E-Paper
Advertisement

ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప దెబ్బ వ్యవహారం.. అసలు గుట్టు బయటకు, ఆ నటి మాటేంటి?

ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప దెబ్బ వ్యవహారం.. అసలు గుట్టు బయటకు, ఆ నటి మాటేంటి?
Advertisement

French President: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ని అతని భార్య చెంప దెబ్బ వ్యవహారం గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాని వెనుక ఓ బలమైన కారణం ఉందంటూ కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌కు చెందిన నటి గోల్షిఫ్తే ఫరహానీతో మెక్రాన్‌కు ఉన్న సంబంధమే ఆ చెంప దెబ్బకు కారణమని పేర్కొంది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప దెబ్బ వ్యవహారం మరోసారి చర్చ 

Advertisement

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ను ఆయన భార్య బ్రిగెట్ ఫారెన్ టూర్‌లో చెంప ఛెళ్లుమనిపించారు. దీనికి సంబంధించి జర్నలిస్టు ఫ్లోరియన్ టార్డిఫ్ తన కొత్త పుస్తకంలో అసలు విషయాలు ప్రస్తావించారు. గతేడాది ఫ్రెండ్ అధ్యక్షుడు విదేశీ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇరాన్ నటి గోల్షిఫ్తే ఫర్హానీతో మెక్రాన్‌ల చాటింగ్‌ను ఫోన్‌లో చూసిందట ఫ్రెంచ్ ఫస్ట్ మహిళ. దాన్ని తట్టుకోలేక భర్తపై కాసింత ఆగ్రహం వ్యక్తం చేయడమేకాదు, చెంప ఛెళ్లుమణిపించినట్టు ఫ్లోరియన్ యాన్-ఆల్‌మోస్టు పర్‌ఫెక్ట్ కపుల్‌ అనే పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ బుక్‌లో కొన్ని భాగాలను ఫ్రాన్స్ మీడియా ప్రచురించింది కూడా.

Advertisement

ఆ నటితో చాటింగ్ వ్యవహారం అసలు కారణమా?

గతేడాది వియత్నాం పర్యటనకు వెళ్లారు ఫ్రెండ్ అధ్యక్షుడు మెక్రాన్ దంపతులు. విమానం దిగడానికి ముందు అందరూ చూస్తుండగానే భర్త ముఖాన్ని పక్కకు తోసినట్టు అందులో ప్రస్తావించారు. దీనికి సంబంధించి వీడియో ఒకటి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను చిన్న విషయంగా కొట్టిపారేశారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్.

ఈ ఘటనకు ముందు మరో సందర్భంలో బ్రిగెట్ తన భర్త చెంప ఛెళ్లు మనిపించినట్టు తన పుస్తకంలో ప్రస్తావించాడు. మీరు ఆకర్షణీయంగా ఉంటారంటూ మెక్రాన్‌కు ఇరాన్ నటికి మెసేజీ పెట్టినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఇరాన్ నటి-మెక్రాన్ మధ్య కొన్నినెలల పాటు అదొక తరహా బంధం కొనసాగినట్టు తెలిపారు. వాస్తవాల ఆధారంగా ఈ పుస్తకాన్ని రాసుకొచ్చినట్టు స్పష్టం చేశారు సదరు జర్నలిస్టు.

ALSO READ: విహార నౌకల్లో ‘వైరస్’ కలకలం.. పర్యాటక ప్రియుల్లో పెరుగుతున్న ఆందోళన!

బ్రిగెట్ తరపు ప్రతినిధులు ఈ కథనాలను తోసిపుచ్చారు. బ్రిగెట్.. తన భర్త ఫోన్‌ను చెక్ చేయరని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇరాన్ నటి ఈ వార్తలను తోసిపుచ్చారు. తమ జీవితంలో ప్రేమ లేని ఈ తరహా వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ తనదైనశైలిలో వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై పుస్తకం రూపంలో కొన్నివిషయాలు బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×