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్

Advertisement

కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ చాలా అద్భుతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో నితిన్ లుక్ అందరినీ అట్రాక్ట్ చేశాయి. ఎన్నడూ లేని పాత్రలో నితిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్‌ను మేకర్స్ అందించారు.

ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో నితిన్ క్యాప్ పెట్టుకొని ఓ బైక్‌పై కూర్చుని చాలా సీరియస్ ఉండటం చూడవచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ అప్డేట్‌తో సినీ ప్రియులు, అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ మూవీతో పాటు నితిన్ మరోక కొత్త చిత్రాన్ని ఇటీవలే ప్రకటించాడు. తమ్ముడు అనే టైటిల్‌తో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×