Pakistan Prime Minister: పాకిస్తాన్ ప్రధాని షహబాష్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో చాలా ఎక్కువ చేశాడు. ఇన్ఫాక్ట్ చాలా చత్తగా మాట్లాడాడు. హిందుత్వవాదం ప్రపంచానికి డేంజర్ అని అన్నాడు. యుద్ధంలో తామే గెలిచామని అన్నాడు. కాశ్మీర్ పై భారత్ పెత్తనం పోయే రోజు దగ్గరలోనే ఉందని అన్నాడు. అసలు ఐక్యరాజ్య సమితిలో సంబంధం లేని దిక్కుమాలన స్పీచ్ ఇచ్చి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు.
భారత్ పై విషం కక్కిన పాక్ ప్రధాని షరీఫ్
పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏది పడితే అది మాట్లాడి ఇండియా పై నాలుగు రాళ్లు వేసి వెళితే ఓ పనైపోతుంది అనుకున్నాడేమో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80 వ సమావేశాల్లో నోటికవచ్చింది మాట్లాడాడు. అయితే పాక్ పీఎం ఒకవేళ భారత్ వైపు చూపిస్తే నాలుగు వేళ్ళు పాకిస్తాన్ వైపే చూపిస్తాయని మర్చిపోయాడేమో.. ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి షహబాజ్ షరీఫ్ కొత్త రాగం అందుకున్నట్లుగా యునైటెడ్ నేషన్స్‌లో మాట్లాడిన సీన్లు చూస్తే అర్థమయ్యే విషయం. ద్వేషపూరిత ప్రసంగాలకు ఏ వ్యక్తి పైన లేదా ఏదైనా మతం పైన హింసకు తావు ఉండకూడదని భారత హిందుత్వ అతివాదం ద్వేషపూరిత భావజాలం మొత్తం ప్రపంచానికే డేంజర్ అంటూ మాట్లాడాడు షరీఫ్. అంతేకాదు ఎప్పటిలాగే కాశ్మీర్ గురించి ప్రస్తావించారు. తాను కాశ్మీరి ప్రజలకు అండగా నిలుస్తానని పాకిస్తాన్ కూడా వారితో అండగా నిలుస్తుందని త్వరలోనే ఒకరోజు కాశ్మీర్లో భారతదేశ పెత్తనం ఆగిపోతుందని హామీ ఇస్తున్నానఅన్నాడు.
ఉగ్రవాదులందరికీ షెల్టర్ ఇస్తున్నదెవరు?
పాక్ పిఎంఓ నోటి నుంచి వచ్చిన ఈ మాటల్ని చూసిన వారు అసలు అది నోరా మరి ఇంకోటా అన్నట్లుగా ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే సొంత దేశంలో బలుచిస్తాన్ వాసుల్ని పీడించుకు తినటం ఖైబర్ పంక్తుంక్వాలు మానవ హక్కుల ఉల్లంఘనలు ఉగ్రవాదులందరికీ షెల్టర్ ఇవ్వటం వారి అంత్యక్రియల్లో బహిరంగంగా పాల్గొనటం ఇవన్నీ చూసిన వారికి పాక్ పీఎం ఏం జవాబు చెప్తారు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళిందన్నట్లుగా ఉంది కథ ఇదే విషయంపై అదే ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ ఘాటువాని తిప్పికొట్టింది. భారత ప్రతినిధి పెటల్ గెహలట్ పాక్ ప్రధానిని కార్నర్ చేశారు.
పాక్ ప్రధానిది కొత్త డ్రామా అన్న భారత్..
