Samsung Galaxy S24 FE Launching Soon: భారతదేశం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్లలో శాంసంగ్ ఫోన్లు ఒకటి. ఈ కంపెనీ ఫోన్లకు ఫుల్‌గా డిమాండ్ ఉంది. ముఖ్యంగా శాంసంగ్ ఫోన్లు సామాన్యుల నుంచి ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. కొత్త ఫోన్లను అతి తక్కువ ధరలో లాంచ్ చేస్తూ మంచిగా గుర్తింపు పొందింది శాంసంగ్. ఇప్పటికే ఎన్నో మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చి సత్తా చాటిన కంపెనీ త్వరలో తన లైనప్‌లో ఉన్న మరో మోడల్‌ను ఫోన్ ప్రియులకు అందించేందుకు సిద్ధమైంది. త్వరలో Samsung Galaxy S24 FE ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఈ లైనప్‌లో రిలీజ్ అయిన Galaxy S23 FE అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ కారణంగానే కంపెనీ ఇప్పుడు దీనికి సక్సెసర్‌గా Samsung Galaxy S24 FEని లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్‌లతో సహా డిజైన్, ధర, ఇతర స్పెసిఫికేషన్ల గురించిన అనేక లీక్‌లు గత కొన్ని వారాలుగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ Galaxy S24 ఫ్యాన్ ఎడిషన్ డిజైన్, కలర్ ఆప్షన్‌లు గతంలో కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు ఐరోపాలో Galaxy S24 FE ధరలను వెల్లడయ్యాయి. దీనిబట్టి చూస్తే.. ఇది ఇప్పటికే ఉన్న Samsung Galaxy S23 FE కంటే ఖరీదైనదిగా కనిపిస్తుంది.
Samsung Galaxy S24 FE Specifications
Also Read: అమెజాన్ న్యూ సేల్.. వీటిపై 80 శాతం వరకు డిస్కౌంట్, దంచుడే దంచుడు!
Samsung Galaxy S24 FE మునుపటి Galaxy S23 FE మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో అల్యూమినియం మిడిల్ ఫ్రేమ్, గ్లాస్ రియర్ ప్యానెల్ ఉండే అవకాశం ఉంది. ఇది బ్లూ, గ్రీన్, గ్రాఫైట్, సిల్వర్/వైట్, ఎల్లో అనే ఐదు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. Samsung Galaxy S24 FE ఫోన్ Exynos 2400e చిప్‌సెట్‌ను కలిగి ఉంది.
ఇది 25W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4565mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంటున్నారు. ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఇది 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 10 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంటుంది.
Samsung Galaxy S24 FE Price
Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర EUR 799 (సుమారు రూ. 74,100) వద్ద లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే నిజం అయితే దీనికంటే ముందు మోడల్ Galaxy S23 FE 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర EUR 699 (దాదాపు రూ. 64,800)గా అందుబాటులో ఉంది. అంటే పాత మోడల్ కంటే కొత్త మోడల్ EUR 100 (దాదాపు రూ. 9,300) ఎక్కువగా చెప్పుకోవచ్చు. అలాగే Samsung Galaxy S23 FE 8GB + 128GB ధర రూ.54,999గా ఉంది. అదే సమయంలో 8GB + 256GB వేరియంట్ భారతదేశంలో రూ. 57,999గా నిర్ణయించబడింది.