Chennai News: కరూర్ తొక్కిసలాట ఘటనతో తమిళగ వెట్రి కజగం-టీవీకె పార్టీలో నిరాశ అలముకుంది. ఈ ఘటన నుంచి పార్టీ నేతలు బయటకు వస్తారా? కొన్నాళ్లు సైలెంట్‌గా ఉండాలని డిసైడ్ అయ్యారా? ఇంతకీ అధినేత విజయ్ మనసులో ఏముంది? ఎవరితో మాట్లాడటానికి ఆయన ఇష్టపడలేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఏ విధంగా అడుగులు వేస్తారో?
కరూర్‌లో జరిగిన టీవీకె ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు. 100 మందికి అభిమానులు గాయపడ్డారు. తొక్కిసలాట ఘటనలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి అయ్యింది. 39 మంది మృతదేహాలు గుర్తించిన పోలీసులు, పోస్ట్‌మార్టం తర్వాత సంబంధిత కుటుంబాలకు అప్పగించారు.
మొత్తం 39 మందిలో 12 మంది పురుషులు, 17 మంది మహిళలు, 10 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనను నుంచి తేరుకునేందుకు టీవీకే పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. మృతుల కుటుంబాలకు ఇప్పటికే స్టాలిన్ ప్రభుత్వం 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెల్సిందే.
మృతుల కుటుంబాలకు TVK పార్టీ నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 20లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు అధినేత విజయ్. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.
ALSO READ: కరూర్ తొక్కిసలాట ఘటన.. ఏకసభ్య కమిషన్ విచారణ
కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తర్వాత అధినేత విజయ్ చెన్నై నివాసం వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. శనివారం రాత్రి నుండి ఇన్స్పెక్టర్ నేతృత్వంలో 15 మంది పోలీసులు నీలంకరాయ్ లోని విజయ్ ఇంటి వద్ద మోహరించారు. రోడ్డు అడ్డంగా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఆ దారిలో వెళ్ళే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు పోలీసులు.
అనుమానాస్పదంగా కనిపిస్తే, ఎవరినైనా ప్రశ్నించాలని ఉన్నతాధికారుల నుంచి దిగువ స్థాయి వరకు ఆదేశాలు వెళ్లాయి. విజయ్‌కు వై కేటగిరీ భద్రతను గతంలో కేంద్రం కేటాయించింది. దీంతో ఇప్పుడు అధికారులు చర్యలు చేపట్టారు. ఘటన తర్వాత ప్రజల ఆగ్రహం అతని వైపు మళ్లే అవకాశం ఉందని, అందుకే టీవీకే చీఫ్ ఇంటి వద్ద భద్రతను పెంచినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ సహా మరో నలుగురిపై కేసు నమోదు అయ్యింది. తమిళనాడు పోలీసులు PPDL చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంకోవైపు విజయ్‌ను అరెస్ట్ చేయాలంటూ అధికార డీఎంకేతోపాటు విపక్ష ఎఐడీఎంకే, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై టీవీకె నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు టీవీకే పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కరూర్ తొక్కిసలాట ఘటనపై ఆ పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
కరూర్ తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా తీసింది. తమిళనాడు ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. సీఎం స్టాలిన్, గవర్నర్‌కి ఫోన్ చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కరూర్ తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా
తమిళనాడు ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన హోం శాఖ
సీఎం స్టాలిన్, గవర్నర్‌కి ఫోన్ చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
తొక్కిసలాట ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్న అమిత్ షా#KarurTragedy #TVKVijay pic.twitter.com/oYcJLcO4FM
— BIG TV Breaking News (@bigtvtelugu) September 28, 2025