E-Paper
Advertisement

ఈ దెబ్బకి ఐఫోన్ కెమెరాను మర్చిపోవాల్సిందే.. జైస్ కెమెరాతో Vivo X300 FE ఎంట్రీ!

ఈ దెబ్బకి ఐఫోన్ కెమెరాను మర్చిపోవాల్సిందే.. జైస్ కెమెరాతో Vivo X300 FE ఎంట్రీ!
Advertisement

Vivo X300 FE: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు వివో మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రీమియం X సిరీస్‌లో భాగంగా సరికొత్త ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తెచ్చేందుకు అంతా సిద్ధం చేస్తోంది. మొన్నటి వరకు వివో V70 FE గురించి మాట్లాడుకున్నాం కదా.. ఇప్పుడు అంతకు మించి అనేలా ‘Vivo X300 FE’ పేరుతో కొత్త ఫ్యాన్ ఎడిషన్ మొబైల్‌ను లాంచ్ చేయనుంది. గతేడాది వచ్చిన X200 FE కి ఇది నెక్స్ట్ లెవల్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ ఫోన్ ఎప్పుడు వస్తోంది? ఇందులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం రండి.

అందుబాటులోకి ఎప్పుడంటే?

తాజాగా టెక్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ మే నెల మొదటి వారంలోనే Vivo X300 FEని లాంచ్ చేసే ప్లాన్‌లో ఉంది కంపెనీ. చూడగానే ఆకట్టుకునే బ్లాక్, పర్పుల్, గ్రీన్ కలర్లలో ఈ ఫోన్ మెరిసిపోనుంది. మీకు ఈ ఫోన్ కావాలంటే వివో వెబ్‌సైట్‌లో గానీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి సైట్లలో గానీ బుక్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: షియోమీ విధ్వంసం.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో మిగతా ఫోన్లకు చెక్!

డిస్‌ప్లేకు ఫిదా అయిపోతారు..

మొదట ఈ ఫోన్ స్క్రీన్ గురించి చెప్పుకోవాలి. 6.31 అంగుళాల సైజులో 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో రానుంది. పైగా 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక ఫోన్ స్పీడ్ గురించి అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. దీనిలో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ వాడుతున్నారు. దీంతో హెవీ గేమింగ్ ఆడినా, ఎన్ని యాప్స్ వాడినా ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. అలాగే ఈ ఫోన్‌లో 16GB వరకు RAM, 512GB స్టోరేజ్ ఆప్షన్లు కూడా ఉండబోతున్నాయి.

కెమెరానే హైలైట్..

Advertisement

ఫొటోట్రఫీ లవర్స్ కోసం వివో ఎప్పుడూ స్పెషల్ కేర్ తీసుకుంటుంది. Vivo X300 FE లో కూడా Zeiss బ్రాండింగ్‌తో మూడు కెమెరాలు ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు, జూమింగ్ కోసం మరో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను అమర్చారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఏకంగా 6,500 mAh కెపాసిటీ అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజు రోజంతా ప్రశాంతంగా వాడుకోవచ్చు. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది కాబట్టి.. నిమిషాల్లో ఛార్జింగ్ అయిపోతుంది.

ధర విషయానికి వస్తే..

ఇన్ని ఫీచర్లు ఉన్నాయి కదా.. మరి ధర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? 12GB RAM వేరియంట్ రూ.54,999 ఉండవచ్చని టాక్ నడుస్తోంది. చూడటానికి చాలా స్లిమ్‌గా, స్టైలిష్‌గా ఉండటంతో పాటు పవర్‌ఫుల్ ఫీచర్లు ఉన్నాయి కాబట్టి.. ఈ రేంజ్ ఫోన్లలో గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. మే నెలలో లాంచ్ అయ్యాక దీని అసలు ధర ఎంతో మనకు క్లారిటీ వచ్చేస్తుంది.

Also Read: ఏసీయే ఉండాలా ఏంటి.. కర్టెన్లు, ఇండోర్ ప్లాంట్స్‌తో ఇంటి ఉష్ణోగ్రతను తగ్గించుకోండిలా!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×