
Samantha ( Source / Instagram)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత... ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఏం మాయ చేసావే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.. ఆ మూవీతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది.. తన క్యూట్ నెస్ తో వరుసగా సినిమాల అవకాశాలను అందుకుంది.

Samantha ( Source / Instagram)
ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించడంతో పాటుగా స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ఇప్పటివరకు ఏమి చేసినా సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాయి..

Samantha ( Source / Instagram)
రంగస్థలం మూవీలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది.. అంతేకాదు వెబ్ సిరీస్ లలో కూడా నటించి ఆకట్టుకుంది..

Samantha ( Source / Instagram)
ఈ బ్యూటీ నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమోరితో పెళ్లి జరిగింది.. ఈమె దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది..

Samantha ( Source / Instagram)
ఇక రెండో పెళ్లి తర్వాత సమంత సినిమాల జోరును పెంచేసింది.. ఒకవైపు వెబ్ సిరీస్ లు మరోవైపు సినిమాలను లైన్లో పెట్టుకుంటూ బిజీగా ఉంది.. ప్రస్తుతమామే రెండు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరించబోతుంది..

Samantha ( Source / Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే సమంత తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసుకుంది.. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో యెల్లో శారీలో మెరిసింది. బాపు బొమ్మలా ఎంతో అందంగా ఉంది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.