E-Paper
Advertisement

Vivo S50 Pro Mini: త్వరలో వివో S50 ప్రో మినీ లాంచ్‌.. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కాకరేపుతున్న ఫీచర్లు!

Vivo S50 Pro Mini: త్వరలో వివో S50 ప్రో మినీ లాంచ్‌.. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కాకరేపుతున్న ఫీచర్లు!
Advertisement

Vivo S50 Pro Mini: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వీవో నుంచి Vivo S50 Pro Mini ఫోన్ త్వరలోనే చైనాలో విడుదల కానుంది. అదే స్మార్ట్‌ఫోన్ Vivo X300 FE పేరుతో భారత్‌లోనూ లాంచ్ అవుతుందని సమాచారం. ఈ ఫోన్ ధర భారతీయ మార్కెట్‌లో రూ.54,999 ఉండవచ్చని లీక్స్ చెబుతున్నాయి. అలాగే ఈ ఫోన్ హై-ఎండ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ వివో S50 ప్రో మినీ స్మార్ట్‌ఫోన్ 6500mAh బ్యాటరీ ప్యాక్‌, కాంపాక్ట్ 6.31-అంగుళాల POLED డిస్‌ప్లేను కలిగి ఉండనుంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం రండి..

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే:

Vivo S50 Pro Mini హ్యాండ్ సెట్ 1.5K రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో కాంపాక్ట్ 6.31-అంగుళాల POLED డిస్‌ప్లేను కలిగి ఉండచ్చు. ఇది 5000 నిట్‌ల వరకు చాలా ఎక్కువ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీనితోపాటు వాటర్, డస్ట్ ప్రూఫ్‌గా ఉండటానికి IP68, IP69 రేటింగ్‌ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ హరిజెంటల్ వెనుక కెమెరా బార్ డిజైన్‌తో కనిపిస్తుంది.

Advertisement

Also Read: ఏఐ కెమెరాతో వచ్చేస్తోన్న లావా న్యూ స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీక్‌!

ట్రిపుల్ కెమెరా సెటప్:

ఈ వివో మినీ ఫోన్ కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందచ్చు. దీనిలో పెద్ద ప్రైమరీ సెన్సార్‌తో పాటు 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌తో 3x ఆప్టికల్ జూమ్,అల్ట్రా-వైడ్ కెమెరా ఉండనుంది. అలాగే ఈ ఫోన్ ముందు భాగంలో యాంటీ-డిస్టార్షన్, ఆటోఫోకస్ ఫీచర్లతో 50 MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

రెండ్రోజుల బ్యాటరీ బ్యాకప్:

Advertisement

తాజా నివేదికల ప్రకారం.. ఈ వివో S50 ప్రో మినీ స్మార్ట్‌ఫోన్ 90W ఫ్లాష్ ఛార్జ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6500 mAh బ్యాటరీ లైఫ్‌తో రానుందని అంచనా. ఒకసారి ఛార్జ్ చేశాక.. రెండు రోజుల పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించవచ్చు. అలాగే ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో హై-ఎండ్ పనితీరు, శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కోరుకునే వాళకు ఈ వివో S50 ప్రో మినీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో రానుంది. ఈ ఫోన్‌లో 12GB లేదా 16GB RAM, 256GB లేదా 512GB UFS 4.1 ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉండవచ్చు.

Also Read: ఫొటోగ్రఫీ లవర్స్‌కు పండగే.. దుమ్మురేపే ఫీచర్లతో షియోమి 17 అల్ట్రా దిగనుంది!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×