Recharge Prices: ప్రస్తుతం పెరిగిన మొబైల్ టారిఫ్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. ఇది వరకు రోజులతో పోలీస్తే అది సామాన్యులకు తలకు మించిన భారం అవుతోంది. అయితే, త్వరలోనే మొబైల్ రీఛార్జ్ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు వినియోగదారులకు ఊరటనివ్వనున్నాయి.
Read also-మిడిల్ క్లాస్ ఇష్టపడే ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ కార్లు ఇవే.. ఫీచర్లు పిచ్చెక్కిస్తాయి..
ప్రస్తుతం దాదాపు అన్ని టెలికాం కంపెనీలు డేటా కాలింగ్ కలిపి ఉన్న ప్లాన్లనే విక్రయిస్తున్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ అవసరం లేని సాధారణ ఫోన్ వినియోగదారులు (ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు, వృద్ధులు) కూడా అనవసరంగా డేటా కోసం అదనపు ఖర్చు చేయాల్సి వస్తోంది. TRAI ఇప్పుడు కేవలం ‘వాయిస్ కాలింగ్’ మాత్రమే ఉండే చౌకైన ప్లాన్లను ప్రవేశపెట్టాలని కంపెనీలపై ఒత్తిడి తెస్తోంది.
గత ఏడాది జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీనిపై సామాన్యుల నుండి తీవ్ర అసహనం వ్యక్తమైంది. కనీస రీఛార్జ్ ధరలు పెరగడంతో లక్షలాది మంది వినియోగదారులు తమ సిమ్ కార్డులను వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, సామాన్యులకు అందుబాటులో ఉండేలా బేసిక్ రీఛార్జ్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Read also-రైలు సీటు దగ్గరికే ఫుడ్ డెలివరీ.. ixigo, Swiggy కొత్త సర్వీస్ షురూ!
సాధారణంగా నెల రీఛార్జ్ అంటే 28 రోజులే ఉండటంపై వినియోగదారుల్లో అసంతృప్తి ఉంది. దీనిని సరిదిద్ది, పూర్తి 30 రోజుల వాలిడిటీతో పాటు, సరసమైన ధరలకే లాంగ్-టర్మ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ భావిస్తోంది.
సాధారణ ఫోన్ వినియోగదారులు కీప్యాడ్ ఫోన్లు వాడుతూ కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే మొబైల్ వాడే వారికి ఇది పెద్ద ఊరట. వైఫై అందుబాటులో ఉండి మొబైల్ డేటా అవసరం లేని వారికి తక్కువ ఖర్చుతో కూడిన ప్లాన్లు దొరుకుతాయి. రీఛార్జ్ ఖర్చుల భారం తగ్గడం వల్ల నెలకు కొంత పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. టెలికాం రంగంలో పోటీ పెరగడం ప్రభుత్వ నియంత్రణ సంస్థల జోక్యంతో త్వరలోనే కంపెనీలు కొత్త టారిఫ్ ప్లాన్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇది అమలైతే, మొబైల్ రీఛార్జ్ అనేది విలాసంగా కాకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండే అవసరంగా మారుతుంది.