E-Paper
Advertisement

Ambati Rambabu: పోసాని గతే అంబటికి పట్టనుందా? 8 రోజుల్లో 36 కేసులు.. రాష్ట్రమంతా తిప్పే ప్లాన్!

Ambati Rambabu: పోసాని గతే అంబటికి పట్టనుందా?  8 రోజుల్లో 36 కేసులు.. రాష్ట్రమంతా తిప్పే ప్లాన్!
Advertisement

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu)పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. కాగా అంబటిపై దాఖలైన నాలుగు పిటిషన్లపై ఇవాళ (సోమవారం) గుంటూరు కోర్టు (Guntur Court)లో విచారణ జరగనుంది. అయితే గతంలో పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి ఎదురైన పరిస్థితే అంబటి రాంబాబుకు సైతం ఎదురవుతుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు చూస్తుంటే ఇదే అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి.

8 రోజుల్లో 36 కేసులు నమోదు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు తారా స్థాయికి చేరుకున్నట్లు వైసీపీ (YSRCP) ఆరోపిస్తోంది. రాజమండ్రి జైలు (Rajahmundry central jail) నుంచి అంబటిని గుంటూరు కోర్టుకు తీసుకొస్తున్న క్రమంలో నెట్టింట కీలక పోస్టు పెట్టింది. అంబటి రాంబాబుపై రాష్ట్రవ్యాప్తంగా 8 రోజుల్లో 36 కేసులు నమోదైనట్లు వైసీపీ లీగల్ సెల్ (YSRCP Legal Cell) ఎక్స్ ఖాతాలో పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వం (AP Govt) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ 44 కేసులు అంబటిపై నమోదయ్యాయని తెలియజేసింది.

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా తిప్పే ప్లాన్..!

అంబటిపై నమోదైన కేసులకు సంబంధించి పిటి వారెంట్లు వేసి రాష్ట్రమంతా విచారణ పేరుతో ఆయన్ను తిప్పాలని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు వైసీపీ లీగల్ సెల్ ఆరోపించింది. ఇందులో భాగంగానే పట్టాభిపురం పోలీస్ స్టేషన్ (Pattabhipuram Police station) పరిధిలో నమోదైన కేసులకు సంబంధించి పిటి వారెంట్ ద్వారా ఇవాళ గుంటూరు కోర్టులో ఆయన్ను హాజరుపరుస్తున్నారని తెలిపింది. ఇదే విధంగా అంబటి రాంబాబుపై నమోదైన పలు కేసులకు సంబంధించి పిటి వారెంట్లు (PT Warrant) వేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు నెట్టింట ఆరోపణలు చేస్తోంది.

Advertisement

Also Read: Uday kiran: మనసంతా నువ్వే రీ రిలీజ్.. స్పెషల్ వీడియో పంచుకున్న ఉదయ్ మేనల్లుడు!

గతంలో పోసానికి ఇంతే..!

ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ (APSFTTDC) ఛైర్మన్ గా వ్యవహరించారు. అయితే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసభ్య పదజాలంతో వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో ఆయనపై గత ప్రభుత్వంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 17 కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. పోసానిపై నమోదైన కేసులను పోలీసులు రీ-ఓపెన్ చేశారు. ఆయన్ను అరెస్టు సైతం చేశారు. అంతేకాకుండా పిటి వారెంట్ పేరుతో పలు జిల్లాలోని కోర్టులకు ఆయన్ను నిరంతరం తిప్పుతూనే వచ్చారు. ఒక కేసులో బెయిల్ వచ్చినా మిగతా కేసుల్లో రిమాండ్ ఆదేశాలు ఉండటంతో పోసాని చాలా రోజుల పాటు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి తాను రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితికి పోసాని వెళ్లారు. ఈసారి అంబటి రాంబాబు విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందా? అన్న అనుమానాలను వైసీపీ వ్యక్తం చేస్తోంది.

Also Read: Bomb Threat: ఢిల్లీలో బాంబు కలకలం.. పాఠశాలలకు బెదిరింపులు.. ఉత్కంఠలో తల్లిదండ్రులు

Related News

మాజీ స్పీకర్ తమ్మినేని చుట్టూ ఉచ్చు.. సీతారాం, కుటుంబసభ్యులపై కేసు, ఏం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

Big Stories

Advertisement
×