Vivo T5x 5G vs Realme 14T vs Motorola Edge 60 Fusion Smartphone Comparison| చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో తాజాగా వివో T5x 5G భారతదేశంలో విడుదల చేసింది. ఈ మిడ్ రేంజ్ ఫోన్‌కు పోటీగా ఇదే ధరలో రియల్‌మి 14T, మోటొరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఫోన్లు ఉన్నాయి. మూడు ఫోన్లు కూడా తక్కువ ధరలో బలమైన ఫీచర్స్‌తో ఉన్నాయి. మూడింటిలో మీరు ఏది కొనుగోలు చేయాలో వాటి ఫీచర్లు పోల్చి తెలుసుకుందాం.
వివో T5x 5G మూడు వేరియంట్లలో స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
6GB ర్యామ్+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999, 8GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999, 8GB ర్యామ్ +256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999.
మోటొరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G రెండు వేరియంట్లు: 8GB ర్యామ్ +256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999, 12GB ర్యామ్ +256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999.
రియల్‌మి 14T 5G చౌకగా ఉంది: 8GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ రూ.17,999, 8GB ర్యామ్ +256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999.
రూ.20,000 రేంజ్‌లో రియల్‌మి చౌక, వివో మధ్యస్థం, మోటొరోలా ప్రీమియం ఫీచర్లతో ఉంది.
వివో T5x 5Gలో 6.76 అంగుళాల Full HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది.
మోటొరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5Gలో 6.7 అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED డిస్‌ప్లే, 120Hz రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. ఇది చాలా మంచి విజువల్స్ ఇస్తుంది.
రియల్‌మి 14T 5Gలో 6.67 అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే, Full HD+, 120Hz రేట్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది.
బ్రైట్‌నెస్, కలర్స్‌లో మోటొరోలా ముందుంది.
వివో T5x 5Gలో మిడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్ ఉంది. డైలీ టాస్క్‌లు, గేమింగ్ కోసం బాగుంటుంది.
మోటొరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5Gలో కూడా డైమెన్సిటీ 7400 ఉంది. బ్యాలెన్స్‌డ్ పర్‌ఫామెన్స్ కోరుకునేవారికి మంచి ఛాయిస్.
రియల్‌మి 14T 5Gలో డైమెన్సిటీ 6300 ఉంది. ఎఫిషియెన్సీ మీద దృష్టి, హై పెర్ఫామెన్స్ కంటే తక్కువ.
రియల్‌మి కంటే వివో, మోటొరోలా గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు బెటర్ ఆప్షన్లు.
వివో T5x 5G ఆండ్రాయిడ్ 16 + OriginOS 6తో వస్తుంది. దీని ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా ఉంటుంది.
మోటొరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5Gలో ఆండ్రాయిడ్ 15 + Hello UIతో ఉంటుంది. మంచి క్లీన్, స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
రియల్‌మి 14T 5G ఆండ్రాయిడ్ 15 + రియల్‌మి UI 6తో వస్తుంది. చాలా కస్టమైజేషన్ ఆప్షన్లు ఉన్నాయి.
వివో T5x 5Gలో 7200mAh పెద్ద బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. బ్యాటరీ లైఫ్ బెస్ట్.
మోటొరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5Gలో 5500mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుండడంతో త్వరగా ఛార్జ్ అవుతుంది.
రియల్‌మి 14T 5Gలో 6000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్.. బ్యాటరీ, స్పీడ్ బ్యాలెన్స్ బాగుంది.
వివో T5x 5Gలో 50MP మెయిన్ + 2MP డెప్త్, 32MP సెల్ఫీ.
మోటొరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5Gలో 50MP OIS మెయిన్ + 13MP సెకండరీ, 32MP సెల్ఫీ కెమెరా బాగుంది.
రియల్‌మి 14T 5Gలో 50MP మెయిన్ + 2MP మోనోక్రోమ్, 16MP సెల్ఫీ.
వివో T5x 5G 219 గ్రాములు.
మోటొరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G 180 గ్రాములు. స్లిమ్, లైట్‌వెయిట్.
రియల్‌మి 14T 5G 196 గ్రాములు. బ్యాలెన్స్‌డ్ డిజైన్.
మూడింటిలో వివో కాస్త ఎక్కువ బరువుతో వస్తుంది.
Also Read: రంజాన్ స్పెషల్ ఆఫర్.. ఏఐ ఫీచర్స్ గల ఫ్రిజ్, AC, వాషింగ్ మెషీన్లపై రూ.20000 క్యాష్‌బ్యాక్
పెద్ద బ్యాటరీ కావాలంటే వివో T5x 5G బెస్ట్.
డిస్‌ప్లే, కెమెరా కావాలంటే మోటొరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G మంచి ఆప్షన్.
వాల్యూ ఫర్ మనీ కావాలంటే రియల్‌మి 14T 5G సరిపోతుంది.
మీ అవసరాలు, బడ్జెట్ బట్టి ఎంచుకోండి.
ముఖ్య గమనిక: ఈ కథనంలో మీకు పరిచయం చేసిన మూడు స్మార్ట్‌ఫోన్లు, వాటి ధరలు.. ఆయా కంపెనీలు ఇచ్చే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. ఫోన్ కొనుగోలు చేసే సమయంలో సరిగా చెక్ చేసుకొని కొనాలని పాఠకులకు సూచన. ఈ కథనంలో పేర్కొన్న ఫోన్ల ధరలు మీరు కొనుగోలు చేసే సమయానికి మారిపోయి ఉండవచ్చు. ‘బిగ్ టీవీ’ అలాంటి విషయాలకు బాధ్యత వహించదు. ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే.