E-Paper
Advertisement

హైడ్రా ఎంట్రీతో టౌన్ ప్లానింగ్ బండారం బట్టబయలు.. మరీ ఇంత దారుణమా..?

హైడ్రా ఎంట్రీతో టౌన్ ప్లానింగ్ బండారం బట్టబయలు.. మరీ ఇంత దారుణమా..?
Advertisement

Illegal Constructions: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలోని ప్లానింగ్ విభాగం నిద్రావస్థలో ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం కేవలం భవన నిర్మాణ అనుమతుల జారీకే పరిమితమైందే తప్పా, అనుమతులు జారీ చేసిన తర్వాత నిర్మాణాలు తీసుకున్న అనుమతుల ప్రకారమే జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించటంలో విఫలమవుతుంది. ఫలితంగా అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మూడు కార్పొరేషన్ల పరిధిలోని ప్రైవేటు ఓపెన్ ప్లేస్ లలో శాశ్వత నిర్మాణాలు కాకుండా తాత్కాలికంగా షెడ్లు నిర్మించాలన్న టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి తప్పకుండా తీసుకోవాలన్న నిబంధన ఉంది. కానీ ఈ నిబంధన కేవలం సామాన్యులపైనే అమలు చేస్తున్నారే తప్పా, పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టే బడా నిర్మాణ సంస్థలకు మినహాయిస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.

బడా రియల్ ఎస్టేట్ సంస్థల..

కేవలం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్మాణ అనుమతులను జారీ చేయటమే గాక, క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి? జరుగుతున్న నిర్మాణాలు అనుమతులు తీసుకునే జరుగుతున్నాయా? లేక అక్రమంగా కొనసాగుతున్నాయా? అన్న విషయాన్ని కూడా ఫీల్డు లెవెల్ లో పరిశీలించాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ పైనే ఉన్నా, ఇప్పటి వరకు నిర్మాణాలు తీసుకుని చేపట్టిన నిర్మాణాల్లో ఏ ఒక్క నిర్మాణంలో మూడు కార్పొరేషన్ల అధికారులు ప్రాథమిక స్థాయిలో డీవియేషన్స్ గుర్తించిన దాఖలాల్లేవంటే టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఫీల్డు లెవెల్ డ్యూటీలు ఏ మేరకు నిర్వహిస్తుందో? అంచనా వేసుకోవచ్చు. ఐటీ హబ్ కి సమీపంలో కొన్ని బడా రియల్ ఎస్టేట్ సంస్థల ఆధీనంలో ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు వ్యక్తులు తమదేనంటూ క్లెయిమ్ చేస్తున్న నాలుగు ఎక‌రాల భూమిని కూడా హైడ్రా మంగళవారం భారీ ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకున్న సంగతి తెల్సిందే.

కొత్త షెడ్లు వేసిన విషయం..

Advertisement

ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్డులను కూడా హైడ్రా తొలగించింది. వాస్తవానికి ఇలాంటి విధులు జీహెచ్ఎంసీ నిర్వర్తించాల్సి ఉంది. షెడ్లు వేస్తున్న సమయంలోనే అడ్డుకోవల్సిన బాధ్యత స్థానిక మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులపైనే ఉంది. కానీ అధికారులు కొత్త షెడ్లు వేసిన విషయం తెలిసినా, కనీసం ఎవరు షెడ్లు వేశారు? అనుమతులున్నాయా? అన్న విషయాన్ని కూడా టౌన్ ప్లానింగ్ విభాగం పట్టించుకోలేదన్న విషయం హైడ్రా యాక్షన్ తో తేలిపోయింది. నేటికి చాలా ప్రైవేటు స్థలాల్లో అక్రమంగా షెడ్లను వేసి వ్యాపారాలను కొనసాగిస్తున్నా, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు కన్పించకపోవటం వారి విధి నిర్వహణకు నిదర్శనం.

Also Read: పెద్ద మనుసు చాటుకున్న ఎంపీ మల్లు రవి.. ఏం చేశారంటే..?

అమలు కానీ కమిషనర్ ఆదేశాలు

Advertisement

జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కార్పొరేషన్ కు ఆదాయం, తమకు అక్రమార్జన సమకూర్చే భవన నిర్మాణ అనుతులపైనే ఫోకస్ చేస్తున్నారే తప్పా, అక్రమ నిర్మాణాలు, నిర్మాణాలు జరిగే చోట ప్రమాద నివారణ ప్రమాణాలు పాటించని భవనాలపై కనీస చర్యలు చేపట్టకపోగా, పైగా ఈ విషయంలో కమిషనర్ జారీ చేసే ఆదేశాలను కూడా అమలు చేయటంలో విఫలమవుతున్నారు. కొద్ది రోజుల క్రితం టౌలీ చౌకీలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి ఇద్దురు కార్మికులు మృతి చెందగా, మరో కార్మికుడు తీవ్ర గాయాలపైన ఘటన తెల్సిందే.

నిబందనలు ఉల్లంగన..

ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందిన సమాచారం తెలియటంతో హుటాహుటీన అక్కడకు చేరుకున్న జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణదారుడు ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు పాటించకుండానే నిర్మాణం చేపట్టారన్న విషయాన్ని ధృవీకరించటంతో పాటు తీసుకున్న నిర్మాణ అనుమతులను ఉల్లంఘించి, అదనపు అంతస్తులను కూడా నిర్మిస్తున్నట్లు కమిషనర్ కు నివేదికలు పంపారు. ఆ భవనం మొత్తాన్ని కూల్చి వేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసినా, వాటిని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఆ భవనాన్ని కూల్చలేదు. ఆదేశాలను అమలు చేయటంలో టౌన్ ప్లానింగ్ అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఆ భవనాన్ని కూల్చకుండా ఓ ప్రజాప్రతినిధి అడ్డుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజకీయ వత్తిళ్లకు తలొగ్గిన టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్ ఆదేశాలను అమలు చేయకుండా పక్కన బెట్టినా, కనీస కమిషనర్ సైతం వారిని ప్రశ్నించకపోవటం గమనార్హం.

Also Read: గద్వాల్లో ఫుట్ పాత్‌లు మాయం.. నిత్యం నరకం చూస్తున్న వాహనాదారులు

Related News

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ..

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

Big Stories

Advertisement
×