E-Paper
Advertisement

Vivo X200 Series: దూకుడు పెంచిన వివో.. కొత్త సిరీస్‌ నుంచి మూడు ఫోన్లు..!

Vivo X200 Series: దూకుడు పెంచిన వివో.. కొత్త సిరీస్‌ నుంచి మూడు ఫోన్లు..!
Advertisement

Vivo X200+ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వివో దేశీయ మార్కెట్‌లో సత్తా చాటుతోంది. రోజుకో కొత్త మోడల్ లాంచ్ చేస్తూ హవా చూపిస్తోంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలో కొత్త కొత్త ఫోన్లు పరిచయం చేస్తూ అదరగొడుతోంది. ఇప్పటికే చాలా సిరీస్‌లలో రకరకాల మోడళ్లను రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ అందుకున్న కంపెనీ ఇప్పుడు మరొక కొత్త సిరిస్‌తో వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Vivo తన లైనప్‌లో ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ను Vivo X200 సిరీస్ ఫోన్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సిరీస్‌లోని ముఖ్యమైన మోడల్ Vivo X200+ రీసెంట్‌గా డేటాబేస్లో కూడా గుర్తించబడింది. కాగా ఇంతకుముందు కంపెనీ Vivo X200 Miniని లాంచ్ చేస్తుందని ఊహించారు. కానీ ఇప్పుడు ఈ కొత్త ఫోన్ Vivo X200+ పేరుతో విడుదల కానుందని తెలుస్తోంది. రాబోయే Vivo స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటివరకు లీక్ అయిన వివరాలను తెలుసుకుందాం.

Advertisement

Vivo X200 సిరీస్‌లో Vivo X200+ ఫోన్ ప్రత్యేక ఎడిషన్‌గా ఉండబోతోంది. ఈ ఫోన్ IMEI డేటాబేస్‌లో కూడా గుర్తించబడింది. V2415 మోడల్ నంబర్‌తో ఫోన్ గుర్తించబడిందని GizmoChina పేర్కొంది. ఇది ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో పోటీని మరింత పెంచగల హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ అని కూడా చెప్పబడింది. ఇందులో మూడు మోడళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో X200, X200+, X200 Pro వంటి మోడళ్లను ఈ సిరీస్‌ ద్వారా లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. కంపెనీ Vivo X200+ స్పెసిఫికేషన్‌ల గురించి ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

Also Read: 108MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఇన్‌ఫినిక్స్ నుంచి కొత్త సిరీస్.. సేల్ ఎప్పుడంటే..?

Advertisement

Vivo X200 Pro ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు ఇంతక ముందు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ V2413 మోడల్ నంబర్‌తో కనిపించింది. Vivo X200 Pro స్మార్ట్‌ఫోన్ 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇలాంటి లెన్స్ Vivo X100 అల్ట్రాలో కూడా ఉంది. X200 ప్రోలో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కూడా చూడవచ్చు. అలాగే లీక్‌ అయిన దాని ప్రకారం చూస్తే.. ఈ ఫోన్ 6.7-అంగుళాల 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఈ డిస్‌ప్లేను చైనీస్ తయారీదారు మాత్రమే తయారు చేస్తారు. డిస్ప్లే సన్నని బెజెల్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా Vivo X200 Proలో 6000mAh లేదా అంతకంటే పెద్ద బ్యాటరీని ఆశించవచ్చు. ఇకపోతే Vivo X200 సిరీస్ గురించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ సిరీస్ స్పెసిఫికేషన్స్ లీకుల ద్వారా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నాయి.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×