Vivo vs Realme Comparison: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో వినిపించే ప్రముఖ పేర్లలో రెండు బ్రాండ్లు వివో vs రియల్‌మీ. చైనా బ్రాండ్స్ అయిన ఈ రెండు కంపెనీలు తక్కువ ధరల నుంచి మధ్యస్థాయి, అలాగే ప్రీమియం సెగ్మెంట్ వరకు విభిన్న రకాల ఫోన్లను అందిస్తున్నాయి. యూజర్ల అవసరాన్ని బట్టి విభిన్న మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే కొత్త ఫోన్ కొనాలనుకునే వారు ఎక్కువగా ఈ రెండు బ్రాండ్ల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి ఏది బెస్ట్ ఫోన్ అనేది చూద్దాం.
స్టైలిష్ డిజైన్, అద్భుతమైన డిస్ ప్లేలో వివో ప్రత్యేకత
వివో ఎప్పటినుంచో స్టైలిష్ డిజైన్, సన్నని బాడీ, కలర్‌ఫుల్ డిస్ప్లేలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చేతిలో పట్టుకున్నా ప్రీమియం ఫీలింగ్ వచ్చేలా డిజైన్ చేస్తుంది. ముఖ్యంగా అమోలేడ్ డిస్‌ప్లే టెక్నాలజీతో వచ్చే వివో మోడల్స్‌లో కలర్స్ చాలా వైవిడ్‌గా, బ్రైట్నెస్ కళ్లకు బాగా కనపడేలా ఉంటుంది. వీడియోలు చూడటం, సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేయడం, సినిమాలు స్ట్రీమ్ చేయడం ఇవన్నీ మరింత లైఫ్‌లా అనిపిస్తాయి. ఇది వివో ఫోన్లను ఎంటర్టైన్మెంట్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్‌గా నిలబెడుతుంది.
కెమెరా టెక్నాలజీలో ముందున్న వివో ఫోన్లు
వివో బ్రాండ్‌కి మరొక ప్రత్యేకత అంటే కెమెరా టెక్నాలజీ. “కెమెరా & మ్యూజిక్” అనే ట్యాగ్‌లైన్‌తోనే మొదలు పెట్టిన వివో, ఇప్పటికీ ఫోటోగ్రఫీని ప్రేమించే వారికి ఫేవరెట్‌గా ఉంది. నైట్ మోడ్, పోర్ట్రెయిట్ ఎఫెక్ట్స్, ఓఐఎస్ సపోర్ట్, హై రిజల్యూషన్ సెల్ఫీ కెమెరాలు ఇవన్నీ వివో ఫోన్లలో ఎక్కువగా కనపడతాయి. యూజర్ కేవలం క్లిక్ చేస్తే సరిపోతుంది, ఇమేజ్ ప్రాసెసింగ్ ఆటోమేటిక్‌గా సూపర్‌గా తయారవుతుంది. అందుకే “సెల్ఫీ లవర్స్” కి వివో ఫోన్లు సరిగ్గా సరిపోతాయి.
Also Read: Vivo vs Realme comparison: మోటరోలా vs రెడ్‌మీ అసలైన కింగ్ ఎవరు? బడ్జెట్ ఫోన్లలో బెస్ట్ ఎవరు?
