BigTV English

CM Revanth Reddy: క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Give Awards To Marathon Winners: గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్‌ను క్రీడా కార్యక్రమాలకే వినియోగిస్తామని, క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథన్ విజేతలకు బహుమతులు అందజేశారు.


క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురికావడంతో ఆస్థాయికి చేరుకోలేకపోయిందని రేవంత్ అన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తొందన్నారు. తెలంగాణ యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నామని, గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే అకాడమిక్ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి కోచ్‌లను తీసుకొచ్చి ఇక్కడ క్రీడలకు శిక్షణ అందించనున్నట్లు వివరించారు. అలాగే ఒలింపిక్స్‌ను హైదరాబాద్‌లోనూ నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మన స్టేడియాలను తీర్చిదిద్దుతామన్నారు.


Also Read: హైడ్రా టార్గెట్ N..దరిపై?..225 విల్లాలకు నోటీసులు

అలాగే ఖేల్ ఇండియా నిర్వహణను తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామన్నారు. 2036లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం ఇవ్వాలని కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించేలా కృషి చేస్తున్నామన్నారు.  దేశంలోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామని వెల్లడించారు.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×