E-Paper
Advertisement

ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో SIR.. ఆ తేదీల్లో ఇంటింటి సర్వే

ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో SIR.. ఆ తేదీల్లో ఇంటింటి సర్వే
Advertisement

SIR Phase 3: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియలో భాగంగా మూడో దశ (Phase 3) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఏపీ, తెలంగాణ, దిల్లీ, మహారాష్ట్ర సహా మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మూడోదశ పూర్తైన తర్వాత హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లద్దాఖ్ మినహా దేశమంతా ఎస్ఐఆర్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మూడోదశ SIRకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ను ఈసీ గురువారం విడుదల చేసింది.

16 రాష్ట్రాలు ఏవంటే?

ఈసీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో SIR ఫేజ్ 3 ప్రక్రియ కోసం భారీ ఎత్తున ఎన్నికల సిబ్బందిని కేటాయించింది. 3.94 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులను ఇందుకోసం నియమించింది. వారంతా 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 36.73 కోట్ల మంది ఓటర్ల ఇంటి వద్దకు వెళ్తారని స్పష్టం చేసింది. వీరికి రాజకీయ పార్టీలు నియమించిన 3.42 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లు సహకరిస్తారని పేర్కొంది. ఏపీ, తెలంగాణ, దిల్లీ, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, కేంద్రాపాలిత ప్రాంతాల్లో ఈ SIR ఫేజ్ 3 ప్రక్రియ జరగనుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఏ తేదీల్లో అంటే..

Advertisement

ఆయా రాష్ట్రాల్లో ఏ తేదీల్లో ఫేజ్ 3 ప్రక్రియ కొనసాగుతుందన్న వివరాలను సైతం తాజాగా షెడ్యూల్ లో ఈసీ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో జులై 21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ మధ్య ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ప్రక్రియ జరగనుంది. అలాగే తెలంగాణలో జులై 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 28 వరకూ ఓట్ల ముసాయిదా నిర్వహించనున్నారు. అనంతరం ఏపీలో సెప్టెంబర్ 22న, తెలంగాణలో అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Also Read: జియో యూజర్లకు భారీ షాక్.. రూ. 249 ప్లాన్ క్లోజ్.. ప్రత్యామ్నాయ బెస్ట్ ప్లాన్లు ఇవే!

పారదర్శకతకు పెద్దపీట

Advertisement

మరోవైపు SIR ఫేజ్ 3 ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దొంగ ఓట్లను ఏరివేయడానికి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడానికి ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలను ఎస్ఐఆర్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇవ్వడానికి గల కారణాలను సైతం ఈసీ వెల్లడించింది. ఎత్తైన కొండలు, పర్వతాలు, కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రస్తుతానికి వీటిని పక్కన పెట్టాల్సి వచ్చినట్లు స్పష్టం చేసింది.

Also Read: అప్పట్లో ఏసీలు లేవు.. మరి ఇళ్లు చల్లగా ఎలా ఉండేవి? తాతల నాటి టెక్నిక్స్ ఇవే!

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×