అసలు పాకిస్తాన్ ఏ మంచి పని చేసిందని భారత్ ప్రతినిధి కౌంటర్ ఇచ్చారు. పాక్ ప్రసంగానికి సమాధానం ఇచ్చే హక్కును భారత్ వినియోగించుకుంటూ పాకిస్తాన్ను తీవ్రంగా విమర్శించారు గెహ్లాక్ సభలో పాకిస్తాన్ ప్రధానమంత్రి అసంబద్ధ డ్రామా ప్రదర్శించాడని తమ విదేశాంగ విధానంలో కీలకమైన ఉగ్రవాదాన్ని కీర్తించారని గుర్తు చేశారు. టెర్రరిజం లో పాకిస్తాన్ రికార్డ్ ఎప్పటికీ చెరిగిపోదని ప్రపంచానికి ఉగ్రవాదులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎలా ఆశ్రయం కల్పించిందో ఒసమా బిన్లాడన్ విషయాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదంపై యుద్ధంలో భాగస్వామిగా నటిస్తూనే దశాబ్దం పాటు ఒసామా బెన్లాడెన్ కు షెల్టర్ ఇచ్చారన్నారు. దశాబ్దాలుగా తాము టెర్రర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని ఆ దేశ మంత్రులు ఇటీవలె అంగీకరించారని పైగా ఆపరేషన్ సింధూర్ అటాక్స్ లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అధికారులు హాజరయ్యారని గుర్తు చేశారు. అది మర్చిపోయి ఇప్పుడు షహబాజ్ షరీఫ్ కొత్తగే మొదలు పెట్టారన్నారు.
TRFను కాపాడుతున్నది పాకిస్తాన్ కాదా?
దేర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి టెర్రర్ గ్రూప్లను పాకిస్తానే కాపాడుతుందని భారత్ ఆరోపించింది. ఆపరేషన్ సింధూర్ టైంలో పార్క్ లో ధ్వంసమైన రన్వేలు విక్టరీలు కనిపిస్తే పాక్ ఎంజాయ్ చేయొచ్చని సెటైర్ వేశారు పెటల్ గెహ్లాట్ సో భారత్ ను ఏమి చేయలేక పొలిటికల్ గా ఏడుపు ఏడవటం తప్ప యూఎన్ లో పాక్ పీఎం షహబాజ్ షరీఫ్ చేసిందే ఏమి లేదు. హిందూ అతివాదం అన్న మాట పాక్ ప్రధాని నోట రావటం అటెన్షన్ డైవర్షన్ కోసమే. సొంత దేశంలో జరుగుతున్న అరాచకాలను పక్కన పెట్టేసి పక్క దేశంలో లేని విషయాలను ప్రస్తావించడమే పెద్ద జోక్. నిజానికి పాకిస్తాన్లో మైనారిటీస్ గా ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి? స్వాతంత్రం వచ్చినప్పుడు ఎందరున్నారు? ఇప్పుడు ఉన్నది ఎందరు? బలుచిస్తాన్ వాసుల హక్కులని కాలరాస్తున్నది ఎవరు? వాళ్ళు పాక్లో భాగం కాదా చెబుతూ వెళ్తే కథ చాలా దూరం వెళ్తుంది.
పాక్ లో హిందువుల జనాభా 2 శాతానికి ఎలా తగ్గింది?
1947లో పార్క్ ఏర్పడినప్పుడు హిందువుల సంఖ్య 24%గా ఉండేది. అది 2025 నాటికి 2 శాతనికి తగ్గింది. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది ఇది మతపరమైన అసహనం కాదా బలవంత మత మార్పిడిలు దాడుల వల్ల జరిగింది. దీనికి పాక్ ప్రధాని షరీఫ్ ఏం జవాబు చెప్తాడు? 2025 లో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ రిపోర్ట్ ప్రకారం సెంత్ ప్రావిన్స్ లో బలవంత వివాహాలకు గురయ్యారని తేల్చింది. 2025 లో 100కు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి అంటున్నారు. పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు లేవంటున్నారు. తప్పుడు కేసుల ద్వారా హిందువులను టార్గెట్ చేస్తున్న విషయాలను ప్రస్తావిస్తున్నారు. USCIRF అంటే యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ 2025 లో పార్క్ ను స్పెషల్ వాచ్ లిస్ట్ లో ఉంచింది. ఎందుకంటే అక్కడ మైనారిటీలైన హిందువులపై అగాయిత్యాలను ఈ సంస్థ గుర్తించింది. డిజిటల్ హెడ్ పెరుగుతుంది అక్కడ. అసలు షహబాష్ షరీఫ్ చెప్పిన దానికి యుఎన్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన దానికి అసలు సంబంధం ఉందా అన్న పాయింట్ తెరపైకి వస్తుంది.
