Vivo V70 Series: ప్రముఖ వివో బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఈ కంపెనీ తీసుకొచ్చే మొబైల్స్ కెమెరాల ద్వారా వచ్చే హై ఫొటోలను యువత బాగా ఇష్టపడతారు. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగానే త్వరలో విడుదల కాబోతున్న ‘Vivo V70’ సిరీస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సిరీస్ విడుదల తేదీ గురించి సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. తాజా లీకులు మాత్రం దీనిపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ లైనప్‌లో Vivo V70, Vivo V70 Elite అనే రెండు మోడల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రముఖ టెక్ నివేదికల ప్రకారం.. వివో ఈ కొత్త V70 సిరీస్‌ను భారత్‌లో ఫిబ్రవరిలో లాంచ్ చేయవచ్చని అంచనా. దీని ప్రత్యేకత ఏంటంటే.. Vivo V సిరీస్‌లో తొలిసారిగా ZEISS, Sony, Qualcomm, Vivo టెక్నాలజీలను ఉపయోగించడం. అలాగే ZEISS లెన్స్ ట్యూనింగ్‌ను Sony పెద్ద ఇమేజ్ సెన్సార్‌లతో కలిపి, ఫొటోల్లో మెరుగైన లైట్ క్యాప్చర్, క్లారిటీ అందించాలనే లక్ష్యంతో Vivo ఈ సిరీస్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికితోడు.. ఈ ఫోన్ AI ఇమేజ్ ప్రాసెసింగ్, తక్కువ లైటింగ్‌లోనూ హై క్వాలిటీ ఫొటోలు అందించేలా సరికొత్త అనుభవాన్ని కలిగి ఉండటం మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది.
Also Read: భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్.. వన్‌ప్లస్ నార్డ్ 6తో పాటు టర్బో 6 సిరీస్ విడుదల!
ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. Vivo V70, V70 Elite ఫోన్లు OriginOS 6తో ఎలాంటి మార్పులు చేయకుండా ఉపయోగించగలిగే తొలి V సిరీస్ మోడల్స్‌గా నిలవనున్నాయి. Origin Island, Office Kit, Flip Cards వంటి ఫీచర్లతో యూజర్ ఇంటర్‌ఫేస్ మరింత స్మూత్‌గా, ప్రీమియంగా ఉండబోతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే Elite మోడల్లో ఇప్పటివరకు V సిరీస్‌లో చూసిన దానికంటే.. శక్తివంతమైన Qualcomm ప్రాసెసర్ ఇవ్వనున్నట్లు లీకులు సూచిస్తున్నాయి.
మరోవైపు.. స్టాండర్డ్ Vivo V70 మోడల్ చైనాలో విడుదలైన Vivo S50కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండవచ్చన్న ప్రచారం కూడా ఉంది. అది నిజమైతే.. ఈ ఫోన్‌లో 6.59 ఇంచుల 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ బ్రైట్‌నెస్ వంటి ప్రీమియం స్పెసిఫికేషన్లు ఉండవచ్చు. ఇకపోతే పనితీరు కోసం Snapdragon 8s Gen 3 చిప్‌సెట్, గరిష్టంగా 16GB LPDDR5X RAM, 512GB UFS 4.1 స్టోరేజ్ వచ్చే అవకాశం ఉంది.
ఈ హ్యాండ్ సెట్ కెమెరా సెటప్ కూడా హైలైట్‌గా నిలవనుంది. ఫోన్ వెనుక భాగంలో 50MP OIS ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చని సమాచారం. ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరా ఇవ్వవచ్చని అంచనా. ఇవన్నీ కలిపి.. ఈ సిరీస్‌ను ఫొటోగ్రఫీ ప్రియుల కోసమే రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Vivo V70 సిరీస్ బ్యాటరీ పరంగా చూస్తే.. 6,500mAh భారీ బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద.. Vivo V70 సిరీస్ స్టైలిష్ డిజైన్, ఫ్లాగ్‌షిప్ కెమెరా అనుభవం, శక్తివంతమైన పనితీరుతో మిడ్ టు ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వబోతుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలా? జనవరిలో మోస్ట్ ట్రెండ్ అవుతున్న ఆండ్రాయిడ్ మొబైల్స్ లిస్ట్ ఇదే!