E-Paper
Advertisement

షియోమీ విధ్వంసం.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో మిగతా ఫోన్లకు చెక్!

షియోమీ విధ్వంసం.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో మిగతా ఫోన్లకు చెక్!
Advertisement

Xiaomi 17 Max: టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న షియోమీ 17 సిరీస్‌‌లో మరో క్రేజీ స్మార్ట్‌ఫోన్ ‘Xiaomi 17 Max’ మరికొద్ది రోజుల్లో ఇండియన్ మార్కెట్‌లోకి రానుంది. ఇప్పటికే ఈ ఫోన్ ఫీచర్ల గురించి టెక్ వర్గాల్లో రచ్చ మొదలైంది. తాజా లీకుల ప్రకారం.. ఈ ఫోన్ వచ్చే మే నెలలో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే చాలా మోడల్స్ విడుదలైనప్పటికీ.. వీటన్నింటికీ బాప్ లాగా ఈ Max వెర్షన్ నిలుస్తుందని సమాచారం. అయితే ఈ ఫోన్ ధర దాదాపు రూ.90 వేల పైనే ఉండొచ్చని అంచనా.

6.9 అంగుళాల స్క్రీన్‌..

ఈ Xiaomi 17 Max ఫోన్ చూడటానికి ఎంత స్టైలిష్‌గా ఉంటుందో.. పనితీరులో కూడా అంతే స్పీడ్‌గా ఉండనుంది. దీనిలో 6.9 అంగుళాల పెద్ద స్క్రీన్‌ను ఇచ్చారు. దీంతో సినిమాలు చూడాలన్నా, గేమ్స్ ఆడాలన్నా మెరుగైన పనితీరును పొందొచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను వాడారు. తద్వారా ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు సరే కదా.. ఎలాంటి యాప్స్ వాడినా ఇట్టే పనిచేస్తుంది. భద్రత కోసం స్క్రీన్ పైనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది.

Advertisement

Also Read: ఏంది సామీ ఇది.. రూ.9,999కే 5G ఫోన్, అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు, 6.9 ఇంచుల డిస్‌ప్లేనా!

200 మెగాపిక్సెల్ కెమెరా..

ఇక కెమెరాల విషయంలో షియోమీ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఈ కొత్త ఫోన్‌లో ఏకంగా 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను ఇస్తున్నారు. దీనివల్ల ఫొటోలు ఒక రేంజ్‌లో వస్తాయి. ఒక ప్రొఫెషనల్ కెమెరాతో తీసినట్టు ఉంటాయి. వెనుక వైపు మరో రెండు 50 ఎంపీ కెమెరాలతో పాటు, సెల్ఫీల కోసం ముందు కూడా 50 ఎంపీ కెమెరాను అమర్చారు. ఇక ఫొటోగ్రఫీ పిచ్చి ఉన్నవారికి పండగే అని చెప్పాలి. ఇన్ స్టా రీల్స్ చేసేవారికి కూడా ఇది బాగా నచ్చుతుంది.

భారీ బ్యాటరీ సామర్థ్యం..

Advertisement

సాధారణంగా మనం ఫోన్లను రోజుకు రెండు మూడు సార్లు ఛార్జింగ్ పెడుతుంటాం. కానీ షియోమీ 17 మాక్స్‌లో ఏకంగా 8,000mah భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే హాయిగా రెండ్రోజుల పాటు వాడుకోవచ్చు. దీనికి తోడు 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్ చకచకా ఫుల్ అయిపోతుంది. వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. భారీ బ్యాటరీ కావాలనుకునే పవర్ యూజర్లకు ఈ ఫోన్ పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

Also Read: 10x ఆప్టికల్ జూమ్, 200MP కెమెరా.. ఈ ఫోన్ మీ చేతిలో ఉంటే ఇక మీరూ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరే!

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×