బలూచిస్తాన్ వాసులకు పాక్ చుక్కలు
ఇక బలుచిస్తాన్ విషయం చూద్దాం. అక్కడ రోజు నిత్య సంఘర్షణే నిజానికి పాకిస్తాన్ భూభాగంలో 44% బలుచిస్తాంది. అయినా సరే వారికి నిధులు నీళ్లు సౌకర్యాల విషయంలో ఏమాత్రం సహాయం చేయట్లేదు పాక్ పాలకులు అందుకే వారు తిరగబడుతున్నారు. ఈ ఏడాది అయితే ఇంకా మానవ హక్కుల ఉల్లంఘనలు విపరీతంగా పెరిగాయని సాక్షాత్తు యూన్ ఎక్స్పర్ట్స్ ఏప్రిల్లో పాక్ ను హెచ్చరించారు. దేనికి ఏం జవాబు చెప్తావు షహబాజ్ హ్యూమన్ రైట్స్ వాచ్ 2025 రిపోర్ట్ ప్రకారం బలుచిస్తాన్ లో పాక్ మిలిటరీ పికప్ అండ్ డంప్ అంటే అపహరణ టార్చర్ డంప్ విధానాన్ని అమలు చేస్తోంది.
పదేళ్లు లాడెన్‌ను దాచడంపై ఇచ్చే జవాబేంటి?
బలోచ్వాసులు సహజ వనరులైన గ్యాస్ మినరల్స్ పై హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ వీటిని అణచివేయటం లేదా హిందూ అతివాదం అంటూ మాట్లాడుతున్న షహబాజ్ షరీఫ్ 10ఏళ్ళు లాడన్ను తమ దేశంలో ఎందుకు దాచి ఉంచారో చెప్పే దమ్ము ధైర్యం ఉందా.. అసలు పాకిస్తాన్లో అంతర్గత సంక్షోభాలు ఎన్నో ఉన్నాయి. ఎకానమీ క్రైసిస్ ఉంది. రాజకీయ అస్థిరత ఉంది. ఏ ఎన్నికలు పెట్టినా అవి వివాదస్పదంగానే ఉన్నాయి. టెర్రర్ ఇండెక్స్‌లో పాకిస్తాన్ రెండు స్థానంలో ఉంది. ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకొని భారత్ పై విమర్శలు చేయడం ద్వారా పాక్ ప్రజల దృష్టి మళ్ళీ ప్రయత్నం తప్ప మరొకటి కాదు.
Also Read: నాగార్జునసాగర్ జలాశయానికి పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత నీటి విడుదల
ఇంత మాట్లాడిన షహబాజ్ షరీఫ్ భారత్లో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నాడు. ఇది ఎంత పెద్ద జోక్ సరే భారత్ తో చర్చలు జరపాలంటే నిజంగా శాంతి కావాలనుకుంటే పాక్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలి. మోస్ట్ వాంటెడ్ పార్క్ టెర్రరిస్టులను భారత్‌కు అప్పగించాలి. ఇది జరుగుతుందా? భారత్ పాక్ మధ్య ఏ సమస్య వచ్చినా ద్వైపాక్షికంగా చూసుకోవాలి. ట్రంప్ లాంటి థర్డ్ పార్టీ ప్రమేయం ఉండకూడదు. కానీ ఇటీవలి ఉద్రిక్తతలను ట్రంప్ ఆపారని ఆయన గొప్ప శాంతిదూత అని వర్ణించడం షరీఫ్ కే చెల్లింది. పాక్ చేస్తున్న న్యూక్ త్రెట్స్ ను ఇండియా చాలా లైట్ తీసుకుంటుందని యూఎన్ లో భారత ప్రతినిధి గట్టిగానే తిప్పికొట్టారు.