Ganesh Nimajjanam 2024: భాగ్యనగరంలో జరిగే గణేష్ ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. నేటికి వినాయక నవరాత్రులు పూర్తి అవుతుండగా.. ట్యాంక్ బండ్ తో పాటు నగరంలో నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన చెరువులు, కుంటల వద్ద గణనాథుల నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
11వ రోజు ఖైరతాబాద్ బడా గణేష్ సహా.. నగర నలుమూలల ఏర్పాటు చేసిన భారీ గణపతుల నిమజ్జనాలు జరగనున్నాయి. నిమజ్జనాలకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గణేష్ నిమజ్జనాల సందర్భంగా జీహెచ్ఎంసీ తరపున ట్యాంక్ బండ్, సరూర్ నగర్ ప్రాంతాల్లో భక్తులకు ఉచితంగా భోజనం, మంచినీరు అందించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి తెలిపారు.
అలాగే సెప్టెంబర్ 17, మంగళవారం హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు ఎప్పటిలాగే జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జనాలపై వచ్చే పుకార్లను నమ్మొద్దని తెలిపారు. నిమజ్జనాలపై అధికారులకు ప్రభుత్వం అన్ని ఆదేశాలు జారీ చేసిందని, ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గణేష్ నిమజ్జనాలను ఉత్సవంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. గణేష్ నిమజ్జనాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుందామని, అందుకు అందరూ సహకరించాలని కోరారు.
Also Read: నిమజ్జనం రోజు ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులారా బీ అలర్ట్!
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం విపక్షాలకు ఇష్టం లేనట్లుగా కనిపిస్తోందన్నారు. ఎలాంటి రాజకీయ ప్రకటన అయినా నిమజ్జనాలు ముగిసిన తర్వాతే చేయాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరిపైనైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. ట్యాంక్ బండ్ పై నిమజ్జనాల నిబంధనలను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఉల్లంఘించింది. బారికేడ్లను తొలగించి గణేష్ నిమజ్జనాలు చేశారు. ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై నిషేధం విధించి.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వాపోయింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించారు.
నేటి అర్థరాత్రితో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం నిలిపివేయనుండగా.. గణనాథుడిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఖైరతాబాద్ వైపు వెళ్లే దారులన్నీ రద్దీగా మారాయి. పిల్లా, పెద్ద అంతా కలిసి ఖైరతాబాద్ కు వెళ్తుండటంతో.. ఆ పరిసరాలన్నీ భక్తజనసంద్రాన్ని తలపిస్తున్నాయి. ఎల్లుండి ఉదయం 6 గంటలకు గణనాథుడి శోభాయాత్ర మొదలు కానుండగా.. రేపు నిమజ్జన శోభాయాత్రకు కావలసిన ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు దర్శనాలను
వినాయక నిమజ్జన ఏర్పాట్లు పూర్తి
17వ తేదీ(మంగళవారం) హైదరాబాద్లో జరిగే గణేశుడి నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించాం. ఎలాంటి అపోహలు, దుష్ప్రచారాలను నమ్మొద్దు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అందరం కలిసి నిమజ్జన ఉత్సవాలు ఘనంగా… pic.twitter.com/EORdYXrgpq
— BIG TV Breaking News (@bigtvtelugu) September 15, 2024