పర్ఫార్మెన్స్, గేమింగ్‌లో యూత్‌కి ఫేవరెట్ రియల్‌మీ
ఇక రియల్‌మీ విషయానికి వస్తే, ఈ బ్రాండ్ మార్కెట్‌లోకి వచ్చి చాలా తక్కువ టైమ్‌లోనే యంగ్ జనరేషన్‌కి హార్ట్‌ఫేవరెట్ అయింది. రియల్‌మీ ఫోన్లలో ఎక్కువగా స్నాప్‌డ్రాగన్ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ ప్రాసెసర్లు వాడుతారు. ఇవి గేమింగ్ కోసం బలమైన పనితీరును అందిస్తాయి. పబ్‌జీ, ఫ్రీ ఫైర్, బిజిఎంఐ, సీఓడి లాంటి హెవీ గేమ్స్‌ని కూడా ల్యాగ్ లేకుండా రన్ చేయగలిగే పవర్ రియల్‌మీ డివైసెస్‌కి ఉంటుంది. అంతేకాకుండా మల్టీటాస్కింగ్, హై స్పీడ్ యాప్స్ వాడటం, దీర్ఘకాలం గేమ్ ఆడటం ఇవన్నీ రియల్‌మీతో చాలా ఈజీ అవుతాయి.
బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్‌లో రియల్‌మీ ఆధిపత్యం
బ్యాటరీ విషయానికి వస్తే ఇరువురూ 5000mAh వరకు ఇస్తారు. కానీ ఫాస్ట్ ఛార్జింగ్‌లో మాత్రం రియల్‌మీ ముందుంటుంది. 65W నుంచి 100W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వడం రియల్‌మీ స్పెషాలిటీ. అంటే కేవలం 30 నిమిషాల్లోనే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిపోతుంది. రోజంతా హెవీ యూజ్ చేసినా కూడా కేవలం కొద్ది నిమిషాలు ఛార్జ్ చేస్తే మళ్లీ అవాంతరం లేకుండా వాడుకోవచ్చు. ఈ ఫీచర్ యంగ్ యూజర్లను బాగా ఆకట్టుకుంటుంది. వివో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తుంది కానీ రియల్‌మీ లా ఆ స్థాయిలో స్పీడ్ ఉండదు.
సాఫ్ట్‌వేర్ అనుభవం – ఫన్‌టచ్ ఓఎస్ vs రియల్‌మి యూఐ
సాఫ్ట్‌వేర్ పరంగా వివోలో ఉండే ఫన్‌టచ్ ఓఎస్ ప్రత్యేకంగా కెమెరా, థీమ్స్, కస్టమైజేషన్‌కి అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు అవసరం లేని యాప్స్ ఉండటం యూజర్లకు ఇష్టం ఉండకపోవచ్చు. మరోవైపు రియల్‌మీలో వచ్చే రియల్‌మి యూఐ చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా ఉంటుంది. క్లీన్ లుక్ కావాలనుకునే వారికి రియల్‌మి యూఐ
మరింత బాగుంటుంది. యూజర్ ఎక్స్‌పీరియెన్స్ విషయానికి వస్తే రెండింటికీ తమదైన బలహీనతలు, బలాలు ఉన్నాయి.
ఎవరి కోసం వివో? ఎవరి కోసం రియల్‌మీ?
మొత్తం విషయానికి వస్తే, వివో ఫోన్లు లుక్, డిస్ప్లే, కెమెరా క్వాలిటీ పరంగా ముందుంటే, రియల్‌మీ ఫోన్లు పనితీరు, గేమింగ్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా ముందుంటాయి. ఫోన్ ఎంచుకోవడం పూర్తిగా యూజర్ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
స్టైలిష్‌గా ఉండే ఫోన్ కావాలి, మంచి ఫొటోలు తీయాలి, సోషల్ మీడియాలో ఫోటోగ్రఫీని ఎంజాయ్ చేయాలి అనుకునే వారు వివో వైపు వెళ్ళాలి. గేమింగ్, స్పీడ్, దీర్ఘకాలం బ్యాటరీ లైఫ్, తక్కువ సమయంలో ఛార్జింగ్ కావాలి, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ కావాలి అనుకునే వారు రియల్‌మీ వైపు వెళ్ళాలి. రెండు బ్రాండ్లూ తమ తమ రంగాల్లో బలంగా ఉన్నాయి. కాబట్టి మీ అవసరాలు ఏవో బట్టి వివో లేదా రియల్‌మీ ఎంచుకోవడం మంచిది.