Vivo X300 FE: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో నుంచి వస్తున్న లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Vivo X300 FE కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్. మే 14న ఇండియాలో రిలీజ్ అవుతున్న ఈ ఫోన్ ధర ఆన్‌లైన్‌లో చూస్తే రూ.79,999గా ఉంది. అమ్మో.. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టలేని అనుకునే వారి కోసం ఓ సూపర్ ట్రిక్ ఉంది. కాస్త తెలివిగా ఆలోచించి లోకల్ స్టోర్లలో (ఆఫ్‌లైన్) కొంటే భారీగా డబ్బులు మిగిలించుకోవచ్చు. అవును.. మీరు విన్నది నిజమే! రకరకాల ఆఫర్లతో ఈ ఫోన్ ధర అనూహ్యంగా తగ్గబోతోంది. ఆ వివరాలేంటో ఓసారి చూసేద్దాం రండి..
ఈ ఫోన్ అసలు ధర రూ.79,999. దీనిపై బ్యాంక్ ఆఫర్ కింద దాదాపు రూ.7,999 వరకు డిస్కౌంట్ వస్తుంది. అలాగే లోకల్ రిటైల్ స్టోర్లలో అదనంగా మరో రూ.5,000 నుండి రూ.6,000 వరకు తగ్గింపు ఉంటుంది. ఒకవేళ మీరు గనుక పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవాలనుకుంటే.. మరో రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీంతో Vivo X300 FEను కేవలం రూ.61,000 నుండి రూ.62,000 మధ్యలోనే సొంతం చేసుకోవచ్చు.
ఈ Vivo X300 FEను ఫొటోగ్రఫీ ప్రియుల కోసం స్పెషల్‌గా తయారు చేసినట్లుంది. దీనిలో ZEISS బ్రాండింగ్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరా, మరో 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. తద్వారా ఎంత దూరంలో ఉన్నా సరే ఫొటోలు మాత్రం క్లారిటీగా వస్తాయి. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. 6.31 అంగుళాల సైజులో ఉండే ఈ ఫోన్ చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. చిన్నగా ఉన్నా సరే క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది.
సాధారణంగా చిన్న సైజు ఫోన్లలో బ్యాటరీ త్వరగా అయిపోతుందని చాలామంది భయపడతారు. కానీ Vivo X300 FEలో ఏకంగా 6,500mAh బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇక స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. గేమ్స్ ఆడినా స్మూత్‌గా ఉంటుంది. ఆండ్రాయిడ్ 16తో వస్తున్న ఈ ఫోన్‌కు ఐదేళ్ల వరకు అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ భరోసా ఇచ్చింది.
మంచి ప్రీమియం ఫోన్ కొనుగోలు చేయాలి అది కూడా రీజనబుల్ ప్రైస్‌లో కావాలనుకుంటే ఈ Vivo X300 FE బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే.. రూ.80 వేల ఫోన్ ఆఫర్లతో రూ.62 వేలకే వస్తుందంటే మామూలు విషయం కాదు కదా. అయితే ఒక చిన్న సలహా.. ఫోన్ కొనే ముందు మీ చుట్టుపక్కల ఉన్న రెండు మూడు స్టోర్లలో రేట్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే.. ఒక్కో షాపులో డిస్కౌంట్లు మారుతుంటాయి. కాబట్టి.. మంచి డీల్ ఎక్కడ ఉంటే అక్కడ కొనుగోలు చేయడం ఉత్తమం.
Also Read: 50 డిగ్రీలకు పైగా ఎండ.. ఎడారి నగరాల్లో చల్లదనానికి వాడే చిట్కాలివే, మీరూ ఫాలో అయిపోవచ్చు!