BigTV English
Advertisement

Babu Gogineni demand: బిగ్ బాస్ హోస్టింగ్ కు నాగార్జున అనర్హుడు : బాబు గోగినేని

Babu Gogineni demand: బిగ్ బాస్ హోస్టింగ్ కు నాగార్జున అనర్హుడు : బాబు గోగినేని

Big boss 2 contestant Babu Gogineni demand to eliminate Hero nagarjune from the show: బిగ్ బాస్ లో సీజన్ 2 కంటెస్టెంట్ గా ఎలిమినేడ్ అయ్యారు బాబు గోగినేని. బిగ్ బాస్ నుంచి ఎలిమినేటర్ అయ్యాక బాబు గోగినేని తనకు సంబంధించని వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ బిగ్ బాస్ అంతా ఫేక్ అంటూ ఆ రియాలిటీ షో పై నిందలు గుప్పించారు. ఇక రాజకీయ, సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత వ్యవహారాలలోనూ తలదూర్చి వివాదాస్పద బాబుగా ప్రసిద్ధిపొందారు. బిగ్ బాస్ షోలో ఉండగానే బాబు గోగినేనిపై బయట కేసు బుక్ అయింది. కులాలు,మతాలు పేరుతో దేశప్రజలను రెచ్చగొట్టారని, మతానికి సంబంధించి అనుచిత ప్రచారం చేశాడని బాబు గోగినేనిపై కేసు కూడా అప్పట్లో నమోదయింది.


వివాదాస్పద గోగినేని

తనకి తాను హేతువాదిగా చెప్పుకునే బాబు గోగినేని ఎదుటి వారిని తన వాగ్వాదంతో పడేస్తుంటాడు. బిగ్ బాస్ లో ఉన్నంత కాలం తనకి తాను ఓ పెద్ద మనిషిగా ఉంటూ ఏ గేమ్ లోనూ పార్టిసిపేట్ చెయ్యకుండా..కంటెస్టెంట్లకు క్లాసులు పీకుతూ కాలక్షేపం చేశారు బాబు గోగినేని. బయటకొచ్చాక కూడా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి సినీ సెలబ్రిటీలపై వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో జాతకాలు చెప్పే వేణుస్వామిపైనా విరుచుకుపడ్డారు. ఓ టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ వేణుస్వామి చెప్పే జాతకాలలో ఎలాంటి నిజాలు ఉండవని..ఆయన సెలబ్రిటీలను భయాందోళనలకు గురిచేస్తుంటారని అన్నారు. దానితో వేణు స్వామి కూడా తగ్గేద లేదంటూ బాబు గోగినేనిపై ప్రతి విమర్శలు చేశారు. తాను పూజ చేసి ఓ గుమ్మడికాయను కొడితేనే బాబు గోగినేని ఆస్ట్రేలియా పారిపోయారని ఐదేళ్లు అక్కడే సెటిల్ అయిపోయిన బాబు గోగినేని ఓ సంపాదన లక భార్య సంపాదనపై బతికే సాధారణ వ్యక్తి అన్నారు. పైగా బాబు గోగినేని ఓ మానసిన వ్యాధిగ్రస్తుడని..అలాంటి వ్యాధితో బాధపడుతున్నాడని వ్యాఖ్యానించారు. మొత్తానికి బాబు గోగినేని అంటేనే ఓ వివాదం. అలాంటి బాబు గోగినేని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.


నాగార్జునని ఎలిమినేట్ చెయ్యాలి

ఎన్ కన్వెన్షన్ వ్యవహారంలో అక్రమ కట్టడాలని చెప్పి వాటికి సంబంధించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బాబు గోగినేని బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోని దేశం మొత్తం చూస్తుందని..నాగ్ ఇలాంటి అక్రమ కట్టడాలతో సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో తెలియడం లేదని..ఆయనకు కంటెస్టెంట్లకు నీతులు చెప్పే అర్హత లేదని అన్నారు. అందరూ కలిసి నాగ్ కు వ్యతిరేకంగా ఓట్లేసి ఆయనను ఎలిమినేట్  చెయ్యాలని బాబు గోగినేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇకనైనా బిగ్ బాస్ నిర్వాహకులు హోస్టులుగా తీసుకునేవారి బ్యాక్ గ్రౌండ్ కూడా చూడటం మంచిదని ..లేకుంటే మొత్తం బిగ్ బాస్ షో పైనే ఈ ప్రభావం పడుతుందని అంటున్నారు.

వివరణ ఇచ్చుకోవాల్సిందే..

మరో వారం రోజుల్లో బిగ్ బాస్ సందడి మొదలుకానుంది. ఇలాంటి పరిస్థితిలో నాగార్జునను మార్చాలంటూ ప్రచారం జరుగుతోంది. అన్ని ఒప్పందాలు అయిపోయాక ఇప్పుడు మార్చడం తలనొప్పితో కూడిన వ్యవహారమే. ఇకపై నాగార్జున ఏ మీడియా సమావేశంలోనైనా ఎన్ కన్వెన్షన్ ఆక్రమణ గురించి వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×