Vivo T5 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘వీవో’ (Vivo) తన పాపులర్ T సిరీస్‌లో సరికొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ‘వీవో T5 ప్రో 5G’ (Vivo T5 Pro 5G) పేరుతో వస్తున్న ఈ ఫోన్ ఏప్రిల్ 15న లాంచ్ కానుంది. అయితే లాంచ్‌కు ముందే ఈ ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించిన కీలక వివరాలు గీక్‌బెంచ్ (Geekbench) లిస్టింగ్ ద్వారా బయటకు వచ్చాయి. గతేడాది విడుదలైన T4 ప్రోకు సక్సెసర్‌గా ఇది వస్తోంది.
Read also-మిడిల్ క్లాస్ ఇష్టపడే ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ కార్లు ఇవే.. ఫీచర్లు పిచ్చెక్కిస్తాయి..
లీక్ అయిన సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల 1.5K రిజల్యూషన్ కలిగిన ఫ్లాట్ OLED డిస్‌ప్లేనుతో వస్తుంది. గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 చిప్‌సెట్‌ను వాడినట్లు తెలుస్తోంది. ఇది మల్టీ టాస్కింగ్ హై-ఎండ్ గేమింగ్‌కు మెరుగైన మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే అవకాశం ఉంది.
ఈ ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ సామర్థ్యం. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5000mAh బ్యాటరీ చూస్తుంటాం, కానీ వీవో T5 ప్రోలో ఏకంగా 9,020mAh భారీ బ్యాటరీని అమర్చినట్లు సమాచారం. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ మందం కేవలం 8.25mm మాత్రమే ఉండటం విశేషం. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో బ్యాటరీ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది.
ఫోన్ వెనుక భాగంలో పిల్-షేప్ (Pill-shaped) కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా మరియు 8MP సెకండరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో నాణ్యమైన కెమెరాను ఆశించవచ్చు. ఈ ఫోన్ IP68/69 రేటింగ్‌తో వస్తోంది, అంటే నీరు, దుమ్ము నుండి దీనికి పూర్తి రక్షణ ఉంటుంది.
Read also-మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. తగ్గనున్న రీఛార్జ్ భారం!
ధర విషయానికి వస్తే, ఈ సిరీస్ మునుపటి మోడల్స్ కంటే కాస్త ఖరీదైనదిగా ఉండవచ్చు. బేస్ వేరియంట్ ధర దాదాపు రూ. 30,000 నుండి ప్రారంభం కావచ్చని, టాప్ వేరియంట్ (12GB RAM + 256GB స్టోరేజ్) ధర రూ. 36,999 వరకు ఉండవచ్చని టెక్ నిపుణుల అంచనా. ఏప్రిల్ 15న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ అధికారికంగా విడుదల కానుంది. లాంచ్ తర్వాత ఇది ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వేదికగా అమ్మకానికి అందుబాటులోకి రానుంది. మీడియం బడ్జెట్‌లో పవర్‌ఫుల్ బ్యాటరీ మరియు డిస్‌ప్లే కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక కానుంది.