Motorola vs Redmi comparison: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మోటరోలా, రెడ్‌మీ బ్రాండ్లు పెద్ద పాపులారిటీని సంపాదించుకున్నాయి. కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఈ రెండు పేర్లు తప్పక వినిపిస్తాయి. బడ్జెట్ నుంచి మిడ్‌రేంజ్ వరకు వీటి మోడల్స్ అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువ మంది ఈ రెండు బ్రాండ్ల మధ్యలోనే పోలిక చేసి నిర్ణయం తీసుకుంటారు.
డిస్ ప్లే & డిజైన్ అనుభవం
రెడ్‌మీ డిస్ ప్లే విషయంలో ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఎక్కువ మోడళ్లలో అమోలేడ్ ప్యానెల్స్ ఇస్తుంది. 90Hz, 120Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది. గేమింగ్, మూవీస్, సోషల్ మీడియా స్క్రోలింగ్‌లో ఇవి అద్భుతంగా అనిపిస్తాయి. మోటరోలా కూడా ఈ మధ్యలో అమోలేడ్ డిస్ ప్లేలను తన ఫోన్లలో ఇస్తోంది. కానీ కొన్ని మోడళ్లలో మాత్రం ఇంకా ఎల్‌సిడి స్క్రీన్లు ఉంటాయి. డిజైన్ విషయానికి వస్తే రెడ్మీ ఎక్కువగా ట్రెండీ, యూత్‌ఫుల్ లుక్ ఇస్తే, మోటరోలా సింపుల్, ప్రొఫెషనల్ లుక్‌తో కనిపిస్తుంది.
సాఫ్ట్‌వేర్ – క్లీన్ vs కస్టమైజేషన్
మోటరోలా ఫోన్ల ప్రధాన బలం స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం. అదనపు యాప్‌లు ముందే లోడ్ చేయబడకపోవడం వల్ల ఫోన్ చాలా లైట్‌గా ఉంటుంది. సెక్యూరిటీ అప్‌డేట్స్, వెర్షన్ అప్‌డేట్స్ కూడా వేగంగా వస్తాయి. రెడ్మీ మాత్రం ఎమ్ఐయూఐ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది. ఇది యూజర్‌కి ఎక్కువ కస్టమైజేషన్ ఆప్షన్లు, ప్రత్యేక ఫీచర్లు ఇస్తుంది. థీమ్‌లు, డ్యుయల్ యాప్‌లు, స్పెషల్ మోడ్‌లు లాంటివి ఉపయోగకరంగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు యాడ్స్ రావడం యూజర్లకి అంత సౌకర్యంగా ఉండదు.
పనితీరు – గేమింగ్ శక్తి
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రెడ్మీ అధిక ర్యామ్, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌లతో బలంగా నిలుస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ లేదా స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్లు గేమింగ్‌లో కూడా సూపర్ పనితీరును ఇస్తాయి. మోటరోలా మాత్రం సింపుల్ యూజ్‌కి చాలా స్టేబిల్‌గా ఉంటుంది. హీట్ ఇష్యూలు తక్కువగా ఉండడం, ఆప్టిమైజేషన్ బాగా ఉండడం దీని ప్లస్ పాయింట్.
Also Read: Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు.. మూడు దశల్లో? రెండురోజల్లో నోటిఫికేషన్
కెమెరా తేడాలు
రెడ్మీ కెమెరా సెటప్ ఎక్కువ మెగాపిక్సెల్‌లతో వస్తుంది. AI ఫీచర్లు, నైట్ మోడ్, పోర్ట్రైట్ మోడ్ లాంటి ఆప్షన్లు ఫోటోలను స్టైలిష్‌గా చూపిస్తాయి. మోటరోలా కెమెరాలు అయితే ఎక్కువ న్యాచురల్ లుక్ ఇస్తాయి. ఎక్కువ ఫిల్టర్‌లు లేకపోయినా, ఫోటోలు క్లారిటీగా, ఒరిజినల్ కలర్స్‌తో వస్తాయి.
బ్యాటరీ – ఛార్జింగ్ వేగం
రెండు బ్రాండ్లలోనూ బ్యాటరీ సామర్థ్యం సాధారణంగా 5000mAh ఉంటుంది. కానీ ఛార్జింగ్‌లో రెడ్మీ ముందుంటుంది. 67W నుండి 120W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు ఇస్తుంది. కేవలం అరగంటలోనే పూర్తి బ్యాటరీ అయ్యే మోడల్స్ కూడా ఉన్నాయి. మోటరోలా కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తుంది కానీ అంత వేగంగా కాదు.
ధర – ఎవరు బడ్జెట్ ఫ్రెండ్లీ?
ధరలో రెడ్‌మీ ఫోన్లు ఎక్కువ ఫీచర్లను తక్కువ ధరలో అందిస్తాయి. ఎక్కువగా రూ.10,000 నుంచి రూ.20,000 మధ్యలో రెడ్మీ మోడల్స్ మార్కెట్‌లో హిట్టవుతాయి. మోటరోలా కూడా ఇలాంటి ధరలకే వస్తుంది కానీ ఫీచర్ల కంటే క్లీన్ సాఫ్ట్‌వేర్, స్టేబిల్ అనుభవాన్ని ఇస్తుంది. రెడ్‌మీ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇచ్చి డబ్బుకు తగ్గ విలువ ఇస్తే, మోటరోలా ఎక్కువ కాలం నిలకడగా పనిచేసే పనితీరుపై దృష్టి పెడుతుంది.
ఎవరికీ ఏది బెటర్?
సింపుల్ యూజ్, స్టేబిల్ సాఫ్ట్‌వేర్, ఎక్కువకాలం లాగ్ లేకుండా నమ్మకంగా పనిచేసే ఫోన్ కావాలనుకునే వారికి మోటరోలా మంచి ఆప్షన్. ముఖ్యంగా ఫోన్‌లో అవసరం లేని యాప్‌లు ఉండకూడదనుకునే వారు, క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం కోరుకునే వారు మోటరోలా వైపు మొగ్గుతారు. అలాగే పెద్దగా గేమ్స్ ఆడని, రోజువారీ పనులకు ఫోన్ వాడే వారికి ఇది సరైన ఎంపిక అవుతుంది.
అదే సమయంలో, కొత్త ఫీచర్లు ఎక్కువగా కావాలని, కెమెరా లో స్టైల్‌గా ఫోటోలు రావాలని, గేమ్స్ ఆడటానికి శక్తివంతమైన ప్రాసెసర్ అవసరమని అనుకునే వారికి రెడ్‌మీ బెటర్. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వల్ల తక్కువ టైమ్‌లోనే ఫోన్ ఫుల్ బ్యాటరీ అవుతుంది. అలాగే స్టైలిష్ డిజైన్‌తో కనిపించడం యువతరాన్ని ఆకర్షించే ప్రధాన కారణం.